Karthika Deepam 30 Oct Today Episode : కార్తీక్ శాంపిల్ కోసం మరోసారి ల్యాబ్ కు వెళ్లిన దీప.. అసలు నిజం తెలుసుకొని తట్టుకోలేక దీప ఏం చేసింది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 30 Oct Today Episode : కార్తీక్ శాంపిల్ కోసం మరోసారి ల్యాబ్ కు వెళ్లిన దీప.. అసలు నిజం తెలుసుకొని తట్టుకోలేక దీప ఏం చేసింది?

 Authored By gatla | The Telugu News | Updated on :30 October 2021,9:55 am

Karthika Deepam 30 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 30 అక్టోబర్, 2021 శనివారం ఎపిసోడ్ 1184 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత గురించి దీప టాపిక్ తీయడంతో కార్తీక్ సీరియస్ అవుతాడు. ఎందుకు మనిద్దరి మధ్య కూడా మోనిత గురించి టాపిక్.. అంటూ సీరియస్ అవుతాడు కార్తీక్. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఎన్నో అడగాలనుకున్నాను కానీ కొత్త ప్రశ్నలు ఇచ్చి వెళ్తున్నారు డాక్టర్ బాబు అని అనుకుంటుంది దీప.

karthika deepam 30 october 2021 full episode

karthika deepam 30 october 2021 full episode

ఉదయమే సౌందర్య, ఆనంద రావు ఇద్దరూ దీనంగా ఉంటారు. ఇంతలో కార్తీక్ ను చూస్తాడు ఆనంద రావు. కార్తీక్ అని పిలుస్తాడు. వెంటనే చెంప చెల్లుమనిమిస్తాడు. ఎంత పని చేశావురా దౌర్భాగ్యుడా? ఛీ.. నోర్మూయ్.. అంటాడు. ఏమైంది డాడీ అంటాడు. వీడు చేసిన పనికి కొట్టొద్దా సౌందర్య. నువ్వు నాకు ఎలా పుట్టావురా. నిన్ను అంటూ కాలర్ పట్టుకొని సీరియస్ అవుతాడు ఆనంద రావు. ఇంతలో దీప అక్కడికి వస్తుంది. మామయ్య కాఫీ తెమ్మంటారా? అంటుంది. తీసుకురా అమ్మా అంటాడు.

ఏంటి మామయ్య డాక్టర్ బాబు చెంప నిమురుతున్నారు అని అడుగుతుంది దీప. దీంతో మచ్చ పడిందమ్మా అందుకే నిమురుతున్నాను అంటాడు. నువ్వు వెళ్లి కాఫీ తీసుకురా అమ్మా అంటాడు. తను వెళ్లగానే నువ్వు దీపను చూడరా? 11 ఏళ్లు దీపను దూరం చేసుకున్నావు. మమ్మల్ని కూడా ప్రశాంతంగా బతకనీయవా? ఈ నిర్వాకం దీపకు ఎలా చెబుతావురా? దీపకు తెలిస్తే తన జీవితం ఏమవుతుందిరా. నువ్వు అసలు మనిషివేనా? ఈ విషయం తెలిస్తే పిల్లలకు ఏం సమాధానం చెబుతావు. రేపు దీప వాళ్ల నాన్న వచ్చి.. ఏమయ్యా పెద్దమనిషి నీకొడుకు చేసిన పని ఏంటి అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి. దీపను ఎంత కాలం మోసగిస్తారు. దీప దగ్గరికి వస్తుంటే నీకు ఎలా ఉందో కానీ.. నాకు మాత్రం తట్టుకోలేకపోతున్నాను. దీప కళ్లలోకి చూసే ధైర్యం కూడా లేకుండా పోయింది. ఇవన్నీ చూడటానికా నేను బతికి ఉన్నది.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆనంద రావు.

Karthika Deepam 30 Oct Today Episode : అమ్మ కనిపించడం లేదంటూ సౌందర్య, కార్తీక్ కు చెప్పిన పిల్లలు

ఇంతలో దీప కాఫీ తీసుకొని వస్తుంది. కానీ ఆనంద రావు ఉండడు. కార్తీక్ దగ్గరికి వెళ్లి మామయ్య వాళ్లు ఏరి అని అంటుంది. వెళ్లిపోయారు అంటాడు కార్తీక్. అదేంటి కాఫీ తీసుకురమ్మన్నారు కదా.. మీతో ఏదైనా చెప్పారా? అంటుంది. చెప్పాల్సింది ఏదో చెప్పారు.. అంటాడు కార్తీక్. కాఫీ తీసుకోండి అంటే అక్కర్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. వీళ్లు అందరూ తేడాగా కనిపిస్తున్నారు ఏంటి.. అందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. వీళ్లు ఏం దాస్తున్నారో ఈరోజు ల్యాబ్ కు వెళ్లి వచ్చాక తేల్చుకుంటాను అని అనుకుంటుంది దీప.

కట్ చేస్తే మోనిత ఆసుపత్రిలో కూర్చొని ఉంటుంది. ఇంతలో భారతి వస్తుంది. ఒకవేళ కార్తీక్ నన్ను కాదంటే నేనేం చేయాలి భారతి అని అడుగుతుంది మోనిత. ఇవన్నీ నువ్వు ముందే ఆలోచించుకోవాలి మోనిత. ఇప్పుడు బాధపడి ఏం లాభం. దీప నిన్ను ఎలా రానిస్తుంది చెప్పు. ఇది కృత్రిమ గర్భం కాదు సహజమైన గర్భం అని తెలిశాక దీప ఊరుకుంటుందా? అంటుంది భారతి.

karthika deepam 30 october 2021 full episode

karthika deepam 30 october 2021 full episode

అది కృత్రిమ గర్భం కాదు.. సహజమైంది అని దీపకు తెలిస్తే.. దీప ఊరుకుంటుందా? కత్తులు మిరియాలు నూరుతుంది. లేదంటే నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. లేదా అన్ని సర్దుకొని వెళ్లిపోతుంది. కానీ.. నేను భయపడేది దీప గురించి కాదు. కార్తీక్, సౌందర్య గురించి. వాళ్లు ఏమంటారో అని నా టెన్షన్ అని చెబుతుంది మోనిత.

దీపకు ఈ నిజం తెలిస్తే ఎలా.. ఏమని చెప్పాలి అని టెన్షన్ పడుతుంది సౌందర్య. కార్తీక్ తో ఇదే విషయం గురించి మాట్లాడుతుంది. నేను దానికి అండగా ఎలా ఉండగలను. ఓపిక పట్టమ్మా అని ఎలా సర్దిచెప్పలేను.. అలా అని నిన్ను కూడా సమర్ధించలేను అంటుంది సౌందర్య. ఇంతలో పిల్లలు వస్తారు. నానమ్మా అమ్మ కనిపించడం లేదు అని అంటారు. దీంతో కార్తీక్, సౌందర్య షాక్ అవుతారు.

కట్ చేస్తే దీప మరోసారి ల్యాబ్ కు వెళ్తుంది. అక్కడ పల్లవి దగ్గరికి వెళ్లి ఆరోజు డ్యూటీలో ఉన్నవాళ్లు వచ్చారా? అని అడుగుతుంది. వచ్చారు మేడమ్ మీరు కూర్చోండి పిలుస్తాను అని అంటుంది పల్లవి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది