
karthika deepam Today episode
Karthika Deepam 3 Nov Today Episode : బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్ ‘కార్తీక దీపం’ బుధవారం నాటికి 1187వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయింది. సీరియల్‌లో రోజురోజుకూ ట్విస్టులు పెరిగిపోతున్నాయని, ఇంకా ఆసక్తికరంగా సీరియల్ ఉంటుంన్నదని ప్రేక్షకులు అంటున్నారు. బుధవారం ఎపిసోడ్ హైలైట్స్ తెలుసుకుందాం..మోనితకు పుట్టిన బాబు వల్ల డాక్టర్ బాబుకు గండం ఉందన్న సంగతి దీపకు తెలుస్తుందా? లేదా? అనే సస్పెన్స్‌తో గత ఎపిసోడ్ ముగిసింది. తాజా ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. దీప ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లగా కారు డ్రైవ్ చేసుకుంటూ బయటకు వెళ్లిన సౌందర్యకు దీప కనబడుతుంది. దాంతో వంటలక్కను కారులోకి ఎక్కించుకుని సౌందర్య ఇంటికి బయలుదేరుతుంది. ఈ క్రమంలోనే దీప కనిపించిందనే విషయం కార్తీక్‌కు ఫోన్ చేసి చెప్తుంది. అయితే, అసలు విషయం దీపకు తెలిసిపోతుంది. ఎలాంగంటే..
karthika deepam Today episode
కార్తీక్‌కు దోషముందన్న సంగతి సౌందర్య కారులో కార్తీక్ పేరిట ఉన్న దోష నివారణ స్లిప్ చూసి కనిపెట్టేస్తుంది దీప. అలా దీపకు అసలు విషయం తెలియడంతో పాటు ఆమె మనసులో అనుమానాలు ఇంకా బలపడుతాయి. ఇకపోతే అప్పుడే సౌందర్య కార్తీక్‌కు ఫోన్ చేసి దోష నివారణ పూజ గురించి చెప్తుంది. అయితే, తన కారులో దీప ఉందని, ఇంతకంటే ఎక్కువేం చెప్పలేనని సౌందర్య అంటుంది. మరో వైపున ఆనందరావు దీపకు దోషం గురించి చెప్పాలని అంటాడు. కార్తీక్ బాధపడుతున్న సందర్భంలో విషయం చెప్పాల్సిందేనని అంటాడు. ఇంతలోనే సౌందర్య, దీప కారులో ఇంటికి వస్తారు.
దీపను చూసి పిల్లలు ఎటు వెళ్లావమ్మా అని అడుగుతారు. అప్పుడు దీప చెప్పిన సమాధానం కొంత బాధ కలిగిస్తుంది. తనను ఇబ్బంది పెట్టొద్దని, తాను చాలా ప్రశ్నలతో సతమమతమవుతున్నానని దీప అంటుంది. ఆ క్రమంలోనే పిల్లలను దీప తిన్నారా.. అమ్మా అని అడుగుతుంది. అందుకు వాళ్లు తినలేదని చెప్పడంతో దీప ఆవేశపెడుతుంది. శ్రావ్యపై సీరియస్ అవుతుంది. పిల్లలకు కనీసం తిండి కూడా పెట్టరా? తాను లేకపోతే ఇలానే పరిస్థితులు ఉంటాయా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది వంటలక్క. అప్పుడు కార్తీక్, ఆనందరావు పై నుంచి మెట్లు దిగుతుంటారు. దీప అలా మాట్లాడటం చూసి షాక్ అవుతారు. పిల్లలను తినాలని అడిగానని శ్రావ్య సమాధానం చెప్తున్నప్పటికీ ఆ సమాధానం దీప వినబోదు.
karthika deepam 30 october 2021 full episode
మీరు తిన్నారుగా… మీరు తింటే చాలు పసివాళ్లు తినకపోతే అలానే వదిలేస్తారా? అని అంటుంది. రేపు తాను చనిపోతే తన పిల్లలు అనాథలు అయిపోవాల్సిందేనా? అంటూ అరిచేస్తుంది దీప. ఇంతలోనే కార్తీక్ దీపను ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతుంది. అందుకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోతుంది దీప. ఇక పిల్లలకు అన్నం తినిపిస్తూ వాళ్లు పెట్టుకోకపోతే మీరైనా పెట్టుకుని తొనచ్చుగా అని పిల్లలతో అంటుంది దీప. అలా విసుక్కుంటునే శ్రావ్యను తిడుతూ పిల్లలకు అన్నం తినిపిస్తుంది దీప. అయితే, దీప అన్న మాటలకు శ్రావ్య చాలా బాధపడుతుంటుంది. ఆనందరావు అక్కడి నుంచి షాక్‌లోనే వెళ్లిపోతాడు. ఇంతలోనే డాక్టర్ బాబు సౌందర్య వద్దకు వెళ్లి దీపకు నిజం తెలిసిపోయిందా? అని అడుగుతాడు. అందుకు సౌందర్య సమాధానం ఏమీ చెప్పదు. అలా వారు ఆలోచనలో పడిపోతారు. ఈ క్రమంలోనే పిల్లలను దగ్గరకు తీసుకుని దీప.. ఈ సారి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, డాక్టర్ బాబు, అత్తయ్య మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటుంది. అంతలోనే ఎపిసోడ్ ముగుస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.