
karthika deepam 3 january 2022 episode
Karthika Deepam 3 Jan Episode Highlights : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 3 జనవరి 2022, సోమవారం ఎపిసోడ్ 1238 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ చాలా బాధపడుతూ ఉంటాడు. తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడం తప్పే అని అనుకుంటాడు. కానీ.. పరిస్థితులు అలా చేయిస్తున్నాయి తప్పదు అని అనుకుంటాడు కార్తీక్. ఇంతతో కోటేశ్, శ్రీవల్లి బాబు ఏడుస్తుంటే ఆ బాబును ఎత్తుకొని కాసేపు ఓదార్చుతాడు. మరోవైపు కార్తీక్, దీప ఎక్కడున్నారో అని టెన్షన్ పడుతూ ఉంటారు సౌందర్య, ఆనందరావు. వారణాసిని పిలుస్తారు. దీప ఫోన్ చేసిందా అని అడుగుతుంది సౌందర్య. లేదు మేడమ్ అని అంటాడు వారణాసి.
karthika deepam 3 january 2022 episode
బస్తీలో మోనిత ఆసుపత్రికి పెట్టినప్పటికీ తనతో ఎవ్వరూ మాట్లాడటం లేదని చెబుతాడు వారణాసి. దీపక్క ఫోన్ చేస్తే నేను చెబుతాను మేడమ్. దీపక్క విషయంలో నాకు ఏం తెలిసన మీకు చెబుతాను మేడమ్. వెళ్లొస్తాను మేడమ్.. వెళ్లొస్తాను సార్ అంటాడు వారణాసి. అతడు వెళ్లాక నాకు ఇప్పుడు దైర్యం వచ్చిందండి అంటుంది సౌందర్య. కార్తీక్ ఎక్కడున్నా.. దీప పక్కన ఉంటే వాడు చాలా బాగుంటాడు అంటుంది. నా పెద్ద కోడలు దీప మీద బస్తీ వాళ్లు ఇంతలా అభిమానం చూపిస్తున్నారంటే అది వాళ్లలో ఎంతో ప్రభావితం చేసి ఉంటుంది. వాళ్లందరి మనసుల్లో గొప్పగా ఉందంటే ఇక భర్తను ఇంకెంత బాగా చూసుకుంటుందో కదండి అంటుంది సౌందర్య. తన కొడుకు గురించి ఆలోచించి కంటతడి పెడుతుంది సౌందర్య. మీరే అన్నారు కదా.. దీప కార్తీక్ ను ఎప్పుడూ ఓడిపోనివ్వదని.. అది నిజమేనండి అంటుంది సౌందర్య.
మరోవైపు.. గుడికి వెళ్లి వస్తున్న కోటేశ్, శ్రీవల్లికి యాక్సిడెంట్ చేయించి చంపిస్తుంది రుద్రాణి. ఈ విషయం తెలిసి కార్తీక్ రుద్రాణి దగ్గరికి వెళ్లి తనపై మండిపడతాడు. నువ్వసలు మనిషివేనా అంటూ తనపై సీరియస్ అవుతాడు. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా అని అడుగుతాడు.
వాళ్ల ప్రాణాలు తీసి నువ్వేం బాగుపడతావు అంటాడు కార్తీక్. ముందైతే నేను చంపించలేదు అని అంటుంది రుద్రాణి. తర్వాత తనే ఈ పాపం చేసినట్టు ఒప్పుకుంటుంది. కానీ.. నువ్వేం చేయలేవు అంటుంది. నువ్వు నా వాళ్లను కొట్టినా ఊరుకున్నాను. నీ భార్య నన్ను కొట్టినా ఊరుకున్నాను కానీ.. నా ఇంటికే పోలీసులను పంపించి నా మీద కేసు పెట్టిస్తారా అంటుంది రుద్రాణి.
నన్ను కొట్టిన పోలీస్ ట్రాన్స్ ఫర్ అయింద. మరి నా పగ, కోపం ఎవరి మీద చూపించాలి.. అని అంటుంది రుద్రాణి. అందుకే ఇద్దరినీ చంపించాను.. అంటుంది రుద్రాణి. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. నీకేదో బ్యాక్ గ్రౌండ్ గట్టిగా ఉన్నట్టుగా దీప మాట్లాడుతుంది కదా అంటుంది రుద్రాణి.
చేసిన తప్పులు ఒప్పుకొని పోలీస్ స్టేషన్ లో లొంగిపో లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. అంటాడు కార్తీక్. కానీ.. ఈ నీతి కథలు నాకు చెప్పకండి అంటుంది. నా బాకీ తీర్చుతానని సంతకం పెట్టారు కదా ముందు నా బాకీ తీర్చండి అని రుద్రాణి వార్నింగ్ ఇస్తుంది.
లేదంటే తెలుసు కదా. నీ కూతురు హిమను నేను దత్తత తీసుకుంటాను అని అంటుంది రుద్రాణి. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఏం చేయాలో కార్తీక్ కు అర్థం కాదు. హిమను ఎలాగైనా కాపాడుకోవాలని కార్తీక్ ఏం చేస్తాడో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.