Karthika Deepam 30 Nov Today Episode : కార్తీక్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్న మోనిత.. మీటింగ్ లో మోనితకు షాకిచ్చిన దీప | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 30 Nov Today Episode : కార్తీక్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్న మోనిత.. మీటింగ్ లో మోనితకు షాకిచ్చిన దీప

 Authored By gatla | The Telugu News | Updated on :30 November 2021,9:00 am

Karthika Deepam 30 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 నవంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 1210 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం బస్తీలో ఇల్లు కట్టుకోబోతున్నాం అని హిమకు శౌర్య చెబుతుంది. దీంతో హిమ ఫుల్ ఖుషీ అవుతుంది. బస్తీలో అయితే ఎప్పుడూ పిల్లలు ఉంటారు. అక్కడ అందరూ ఉంటారు. ఎప్పుడూ ఆడుకుంటూ ఉండొచ్చు అంటుంది హిమ. బస్తీకి వెళ్లడం అందరికీ ఇష్టమే కానీ.. బాబాయికి ఎందుకు ఇష్టం లేదు అని అంటుంది హిమ. అప్పుడు బస్తీలో ఉన్నప్పుడే గొడవలు జరిగాయి కదా అందుకే బాబాయికి కోపం అంటుంది శౌర్య.

karthika deepam 30 november 2021 full episode

karthika deepam 30 november 2021 full episode

మరోవైపు మోనిత.. బస్తీలో జరిగిన విషయాన్నే గుర్తు చేసుకుంటుంది. మోనిత ప్రవర్తనను చూసి ప్రియమణికి భయం వేస్తుంది. ఏంటి ప్రియమణి.. బస్తీ వాళ్లు తరిమికొట్టినా కూడా బాధపడకుండా నవ్వుతున్నావని అనుకుంటున్నావా అంటుంది మోనిత. నేను చాలా మంచిదాన్ని ప్రియమణి. నా ప్రేమను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. చివరకు కార్తీక్ కూడా అర్థం చేసుకోవడం లేదు. కానీ.. నేను అర్థం అయ్యేలా చేస్తాను అంటుంది మోనిత. ఆనంద రావు పుట్టిన వేళా విశేషం ఏంటో కానీ.. నాకు అంతా మంచే జరుగుతోంది.. అంటుంది మోనిత.

దీపమ్మను ఇబ్బంది పెట్టకండి అమ్మ. మీ ఫ్రెండ్ కార్తీక్ తో ఏదైనా ఉంటే తేల్చుకోండి.. కానీ దీపమ్మను ఇబ్బంది పెట్టకండి అమ్మ అంటుంది ప్రియమణి. దీప స్విచ్ అయితే కార్తీక్ ఫ్యాన్. ఫ్యాన్ ను ఆపాలంటే.. దీప స్విచ్ ను ఆఫ్ చేయాలి అని ఉదాహరణతో సహా ప్రియమణికి చెబుతుంది మోనిత. రేపు సరికొత్త పథకం అమలు చేస్తున్నాను అంటుంది.

కార్తీక్ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంటుంది. దీప కూడా నవ్వుతూ ఉంటుంది. దీప నవ్వు చూసి సౌందర్య కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంతలో కార్తీక్ నిద్రలేస్తాడు. దీప నువ్వు తొందరగా రెడీ అవ్వు. బస్తీకి వెళ్దాం అంటాడు కార్తీక్. అరుణకు వస్తున్నామని చెప్పు అంటాడు కార్తీక్. అందరూ సంతోషంగా ఉంటారు.

దీప.. మన ప్రోగ్రామ్ లో చిన్న మార్పు.. బస్తీ కంటే ముందు మనం డాక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలకు వెళ్లాలి. ఎన్నికలకు వెళ్లకుండా అందరూ నన్ను యూనియన్ ప్రెసిడెంట్ గా ఉండముంటున్నారు అంటాడు కార్తీక్. కానీ నేను వద్దంటున్నాను అంటాడు కార్తీక్.

Karthika Deepam 30 Nov Today Episode : డాక్టర్ల సంఘం మీటింగ్ కు వెళ్లిన కార్తీక్, దీప

ఏమో డాడీ.. నాకు ఆ పదవులు అవీ నచ్చవు అంటాడు కార్తీక్. నేను కూడా ఇంకా ఏమీ డిసైడ్ అవలేదు. నువ్వు త్వరగా రెడీ అవు వెళ్దాం అంటాడు కార్తీక్. మరోవైపు మోనిత.. ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తుంటుంది. ఈ వంటలక్కకు ఇంత తెలివి ఎక్కడిది అని ఆలోచిస్తుంటుంది.

ఇంతలో భారతి ఫోన్ చేస్తుంది. డాక్టర్లు సంఘం ఎన్నికలకు రావట్లేదా అని అడుగుతుంది. నేను రాను అంటుంది. కార్తీక్ ను ప్రెసిడెంట్ ను చేస్తా అంటున్నారు కదా నువ్వు ఎక్కడ వస్తావో అని టెన్షన్ పడ్డాను అంటుంది భారతి. దీంతో నేను రాను అని ఫోన్ పెట్టేస్తుంది.

మోనిత ఏమైనా మీటింగ్ కు వస్తుందా అని కార్తీక్.. భారతికి ఫోన్ చేస్తాడు. తను రానన్నది అని చెబుతుంది. దీంతో ఊపిరి పీల్చుకుంటాడు కార్తీక్. డాక్టర్ అసోసియేషన్ మీటింగ్ కోసం ఆనంద రావు, సౌందర్య కూడా రెడీ అవుతారు. కార్తీక్ ఫోటోను చూస్తూ మోనిత బాధపడుతుంది.

నన్ను, నా ప్రేమను ఎప్పుడు నమ్ముతావు కార్తీక్ అంటుంది మోనిత. ఏం చేయాలి అని తెగ ఆలోచిస్తుంది. తనకు ఏ ఐడియా తట్టదు. దీప అడ్డు తొలగిస్తేనే తనకు కార్తీక్ దక్కుతాడు అని అనుకుంటుంది మోనిత. కానీ.. ఏదీ తనకు తోచదు.

మరోవైపు డాక్టర్ల అసోసియేషన్ మీటింగ్ ప్రారంభం అవుతుంది. కార్తీక్, దీప వస్తారు. ఈరోజు డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కార్తీక్ ను ఎన్నుకున్నాం అంటుంది భారతి. ఇంతలో మోనిత వచ్చి నీకన్నా బాగా నేను చెబుతాను కార్తీక్ గురించి. నాకు న్యాయం చేస్తేనే కార్తీక్ ప్రెసిడెంట్ గా కొనసాగుతాడు అంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది