karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
Karthika Deepam 30 Aug Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అంటే 30 ఆగస్టు 2021, సోమవారం ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. 1131 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
మీ అమ్మ పుట్టగానే.. వాళ్ల అమ్మ చనిపోయింది. చిన్నప్పటి నుంచే తనకు సవితి తల్లి పోరు ఉండేది. తను పెళ్లి కాకముందు ఏం బాగుపడలేదు. సంతోషంగా లేదు. పెళ్లయ్యాక కూడా ఏనాడూ సంతోషంగా లేదు.. అంటూ శౌర్యకు.. దీప గురించి చెబుతుంది సౌందర్య. పుట్టింట్లో ఉన్నన్ని రోజులు సవితి తల్లితో బాధలు పడింది. పెళ్లయ్యాక.. నేను కొద్ది రోజులు.. మీ నాన్న కొన్ని రోజులు.. నువ్వు, హిమ.. ఇలా ఎవరో ఒకర బాధ పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నను విడిపించుకోవడం కోసం పిచ్చిదై అక్కడా ఇక్కడా తిరుగుతోంది. ఇప్పుడు కూడా తిండీ తిప్పలు మానేసి అక్కడికే వెళ్లింది. చాలా.. అంటూ అడుగుతుంది సౌందర్య.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
నాకు మా అమ్మ అంటే కోపంగా ఉంది. చాలా కోపంగా ఉంది.. అంటుంది శౌర్య. ముందు డాక్టర్ కు ఫోన్ చేయండి.. అంటుంది సౌందర్య.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
కట్ చేస్తే.. మోనిత.. సాయిబాబాకు మొక్కుతుంది. ఈ ప్రపంచంలో కార్తీక్ పై నాకు ఉన్న ప్రేమను నువ్వు తప్ప ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అందుకే.. నేను ఎన్ని ఘోరాలు, నేరాలు చేస్తున్నా.. నన్ను శిక్షించకుండా.. నా కార్తీక్ ను నాకు దక్కేలా చేస్తున్నావు. అందుకే నిన్ను చేతులెత్తి మొక్కుతున్నా. కార్తీక్ ను నాకు దక్కేలా చేయి. నేను చేసేది తప్పే కానీ.. కార్తీక్ కోసమే ఇదంతా చేస్తున్నా. కార్తీక్ ను నా నుంచి దూరం చేయకు. తను లేకుండా నేను బతకలేను. నా బాధను అర్థం చేసుకో భగవంతుడా.. అని వేడుకుంటుంది మోనిత.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
నన్ను క్షమించు కార్తీక్. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను కానీ.. అది నీ మీద ఉన్న ప్రేమతోనే. సారీ కార్తీక్.. అని చెప్పి.. ముసుగు కట్టుకొని ఎక్కడికో బయలు దేరుతుంది మోనిత.
కట్ చేస్తే.. కార్తీక్ లో పోలీస్ స్టేషన్ లో సెల్ లో పడుకొని ఉంటాడు. తనకు కడుపు నొప్పి లేస్తుంది. తనకు కడుపు నొప్పి లేవడాన్ని గమనిస్తుంది రత్నసీత. కార్తీక్ కు కడుపునొప్పి స్టార్ట్ అయినట్టుంది. మూగ అమ్మాయి వేషంలో వచ్చి.. టీలో ఏదో కలిపి.. కడుపునొప్పి వచ్చేలా చేస్తా అని చెప్పింది మోనిత. అస్సలు ఎంత చెప్పినా వినలేదు.. అని తనలో తానే అనుకుంటుంది రత్నసీత.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
భగవంతుడా.. ఇప్పుడు డాక్టర్ సర్ ను హాస్పిటల్ కు తీసుకురమ్మంది. అక్కడ చేర్పిస్తే.. మోనిత ఏం చేస్తుందో. రోషిణి మేడమ్ కు డౌట్ రాకుండా ఎలా హాస్పిటల్ కు తీసుకెళ్లాలి.. అని అనుకుంటూనే.. ఏమైంది.. డాక్టర్ సార్ అని అడుగుతుంది. కడుపునొప్పి అని అంటాడు కార్తీక్. వెంటనే వేరే పోలీస్ కానిస్టేబుల్ ను పిలుస్తుంది. అదంతా యాక్టింగ్. నువ్వు నమ్ముతున్నావా? అంటూ అడుగుతాడు ఆ కానిస్టేబుల్.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
తను మెలికలు తిరుగుతున్నాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాదు రత్నసీతకు. మోనిత మాత్రం తనను ఒక ఆసుపత్రికి తీసుకురా.. అని చెబుతుంది మోనిత. దీంతో ఏం చేయాలో తెలియక.. వెంటనే ఏసీపీ మేడమ్ కు ఫోన్ చేస్తుంది. తనను, ఎస్ఐని తోడుగా వెళ్లి.. గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లండి.. అని చెబుతుంది రోషిణి.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
కట్ చేస్తే.. దీప.. శౌర్యకు ట్యాబ్లెట్లు ఇస్తుంది. ఇవి వేసుకో అని చెబుతుంది. దీంతో.. అక్కడ పెట్టు.. తర్వాత వేసుకుంటాను.. అని చెబుతుంది శౌర్య. లేదమ్మా.. ఇప్పుడు వేసుకోవాలి అని చెబుతుంది. నేను ట్యాబ్లెట్లు వేసుకుంటే.. నాన్న ఇంటికి తిరిగి వస్తారా? నాన్నను రిలీజ్ చేస్తారా? అని ప్రశ్నిస్తుంది. నాన్న త్వరలోనే వస్తారమ్మా.. నువ్వు ముందు ఈ ట్యాబ్లెట్లు వేసుకో.. అని అంటుంది దీప. వద్దమ్మా.. ఇక నుంచి అయినా నువ్వు అబద్ధం చెప్పకు.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
నువ్వు ఎప్పుడూ నిజం చెప్పవు. ఒక్కటైనా నిజం చెప్పావా? నీ అబద్ధంతోనే పెరిగాను. నాన్న దుబాయ్ లో ఉన్నాడు అన్నావు అబద్ధం. కాకి అరిస్తే నాన్న వస్తాడు అన్నావు అదీ అబద్ధం. వీళ్లంతా మనకు ఏం కారు.. అన్నావు అదీ అబద్ధమే కదా. చివరకు మా నాన్న ఎవరో నేను తెలుసుకునే వరకు కూడా నాకు చెప్పలేదు. నీ కన్నా మా నాన్నే మంచోడు. నువ్వంటే నాకు ఇష్టం పోయింది. మా నాన్న ఏం తప్పు చేయకపోయినా జైలులో ఉంచారు. ఎందుకు ఉంచారు అంటే చెప్పవు. వద్దమ్మా.. ట్యాబ్లెటే కదా.. నేను వేసుకుంటాను. ఇక్కడ నన్ను చూడటానికి చాలామంది ఉన్నారు. నాన్నను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. నువ్వు వెళ్లు అమ్మా.. అని అంటుంది శౌర్య.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
కట్ చేస్తే.. కారులో వెళ్తుంటుంది మోనిత. కార్తీక్ గురించే ఆలోచిస్తుంటుంది. దీపే కనుక కార్తీక్ జీవితంలో రాకపోయి ఉంటే.. నా జీవితం కార్తీక్ తో సంతోషంగా గడిచి ఉండేది. నా కార్తీక్ ను నా చేతులారా నేను కష్టపెడుతున్నా. ఇదంతా దీప వల్లే. అందుకే.. ఈ రాత్రితో దీప పీడ విరగడ కావాలి. ఇక నిన్ను, నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు కార్తీక్.. అని మనసులో అనుకుంటుంది మోనిత.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
కట్ చేస్తే.. దీప.. ఆటోలో ఎక్కడికో వెళ్తుంటుంది. తను శౌర్య అన్న మాటలను గుర్తు తెచ్చుకొని తెగ ఏడుస్తుంది. నా జీవితం ఎటు వెళ్తోంది. నా జీవితం ఏమౌతోంది. అసలు.. నా గమ్యం ఎటు సాగుతోంది.. అంటూ తనకు తానే ఏడుస్తుంటుంది దీప. నా పుట్టుక నాకే శాపమా? మళ్లీ నేను సంతోషంగా ఉండేదెప్పుడు.. అంటూ తెగ బాధపడిపోతుంది.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
కట్ చేస్తే.. ప్రభుత్వ ఆసుపత్రికి కార్తీక్ ను తీసుకొస్తారు. కొంచెం ఓపిక పట్టుకోండి.. నేను వెళ్లి డాక్టర్ గారిని తీసుకొస్తాను.. అని చెబుతుంది రత్నసీత. డాక్టర్ గారిని పిలిచేందుకు వెళ్లే సరికి.. అక్కడ మోనిత ఉంటుంది. మోనితను చూసి షాక్ అవుతుంది రత్నసీత.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
మీరెందుకు వచ్చారు.. అంటే నన్ను గుర్తు పట్టిన వాళ్లకే రిస్క్. నాకు కాదు.. అంటుంది మోనిత. కొంపదీసి.. ఆ ఇంజెక్షన్ వేసి డాక్టర్ బాబును చంపేస్తారా? అంటే.. రత్నసీత ఏం మాట్లాడుతున్నావు. నా కార్తీక్ ను నేను చంపుకుంటానా? నా కార్తీక్ ను నేను చూడకుండా ఉండలేను. నా కార్తీక్ కు నేను ట్రీట్ మెంట్ చేస్తాను.. అని చెప్పి.. కార్తీక్ దగ్గరికి వెళ్తుంది మోనిత.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
మేడమ్.. దయచేసి.. ఎలాగైనా ఆ పేషెంట్ కు ఏం కాకుండా చూసుకోండి మేడమ్.. అని చెబుతాడు ఎస్ఐ నాయుడు. దీంతో వెంటనే కార్తీక్ కు ఇంజెక్షన్ చేయబోతుంది. ఫుడ్ పాయిజన్ లా ఉంది.. అని చెప్పేసరికి.. డోంట్ వర్రీ.. మీ సంగతి నేను చూసుకుంటాను.. అని చెప్పి.. కార్తీక్ కు ఇంజెక్షన్ చేస్తుంది మోనిత.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
ఇంతలోనే దీప.. హాస్పిటల్ కు వస్తుంది. పోలీసులు అక్కడ ఉండి.. తనను వెళ్లనీయరు. లోపల మోనిత ఉన్న విషయం దీపకు తెలిస్తే.. ఇంకేమైనా ఉందా? అని రత్నసీత సీరియస్ గా వెళ్లొద్దు అని చెప్పి అడ్డగిస్తుంది.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
కట్ చేసి చూస్తే.. కార్తీక్ చేతులు కట్టేస్తుంది. నోటికి ప్లాస్టర్ వేస్తుంది మోనిత. చూసి షాక్ అవుతాడు కార్తీక్. ఏంటిది.. అని అడిగేసరికి.. నేను కదలకుండా కట్టేశాను.. అంటుంది. తన ముఖానికి ఉన్న మాస్క్ ను తీసి తన ముఖాన్ని చూపించేసరికి.. కార్తీక్ షాక్ అవుతాడు. నేనే కార్తీక్.. అని అంటుంది మోనిత.
karthika deepam 30 August 2021 monday episode 1131 highlights
నన్ను చంపేయాలనిపిస్తోందా? చేతులు కట్టేశాను.. అరిచి అందరినీ పిలవాలని ఉందా? మాట్లాడకుండా చేశాను.. అని చెప్పి.. కార్తీక్ బెడ్ మీద కూర్చొని.. కార్తీక్ మీ చేయి వేస్తుంది మోనిత. ఇంతలో సీరియల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. తరువాయిభాగంలో చూడాల్సిందే.
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
This website uses cookies.