
karthika deepam 30 june 2022 full episode
Karthika Deepam 30 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 జూన్ 2022, గురువారం ఎపిసోడ్ 1392 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమ, నిరుపమ్ ఇద్దరూ గుడికి వస్తారు. నేను ముడుపు కడుతా అంటాడు నిరుపమ్. దేనికి అంటుంది హిమ. నాకు, హిమకు పెళ్లి జరిగితే నేను ముడుపు కడతా అని మొక్కుకున్నా అంటాడు. కానీ.. హిమ మాత్రం.. నీకు, జ్వాలకు పెళ్లి జరగాలని కోరుకుంటూ నేను ముడుపు కడతా బావ అంటుంది హిమ. దీంతో ఏంటి నువ్వు ఇంకా నువ్వు మారవా అంటాడు. ఇంతలో పూజారి వస్తాడు. ఆయన్ను దీవించమంటాడు నిరుపమ్. మా ఇద్దరి మనసుల్లో వేర్వేరు ఆలోచనలతో ముడుపు కట్టాలని అనుకుంటున్నాం పూజారి గారు అంటాడు నిరుపమ్. దీంతో ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటాడు పూజారి.
karthika deepam 30 june 2022 full episode
మరోవైపు గుడికి కస్టమర్ ను తీసుకొస్తుంది జ్వాల. అది హిమ, నిరుపమ్ వచ్చిన గుడే. ఆటోలోనే ఆ కస్టమర్ కొబ్బరి కాయ మరిచిపోవడంతో ఆయనకు ఇచ్చేందుకు గుడి లోపలికి వస్తుంది జ్వాల. ఇంతలో ముడుపు కట్టేందుకు చెట్టు దగ్గరికి వస్తారు నిరుపమ్, హిమ. నేను ముడుపు కడుతున్నాను కదా నువ్వు కట్టకు ఇక అంటాడు నిరుపమ్. దీంతో ఎందుకు బావ. జ్వాలను, నిన్ను కలపాలని మనసులో కోరుకుంటూ నేనూ ముడుపు కడతాను అంటుంది హిమ. ఇంతలో వాళ్లను చూస్తుంది జ్వాల. వాళ్లను చూసి షాక్ అవుతుంది జ్వాల. బావ.. నేను ముందు ముడుపు కడతాను అంటుంది హిమ. దీంతో లేదు.. మన పెళ్లి జరగాలని నేను ముందు మొక్కుకున్నాను అంటాడు నిరుపమ్. దీంతో నా మనసులోని కోరికే ముందు తీరుతుంది తెలుసా అంటుంది హిమ. బావ నా ముడుపు నా కోరికే గెలుస్తుంది చూడు అంటుంది. దీంతో నేను కోరుకున్నది కూడా నిజం అయింది కదా అంటాడు నిరుపమ్.
ఎంత నటించావే.. ఇంత జరిగాక కూడా నా దగ్గరికి వచ్చి దొంగ ఏడుపు ఏడ్చావు కదే. నువ్వు మామూలు దానివి కాదు అని అనుకుంటుంది జ్వాల. మరోవైపు ఇద్దరూ ముడుపులు కడతారు. దీంతో కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల. మరోవైపు ఆనంద రావు, సౌందర్య ఇద్దరూ ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తారు.
హిమ గురించి శౌర్యకు ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు ఇంకా పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందేమో అనిపిస్తోంది అంటాడు ఆనందరావు. తనకు హిమ గురించి తెలిసేలోపు శౌర్యకు హిమ మీద ఉన్న కోపాన్ని తగ్గించాలి అంటుంది సౌందర్య. ఎలాగోలా ఆ శౌర్య కోపాన్ని తగ్గించాలి అంటుంది సౌందర్య.
మరోవైపు నిరుపమ్… హిమను పిలుస్తాడు. దీంతో తనను కలవడానికి హాస్పిటల్ కు వెళ్తుంది హిమ. నువ్వు జ్వాల విషయంలోనే డిస్టర్బ్ అవుతున్నావని నాకు అనిపిస్తోంది. అసలు జ్వాల ఎవరు అని అడుగుతాడు నిరుపమ్. దీంతో హిమ షాక్ అవుతుంది.
బావ.. నన్నేం అడగొద్దు అంటుంది హిమ. దీంతో అడుగుతాను హిమ అంటాడు నిరుపమ్. అసలు జ్వాల ఎవరు అని మళ్లీ అడుగుతాడు నిరుపమ్. జ్వాల ఒక స్వచ్ఛమైన మంచి మనసు ఉన్న అమ్మాయి అంటుంది హిమ. తను నిన్ను ప్రేమిస్తోంది అంటుంది హిమ.
నేను తనకు ఓపెన్ గా చెప్పేశాను కదా అంటాడు నిరుపమ్. నేను ఇంకా ఎన్నాళ్లు ఉంటానో తెలియదు బావ. తనే నీకు సరైన జోడి. జ్వాలకు నువ్వంటే ప్రాణం అంటుంది హిమ. దీంతో నాకు నువ్వంటే కూడా ప్రాణం అంటాడు నిరుపమ్. తన స్థాయికి తగ్గ వాళ్లను పెళ్లి చేసుకొని ఆటో నడుపుతూ అలా బతికేస్తుంది అంటాడు నిరుపమ్.
దీంతో తనకు అంత కర్మ పట్టలేదు అంటుంది హిమ. తనకు ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నావు అంటే.. తను నా ఫ్రెండ్ అంటుంది హిమ. కష్టం అనిపిస్తే చెప్పుకునే ఆత్మీయురాలు. ఇంకా అడగాల్సిన ప్రశ్నలు ఏవైనా ఉన్నాయా బావ అని అడుగుతుంది హిమ.
కట్ చేస్తే మరోసారి జ్వాల దగ్గరికి వెళ్తారు సౌందర్య, ఆనంద రావు. నీ దోస్త్ గా నేను ఒక మాట చెబుతాను విను అంటుంది సౌందర్య. నీతి బోధలు చెబుతావా అని అడుగుతుంది జ్వాల. దీంతో నీతిబోధలు మేమెందుకు చెబుతాం. ఏదో మనసు ఉండబట్టలేక ఇలా వచ్చాం అంటుంది సౌందర్య.
నా పెళ్లి ఆ డాక్టర్ సాబ్ తోనే అనుకున్నా. వేరే వాళ్లతో అన్నది నేను ఊహించుకోలేను అంటుంది జ్వాల. మరోవైపు జ్వాలను కలిసిన హిమ.. డాక్టర్ సాబ్ పై ప్రేమను చంపుకోకు అంటుంది. ఆయన మీద ఆశలు వదులుకోకు.. ప్రేమించడం ఆపకు అని భరోసా ఇస్తుంది. దీంతో జ్వాల షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.