Home » Entertainment » Karthika Deepam 3 November 2022 Full Episode
Entertainment

Karthika Deepam 3 Nov Today Episode : ఇంద్రుడు, చంద్రమ్మ దగ్గరే శౌర్య ఉందన్న నిజం కార్తీక్ కు తెలుస్తుందా? శౌర్య.. కార్తీక్ ను చూస్తుందా?

Authored By
Varun G
The Telugu News | Updated on: November 3, 2022, 9:41 am
Advertisement

Karthika Deepam 3 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 నవంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 1500 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్య దొరకలేదన్న బాధలో వెళ్తుంది దీప. దీప బాధపడటం చూసి కార్తీక్ కు కూడా బాధేస్తుంది. అసలు నా బిడ్డ దొరుకుతుందా అని టెన్షన్ పడుతుంది దీప. దీంతో శౌర్య ఖచ్చితంగా ఇక్కడే ఉందని అంటాడు కార్తీక్. నీకు ఇద్దరు పిల్లలు కదా. కానీ.. ఒక్క శౌర్యనే నీకు ఇక్కడ ఉందని ఎలా అనిపించింది. ఖచ్చితంగా శౌర్య ఇక్కడే ఉంది. తనకోసం వెతుకుదాం. ఖచ్చితంగా దొరుకుతుంది అంటాడు కార్తీక్. మరోవైపు ఇంత పెద్ద ఫంక్షన్ చేయడానికి.. ఈ బట్టలు కొనడానికి డబ్బులు ఎక్కడివి బాబాయి అని అడుగుతుంది శౌర్య. మళ్లీ దొంగతనం చేశారా అని అడుగుతుంది శౌర్య.

Advertisement

karthika deepam 3 november 2022 full episode

లేదమ్మా.. దొంగతనం చేయలేదు అంటాడు ఇంద్రుడు. లేదంటే మీ పుట్టింటి నుంచి వ్యాపారం కోసం తెచ్చిన డబ్బులు అయినా ఖర్చు పెట్టి ఉండాలి అని అంటుంది శౌర్య. దీంతో పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బులు అలాగే ఉన్నాయి అంటుంది చంద్రమ్మ. దీంతో మరి డబ్బులు ఎలా వచ్చాయి అని అడుగుతుంది శౌర్య. దీంతో గొప్ప మనసు ఉన్నవాళ్లు ఇచ్చారు అని అంటాడు ఇంద్రుడు. ఆరోజు నీకు వాటర్ బాటిల్ ఫ్రీగా ఇచ్చింది కదా అంటాడు ఇంద్రుడు. దీంతో ఆ అమ్మా అంటుంది. దీంతో ఆమె కాదు.. ఆమె లాంటి వాళ్లు మరొకరు ఇచ్చారు. కానీ.. ఫ్రీగా ఏం కాదు. వడ్డీకే తీసుకున్నాను అంటాడు ఇంద్రుడు.

Advertisement

ఈరోజు మా అమ్మానాన్నలు వచ్చినట్టు అనిపించింది. మీకే నా మీద అంతుంటే మా అమ్మానాన్నలకు ఎలా ఉండాలి. ఇలాంటి సమయంలోనే అమ్మానాన్నలు పక్కన ఉండాలని ఏ ఆడపిల్ల అయినా అనుకుంటుంది కదా బాబాయి. మరి నేనుఏం పాపం చేశాను బాబాయి అంటుంది శౌర్య. ఎందుకు మా అమ్మానాన్నలు లేరు బాబాయి అని ఏడుస్తుంది శౌర్య.

Karthika Deepam 3 Nov Today Episode : దీపను ఓదార్చిన దుర్గ

మరోవైపు దీప ఏడుస్తుండటంతో దుర్గ తనను ఓదార్చుతాడు. ఆ తర్వాత వాల్తేరు వాణి అసలు స్వరూపం గురించి చెబుతాడు. తను ఎవరో.. తనను ఎవరు పంపించారో చెబుతాడు. రెండు సార్లు మనిద్దరినీ చంపడానికి ప్రయత్నించింది అని చెబుతాడు.

Advertisement

దీంతో షాక్ అవుతుంది దీప. వెంటనే మోనిత దగ్గరికి వెళ్తుంది. మోనిత చెంప చెళ్లుమనిపిస్తుంది. నువ్వు నన్ను ఏం చేయలేవు అని మోనితకు వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు కొట్టుకుంటారు. ఇద్దరూ కార్తీక్ కోసం సిగలు పట్టుకొని కొట్టుకుంటారు. నువ్వు నన్ను ఎంతమంది వాల్తేరు వాణిలను తీసుకొచ్చినా ఏం చేయలేవు అని మోనితకు షాకిచ్చి వెళ్లిపోతుంది దీప.

మరోవైపు కార్తీక్ మళ్లీ ఇంద్రుడు ఇంటికి వెళ్తాడు. అక్కడ ఇంద్రుడు కార్తీక్ ను చూసి షాక్ అవుతాడు. ఏంటి సార్ మళ్లీ ఇలా వచ్చారు అని అడుగుతాడు. దీంతో వారణాసి, శౌర్య ఫోటోలు చూపించి.. వీళ్లను ఎప్పుడైనా చూశావా అని అడుగుతాడు.

దీంతో చూడలేదు సార్ అంటాడు. ఒకవేళ వీళ్లను చూస్తే చెప్పు అంటాడు. మరోవైపు శౌర్య బయట ఎవరితో బాబాయి మాట్లాడుతున్నాడు అని చూడబోతుంది. ఇంతలో శౌర్యను లోపలికి తీసుకెళ్తుంది చంద్రమ్మ.

ఆ తర్వాత ఇంద్రుడు, చంద్రమ్మకు కార్తీక్ మీద డౌట్ వస్తుంది. శౌర్య ఇక్కడే ఉందని తెలిసిందా అని తెలిసిందా అని టెన్షన్ పడతారు ఇంద్రుడు, చంద్రమ్మ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి