Karthika Deepam 30 Sep Today Episode : దుర్గని, మౌనితని అలా చూసిన కార్తీక్ ఏం చేయబోతున్నాడు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 30 Sep Today Episode : దుర్గని, మౌనితని అలా చూసిన కార్తీక్ ఏం చేయబోతున్నాడు..?

 Authored By prabhas | The Telugu News | Updated on :30 September 2022,10:02 am

Karthika Deepam 30 Sep Today Episode : కార్తీక దీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానిని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈ రోజు ఎపిసోడ్ 1471 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మౌనిత మిస్ అవ్వడంతో దుర్గ రేపు చూసుకుంటాను నీ పని నువ్వు ఏరియాలోనే ఉంటావు అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మౌనిత దుర్గ గురించి ఆలోచిస్తూ వీళ్ళు ఎందుకు నన్ను ప్రశాంతంగా ఉండనీకుండా ఒకరు వెనక ఒకరు నా మీద దాడి చేస్తున్నారు అనుకుంటూ.. అయినా నేను ఎందుకు భయపడుతున్నాను ఒకళ్లు వేనక ఒకళ్లు కాదు అందరూ కట్టకట్టుకుని వచ్చి నాపై దాడి చేసిన నన్నేమీ చేయలేరు.. ఎందుకంటే కార్తిక్ కి గతం గుర్తు చేయలేరు చేస్తే కార్తీక్ ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీప అలాంటి పనులు ఎవర్ని చేయనివ్వదు. ఇక జీవితాంతం కార్తీక్ నా దగ్గరే ఉంటాడు. మోనిత మౌనిత అని నా వెనక తిరుగుతూ ఉంటాడు. అని అనుకుంటూ ఉండగా.. కార్తీక్ నిద్రలో దీపా దీప అని అంటూ సౌర్య రౌడీ అని పిలుస్తూ ఉంటాడు. ఇక మౌనిత అది విని గబగబా రూమ్ లోకి వెళ్లి చూస్తూ ఉంటుంది. అంతలో శివ కూడా అక్కడికి వచ్చి కార్తీక్ దీప అని కలవరిస్తూ ఉండగా..మౌనితపై హనుమాన పడుతూ ఉంటాడు. ఇక మౌనిత శివని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తుంది.కార్తీక్ దీప, శౌర్య ఎక్కడున్నారు అని అంటుండగా..

హడలిపోతూ ఉంటుంది. కట్ చేస్తే దుర్గ మోనీతని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి దీపని చూస్తాడు. అప్పుడు దీప దుర్గా ని చూసి సంతోషంతో తన దగ్గరికి వచ్చి దేవుడా నా కోసం దుర్గని పంపించావా అని అనుకుంటూ ఉంటుంది.ఇక దుర్గ నువ్వేంటి అమ్మ దీపమ్మ ఇక్కడున్నావు అని అనగానే దీప జరిగిందంతా దుర్గకి చెప్తుంది. ఇంత జరిగిందా నువ్వెలా ఓపిక పట్టావు తల్లి అది ఇక్కడే కదా ఉండేది అని దుర్గ తన దగ్గరికి వెళ్తాడు. అంతలో కార్తీక్ నాకు తలనొప్పిగా ఉంది. మోనిత కొంచెం తల పట్టవా అని అడుగుతాడు. అప్పుడు మౌనిత కంగారుపడుతూ ఇప్పుడు తలబడితే గతమంతా గుర్తొస్తుంది అని అనుకుంటూ తల పట్టకూడదు.. కార్తీక్ నీకు మంచిది కాదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఒక డాక్టర్ లాగా సలహా ఇస్తూ ఏం కాదు తల పట్టు అని చెప్తూ ఉంటాడు. ఇక మౌనిత కంగారు పడుతూ ఉండగా.. బయటనుంచి హలో మేడం అని దుర్గా పిలుస్తూ ఉంటాడు. ఇక మౌనిక కార్తీక్ దగ్గర నుంచి తప్పించుకొని బయటకు వస్తుంది. ఇక దుర్గని చూసిన మౌనిత ఏంట్రా దేవుడా ఇళ్లు ఇలా దాడి చేస్తున్నారు అని భయపడుతూ తన దగ్గరికి వెళ్లి నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను ఇకనుంచి వెళ్ళిపో అని చెప్తూ ఉంటుంది. కానీ దుర్గ రొమాంటిక్ గా మాట్లాడుతూ మౌనితకు చుక్కలు చూపిస్తాడు. అంతలో శివ వచ్చి ఎవరు మేడం ఇతను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా అని దుర్గ పై దాడి చేయబోతూ ఉంటాడు.

Karthika Deepam 30 september 2022 full episode

Karthika Deepam 30 september 2022 full episode

ఇక మౌనిత ఇక్కడి నుంచి బయటికి వెళ్లి పోరా అని అంటూ ఉండగా.. దుర్గ అక్కడినుంచి వెళ్లి దీపకి జరిగిందంతా చెప్పి.. నీకు నేనున్నాను డాక్టర్ బాబు ని, నిన్ను కలిపే బాధ్యత నాది నా భార్య దీపనే అని చెప్పేలా నేను చేస్తాను.. నువ్వు అస్సలు కంగారు పడకు అని చెప్తాడు. ఇక దీప దొరికితే థాంక్స్ అని చెప్తుంది. కట్ చేస్తే మౌనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. కార్తీక్ వచ్చి ఏంటి మోనిత కంగారు పడుతున్నావ్ అని అనగానే మనం ఇల్లు మారిపోదాం ఇక్కడ బాగాలేదు అన్నట్లుగా చెప్తుంది. అప్పుడు కార్తీక్ సరేలే అని శివాని పిలుచుకుంటూ బయటికి వెళ్తూ ఉండగా.. శివ అక్కడ పడిపోయి ఉంటాడు.. శివని లేపుతూ ఒక డాక్టర్ల ప్రవర్తిస్తూ ఉంటాడు. అది చూస్తున్న మౌనిత అడలిపోతూ ఉంటుంది. అంతలో శివ లేచి దుర్గ గురించి అంతా చెప్తాడు అప్పుడు కార్తీక్ దుర్గ గురించి మౌనిత అని అడుగుతాడు. ఇక అంతలో దొరక కూడా అక్కడికి వచ్చి ఒక డ్రామా అప్లై చేస్తాడు. అప్పుడు కార్తీక్ అవునా అయితే మీరు ఇక్కడే ఉండండి అని చెప్తాడు. ఇక దీప కూడా అక్కడికి వచ్చి శివ కి గోంగూర పచ్చడి ఇస్తూ ఈనెవరు ఈ బంధువా అనే డాక్టర్ బాబుని అడగగా డాక్టర్ బాబు కాదు వంటలక్క మౌనిత వల్ల బంధువట అని చెప్తాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో మౌనిత తో దుర్గ క్లోజ్ గా ఉండడం చూసి కార్తీక్ చిరాకు పడుతూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో వేచి చూడాల్సిందే..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది