Karthika Deepam 30 March Today Episode : హిమకు ఆటో డ్రైవింగ్ నేర్పించిన శౌర్య.. మళ్లీ హిమ యాక్సిడెంట్ చేస్తుందా? శౌర్యను వెతుక్కుంటూ జ్వాల దగ్గరికే వచ్చిన సౌందర్య  

Authored By Varun G | The Telugu News | Published on: March 30, 2022, 10:30 am

Karthika Deepam 30 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 1313 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దొంగతనం ఇక నుంచి చేయకూడదని.. ఇంద్రుడు, చంద్రమ్మకు వార్నింగ్ ఇస్తుంది శౌర్య. ఒళ్లు వంచి పనిచేయాలి అంటుంది. మరోవైపు నిరుపమ్ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది శౌర్య. రేపు డాక్టర్ సాబ్ దగ్గరికి వెళ్లాలి అనుకుంటుంది. ఏంటో నాకు తనెందుకు గుర్తొస్తున్నాడు అనుకుంటుంది. నన్ను పొగిడినందుకా.. అక్కడికెళ్తే తను నాకు పాత పరిచయంలా అనిపిస్తున్నాడు. ఆ తింగరిదీ అనిపిస్తుంది. ఆ తింగరిదాన్ని చూస్తే హిమనే గుర్తొస్తుంది. ఏంటో అనుకుంటుంది శౌర్య.

మరోవైపు హిమ, నిరుపమ్ ఆసుపత్రిలో ఉంటారు. హిమ కూడా శౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆటో అమ్మాయి గురించి నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను. తనెందుకు నాకు పదే పదే గుర్తొస్తుంది అనుకుంటుంది. ఇంతలో నిరుపమ్ కూడా ఆటో అమ్మాయి గురించి మాట్లాడుతాడు. తను అచ్చం మన హిమను చూసినట్టు లేదు అంటాడు. బావా.. నేను కూడా అదే ఆలోచిస్తున్నా. తనను చూస్తుంటే నా మనసులో ఎక్కడో ఏదో మూల తనే మన శౌర్య అనిపిస్తోంది అంటుంది హిమ.

ఇంతలో శౌర్య అక్కడికి వస్తుంది. శౌర్యను చూసి షాక్ అవుతుంది హిమ. కానీ.. నిరుపమ్ కు శౌర్య కనిపించదు. హిమ.. తను వచ్చిందని భ్రమ పడుతుంది. ఇంతలో నిజంగానే శౌర్య వస్తుంది. ఈ డాక్టర్ ను చూస్తుంటే దగ్గరి వాళ్లను చూసినట్టు ఉంది ఏంటి అని అనుకుంటుంది శౌర్య. తింగరి ఏం ఆలోచిస్తున్నావు అంటుంది శౌర్య. దీంతో నన్ను ఎందుకు అలా పిలుస్తున్నారు. నన్ను అలా పిలవకండి అంటుంది హిమ.

దీంతో నేను అలాగే పిలుస్తాను అంటుంది. దీంతో హిమ చిన్నబుచ్చుకుంటుంది. హిమ కూడా ఇలాగే అమ్మానాన్నలను పొట్టనపెట్టుకుంది అనుకుంటుంది శౌర్య. నేను నిన్ను బెదిరిస్తే భయపడతావేంటి అని అంటుంది. నన్ను ఎదిరించాలి.. బెదిరించాలి కొట్టాలి అంటుంది శౌర్య.

దీంతో తనకు అంత లేదులే అంటాడు నిరుపమ్. ఆటో అమ్మాయి అంటూ అనబోతే.. నాపేరు జ్వాల.. ఆటో అమ్మాయి కాదు అంటుంది. దీంతో సరే.. కొన్ని రోజులు నీతో తిప్పుకో.. అప్పుడైనా తనకు కాస్త ఎలా మాట్లాడాలో తెలుస్తుంది అని చెబుతాడు నిరుపమ్.

Karthika Deepam 30 March Today Episode : తన తల్లిదండ్రుల విషయంలో బాధపడ్డ ప్రేమ్

మరోవైపు తన తండ్రి, తల్లి విడిపోవడంపై సీరియస్ అవుతాడు ప్రేమ్. వీళ్లు ఎప్పుడు కలుస్తారా.. అని తెగ టెన్షన్ పడతాడు. తన మమ్మీ ఫోన్ చేయడంతో తనకు చిరాకు వేస్తోంది. మరోవైపు హిమకు ఎలా ఆటో నడపాలో నేర్పిస్తుంది శౌర్య.

ఇప్పుడు ఆటోను నేను నడపడం అవసరమా అంటుంది హిమ. దీంతో నీ భయం పోగొడతానని డాక్టర్ సాబ్ కు మాటిచ్చాను అంటుంది శౌర్య. తర్వాత ఆటోలో కస్టమర్లతో ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తుంది హిమకు. ఓవైపు హిమకు చాలా భయం వేస్తుంటుంది.

ఆటో నడుపుతూ.. తనకు తన అమ్మ నాన్నలు చనిపోయిన విషయం గురొస్తుంది. దీంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది. తనను ఆటో దింపి రోడ్ సైడ్ హోటల్ దగ్గరికి తీసుకొస్తుంది. మరోవైపు శౌర్య గురించి ఆలోచిస్తుంటుంది సౌందర్య. తన చిన్నప్పటి ఫోటోను పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. అప్పుడే శౌర్య ఆటో దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Chicken Shop Business : చికెన్ షాప్ పెడితే లాభమా.. న‌ష్ట‌మా..1 కిలోకు ఎంత మిగులుతుందంటే? అసలు లెక్కలు ఇవే!"

  2. "Today Horoscope : 25 నవంబర్ 2026 బుధ‌వారం ఈ రోజు మీ రాశి ఫలాలు..!"

  3. "Huzurnagar News : నిరుద్యోగులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదు.. రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు"

  4. "December New Rule : డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌.. గ్యాస్, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఛార్జీలపై బిగ్ అలర్ట్!"

  5. "PM Kisan 25th Installment : రూ.2,000 కోసం ఎదురుచూస్తున్న రైతులకు అలర్ట్.. ఈ 5 పనులు వెంటనే పూర్తి చేయండి!"

  6. "Gold Adulteration Alert : కొత్త మోసం.. 22 క్యారెట్ల పేరుతో 20 క్యారెట్ల బంగారమా..? 916 హాల్‌మార్క్ ఉన్నా జాగ్రత్త పడాల్సిందేనా?"

  7. "Vaibhav Sooryavanshi : 16 బంతుల్లో ఫిఫ్టీ.. 28 బంతుల్లో సెంచరీ.. ప్రపంచ రికార్డు బద్దలు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp