Karthika Deepam 30 April Today Episode : శౌర్య, హిమ బొమ్మలు గీసి గీత షాక్.. రవ్వ ఇడ్లీనే ఆనంద్ అని తెలుసుకొని హిమ, శౌర్య షాక్

Advertisement
Advertisement

Karthika Deepam 30 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 ఏప్రిల్ 2022, శనివారం ఎపిసోడ్ 1340 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అవును ఏంటి అలా ఉన్నావు. అప్పటి నుంచి చూస్తున్నాను డల్ గా ఉన్నావేంటి.. అని తింగరిని అడుగుతుంది జ్వాల. దీంతో ఏం లేదు అంటుంది తింగరి. సరే నువ్వు వెళ్లు అని చెప్పి జ్వాల అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నేనే హిమను అని జ్వాలకు తెలిసిన మరుక్షణం తను ఏం చేస్తుంది.. అని భయపడుతుంది తింగరి. కొన్నాళ్లు శౌర్యకు నేను ఎవరో తెలియకుండా ఉంటే బాగుండు అని అనుకుంటుంది తింగరి. అటు నానమ్మ.. శౌర్య బొమ్మ గీయిస్తోంది. ఇటు శౌర్య.. నా బొమ్మ గీయిస్తోంది. ఈ రెండింట్లో ఏది జరిగినా శౌర్యకు నేనెవరో తెలిసిపోతుంది. దేవుడా.. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది తింగరి.

Advertisement

karthika deepam 30 april 2022 full episode

మరోవైపు స్వప్న… ఆనందరావుపై కోప్పడుతుంది. మీ ఆవిడ ఇక్కడికి రావడం ఏంటి.. నా ఇంట్లో తన పెత్తనం ఏంటి అని అంటుంది స్వప్న. దీంతో ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు అంటాడు ఆనంద రావు. దీంతో ఏంటి డాడీ.. మీరు నా నాన్న కాదా.. నా బాధ మీదో పంచుకునే అధికారం నాకు లేదా అంటుంది. నేను నీకు డాడీ అయితే.. ఆమె నీకు తల్లి కాదా.. తనకు నిన్ను అనే అధికారం లేదా అంటాడు. నువ్వు ఇకనైనా మారుతావు అని నీ దగ్గరికి వచ్చి టైమ్ వేస్ట్ చేశాను. ఇప్పుడు చెబుతున్నాను చూడు.. సౌందర్య అన్నదాంట్లో తప్పేమీ లేదు. సౌందర్య చెప్పిందే జరుగుతుంది. జరిగేలా చేస్తాను అంటాడు ఆనందరావు.

Advertisement

నీ మొగుడు ఎక్కడో ఉంటాడు. వాళ్లకు ఎవరో వండిపెడతారు. ఎవరో వండి పెట్టిన దాన్ని తింటావెందుకు అంటావు. నువ్వు ఇక్కడ ఉంటావు. ఇదంతా ఏంటి. నీ లైఫ్ ఎటు వెళ్తోంది అని అడుగుతాడు ఆనందరావు. నువ్వు ఎన్ని అనుకున్నా.. ఖచ్చితంగా వాళ్ల పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు ఆనందరావు.

కట్ చేస్తే జ్వాల.. సత్యానికి ఫుడ్ తీసుకొచ్చి ఇస్తుంది. తనను చూసి షాక్ అవుతాడు సత్యం. అదేంటమ్మా.. ఈరోజు నువ్వు ఎక్కడికో వెళ్తున్నా అన్నావు కదా అంటాడు. దీంతో అనుకున్నవన్నీ జరగవు కదా సార్ అంటుంది.

మరోవైపు ప్రేమ్ తనను చూసి షాక్ అవుతాడు. మళ్లీ నువ్వెందుకు వచ్చావు అంటాడు. ఆ తర్వాత కాఫీ తాగిన విషయం చెబుతాడు. ఆ తర్వాత కాఫీ డబ్బులు ఇవ్వు అంటూ ఇద్దరూ కలిసి తిట్టుకుంటారు.

మరోవైపు రవ్వ ఇడ్లీ దెబ్బలతో వస్తాడు. టిఫిన్ సెంటర్ దుర్గన్న చూసి ఏమైందిరా.. ఇన్ని దెబ్బలు తాకాయి ఏమైంది అని అడుగుతాడు. దీంతో మా అమ్మానాన్న విషయంలో స్కూల్ లో గొడవ అయింది దుర్గన్న అంటాడు. దీంతో వాళ్లను కొట్టాను. వాళ్లూ నన్ను కొట్టారు అంటాడు రవ్వ ఇడ్లీ.

నాకు ఒంటి మీద దెబ్బల కన్నా.. వాళ్ల మాటలకే ఎక్కువ బాదేసింది దుర్గన్న అంటాడు రవ్వ ఇడ్లీ. సరే.. ఇంటికి వెళ్దాం పదా.. అంటాడు దుర్గన్న. మరోవైపు శౌర్య బొమ్మ గీసేందుకు రెడీ అవుతుంది గీత.

శౌర్య చిన్నప్పటి ఫోటో చూసి.. తను ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహిస్తూ బొమ్మ గీస్తూ ఉంటుంది. మరోవైపు జ్వాల చెప్పిన పోలికలతో హిమ బొమ్మను కూడా గీస్తూ ఉంటుంది. ఒకేసారి రెండు బొమ్మలు గీస్తుంటుంది గీత.

