karthika deepam 30 march 2022 full episode
Karthika Deepam 30 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 1313 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దొంగతనం ఇక నుంచి చేయకూడదని.. ఇంద్రుడు, చంద్రమ్మకు వార్నింగ్ ఇస్తుంది శౌర్య. ఒళ్లు వంచి పనిచేయాలి అంటుంది. మరోవైపు నిరుపమ్ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది శౌర్య. రేపు డాక్టర్ సాబ్ దగ్గరికి వెళ్లాలి అనుకుంటుంది. ఏంటో నాకు తనెందుకు గుర్తొస్తున్నాడు అనుకుంటుంది. నన్ను పొగిడినందుకా.. అక్కడికెళ్తే తను నాకు పాత పరిచయంలా అనిపిస్తున్నాడు. ఆ తింగరిదీ అనిపిస్తుంది. ఆ తింగరిదాన్ని చూస్తే హిమనే గుర్తొస్తుంది. ఏంటో అనుకుంటుంది శౌర్య.
karthika deepam 30 march 2022 full episode
మరోవైపు హిమ, నిరుపమ్ ఆసుపత్రిలో ఉంటారు. హిమ కూడా శౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆటో అమ్మాయి గురించి నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను. తనెందుకు నాకు పదే పదే గుర్తొస్తుంది అనుకుంటుంది. ఇంతలో నిరుపమ్ కూడా ఆటో అమ్మాయి గురించి మాట్లాడుతాడు. తను అచ్చం మన హిమను చూసినట్టు లేదు అంటాడు. బావా.. నేను కూడా అదే ఆలోచిస్తున్నా. తనను చూస్తుంటే నా మనసులో ఎక్కడో ఏదో మూల తనే మన శౌర్య అనిపిస్తోంది అంటుంది హిమ.
ఇంతలో శౌర్య అక్కడికి వస్తుంది. శౌర్యను చూసి షాక్ అవుతుంది హిమ. కానీ.. నిరుపమ్ కు శౌర్య కనిపించదు. హిమ.. తను వచ్చిందని భ్రమ పడుతుంది. ఇంతలో నిజంగానే శౌర్య వస్తుంది. ఈ డాక్టర్ ను చూస్తుంటే దగ్గరి వాళ్లను చూసినట్టు ఉంది ఏంటి అని అనుకుంటుంది శౌర్య. తింగరి ఏం ఆలోచిస్తున్నావు అంటుంది శౌర్య. దీంతో నన్ను ఎందుకు అలా పిలుస్తున్నారు. నన్ను అలా పిలవకండి అంటుంది హిమ.
దీంతో నేను అలాగే పిలుస్తాను అంటుంది. దీంతో హిమ చిన్నబుచ్చుకుంటుంది. హిమ కూడా ఇలాగే అమ్మానాన్నలను పొట్టనపెట్టుకుంది అనుకుంటుంది శౌర్య. నేను నిన్ను బెదిరిస్తే భయపడతావేంటి అని అంటుంది. నన్ను ఎదిరించాలి.. బెదిరించాలి కొట్టాలి అంటుంది శౌర్య.
దీంతో తనకు అంత లేదులే అంటాడు నిరుపమ్. ఆటో అమ్మాయి అంటూ అనబోతే.. నాపేరు జ్వాల.. ఆటో అమ్మాయి కాదు అంటుంది. దీంతో సరే.. కొన్ని రోజులు నీతో తిప్పుకో.. అప్పుడైనా తనకు కాస్త ఎలా మాట్లాడాలో తెలుస్తుంది అని చెబుతాడు నిరుపమ్.
మరోవైపు తన తండ్రి, తల్లి విడిపోవడంపై సీరియస్ అవుతాడు ప్రేమ్. వీళ్లు ఎప్పుడు కలుస్తారా.. అని తెగ టెన్షన్ పడతాడు. తన మమ్మీ ఫోన్ చేయడంతో తనకు చిరాకు వేస్తోంది. మరోవైపు హిమకు ఎలా ఆటో నడపాలో నేర్పిస్తుంది శౌర్య.
ఇప్పుడు ఆటోను నేను నడపడం అవసరమా అంటుంది హిమ. దీంతో నీ భయం పోగొడతానని డాక్టర్ సాబ్ కు మాటిచ్చాను అంటుంది శౌర్య. తర్వాత ఆటోలో కస్టమర్లతో ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తుంది హిమకు. ఓవైపు హిమకు చాలా భయం వేస్తుంటుంది.
ఆటో నడుపుతూ.. తనకు తన అమ్మ నాన్నలు చనిపోయిన విషయం గురొస్తుంది. దీంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది. తనను ఆటో దింపి రోడ్ సైడ్ హోటల్ దగ్గరికి తీసుకొస్తుంది. మరోవైపు శౌర్య గురించి ఆలోచిస్తుంటుంది సౌందర్య. తన చిన్నప్పటి ఫోటోను పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. అప్పుడే శౌర్య ఆటో దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
This website uses cookies.