Karthika Deepam 30 April Today Episode : ప్రేమ్ ప్లాన్ రివర్స్

శౌర్య బొమ్మ గీసి.. ఆ బొమ్మను చూసి షాక్ అవుతుంది గీత. అలాగే.. హిమ బొమ్మను చూసి కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే.. అది జ్వాల, హిమ బొమ్మలు కావడంతో తనకు ఏం చేయాలో అర్థం కాదు.

ఇంతలో తనకు ఫోన్ వస్తుంది. ఎవరో ఫోన్ చేసి తను ఇక లేదు అని చెబుతారు దీంతో తను ఏడుస్తుంది. కట్ చేస్తే.. పానీపూరీ తినడానికి ప్రేమ్, హిమ ఇద్దరూ వెళ్తారు. నీకన్నా ఒక్క పానీపూరీ ఎక్కువగా తిన్నా కూడా నేను గెలిచినట్టే. నాకు గిఫ్ట్ ఇవ్వాలి అంటుంది హిమ. దీంతో ముందు నువ్వు తిను.. గిఫ్ట్ ఇస్తా అంటాడు.

కావాలని ఓడిపోయి.. గిఫ్ట్ ఇచ్చి తనకు ఐలవ్యూ చెప్పాలనేది ప్రేమ్ ప్లాన్. ఇద్దరూ కలిసి పానీపూరీ తింటూ ఉంటారు. ప్రేమ్ తినబోయేసరికి.. అక్కడికి వచ్చిన జ్వాల ప్రేమ్ తినబోయే పానీపూరీ తీసుకొని తింటుంది.

నువ్వా.. అయ్యో జ్వాల.. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు ఏంటి అని అంటాడు. ఇంతలో జ్వాల, హిమ ఇద్దరూ కలిసి పోటీ పెట్టుకుంటారు. ఇద్దరూ తినడం స్టార్ట్ చేస్తారు. ప్రేమ్ కు తిక్క కోపం వస్తుంది.

అసలు నేను ఏమనుకుంటే.. ఇక్కడ ఏం జరుగుతోంది అని అనుకుంటాడు. చివరకు హిమ ఓడిపోతుంది. జ్వాల గెలుస్తుంది. దీంతో గిఫ్ట్ ఇవ్వు అంటుంది జ్వాల. దీంతో ఇవ్వు బావ.. కారులో ఉంది కదా అంటుంది తింగరి.

జ్వాల గెలవడం కాదు.. ప్రతిసారీ నేనే ఓడిపోతున్నాను అంటాడు ప్రేమ్. ఇంతలో రవ్వ ఇడ్లీ ఫోన్ నుంచి దుర్గన్న ఫోన్ చేస్తాడు. రవ్వ ఇడ్లీకి జ్వరంగా ఉంది.. ఒళ్లు కాలిపోతోంది అంటాడు. దీంతో అతడిని కలిసేందుకు హిమను తీసుకొని వెళ్తుంది జ్వాల.

ప్లాన్ అంతా పాడు చేసింది అని అనుకుంటాడు ప్రేమ్. కట్ చేస్తే.. ఇంటికి వచ్చేస్తాడు ఆనందరావు. ఏమైందండి అని అడుగుతుంది. దీంతో తనను తన ఆలోచనలను మార్చడం ఎవరి వల్లా కాదు అంటాడు ఆనందరావు.

రవ్వ ఇడ్లీని చూడటానికి వెళ్తారు జ్వాల, తింగరి. అక్కడ కార్తీక్, మోనిత ఫోటోలను చూసి షాక్ అవుతారు. అంటే.. రవ్వ ఇడ్లీనే ఆనంద్ అని ఇద్దరూ అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

  • Also Read
Advertisement

Recent Posts

Elon Musk : చ‌రిత్రలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా ఎలాన్ మస్క్ అవ‌త‌ర‌ణ‌

Elon Musk : చ‌రిత్ర‌లోనే అత్యంత ధ‌న‌వంతుడిగా ఎలాన్ మ‌స్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాల‌ర్ల…

53 mins ago

Nayanthara : న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌లకి ఘోర అవ‌మానం.. రెస్టారెంట్‌లో 30 నిమిషాల పాటు లైన్‌లో…!

Nayanthara : కోలీవుడ్ Kollywood  క్రేజీ జంట‌ల‌లో విఘ్నేష్ శివ‌న్, న‌య‌న‌తార జంట ఒక‌టి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…

2 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చివ‌రి మెగా చీఫ్ ఎవ‌రు.. రేపు రెండు ఎలిమినేష‌న్సా..!

Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తాజా ఎపిసోడ్‌లో మెగా…

3 hours ago

Ind Vs Aus : ఆసీస్ గ‌డ్డ‌పై ఆధిప‌త్యం చూపిస్తున్న భార‌త్.. 20 ఏళ్ల తర్వాత తొలి సెంచరీ భాగస్వామ్యం

Ind Vs Aus  1st Test Match : పెర్త్ వేదిక‌గా భార‌త్, ఇండియా మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్ట్…

4 hours ago

Maharashtra Jharkhand Election Results 2024 : మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్‌ల‌లో అధికార కూట‌ముల‌దే హ‌వా..!

Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అంద‌రి దృష్టి నెల‌కొని ఉంది.…

4 hours ago

Winter Season : చలికాలంలో నిద్ర మత్తు కామన్. మరి దీనిని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్నారా… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…

5 hours ago

Hair Care : తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఈ మూడు హోమ్ రెమెడీస్ బెస్ట్…!!

Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…

6 hours ago

Good News for Farmers : రైతులకు ఆర్బిఐ కొత్త రూల్.. బ్యాంక్ నుంచి రుణాలు ఈసుకున్న వారికి పునర్నిర్మాణానికి ఛాన్స్..!

Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…

7 hours ago

This website uses cookies.