Karthika Deepam 31 Dec Today Episode : జైలు నుంచి విడుదల కాగానే కోటేశ్, శ్రీవల్లిపై పగ తీర్చుకున్న రుద్రాణి.. శ్రీవల్లి, కోటేశ్ కు యాక్సిడెంట్.. మరో ట్విస్ట్ ఏంటంటే?

Karthika Deepam 31 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 డిసెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 1237 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీవల్లి వాళ్లు ఆ రుద్రాణి మీద అనవసరంగా పోలీస్ కేసు పెట్టారేమో అని దీపతో అంటాడు కార్తీక్. రుద్రాణి ఎలాగూ జైలుకు వెళ్లిపోయింది కదా. తనతో ఇక మనకు అంత ప్రమాదం ఏం ఉండదు అంటుంది దీప. రేపటి నుంచి పిండి వంటలు తయారు చేస్తున్నా.. దానికి మీ పేరే పెడతా అంటుంది దీప. దీంతో వద్దు దీప నా పేరు వద్దు. నాది అంతా దురదృష్టజాతకమే కదా అంటాడు కార్తీక్. మరోవైపు రుద్రాణి.. స్టేషన్ నుంచి విడుదల అయి వస్తుంది. ఇంటికి వచ్చి పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మోరికి బలి ఇచ్చే టైమ్ వచ్చింది. అమ్మోరి గుడి దగ్గర యాటలను బలి ఇవ్వాలి అంటుంది. రెండు యాటలను బలి ఇవ్వాలి అంటుంది. అందరూ గుడిలో పనులు చూసుకోండి.. అంటుంది రుద్రాణి.

karthika deepam 31 december 2021 full episode

అక్కా.. బలి రెండు యాటలు అన్నావు తప్పదా అని అడుగుతాడు అబ్బులు. తప్పడం లేదురా అబ్బులు.. అనవసరంగా అడ్డొస్తే వాళ్లిద్దరినీ కూడా వేసేద్దాం అంటుంది రుద్రాణి. మరోవైపు మోనితకు ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. నర్సమ్మ కాఫీ ఇవ్వు అని పిలుస్తుంది. మనింటికి ఎవ్వరూ సరుకులు ఇవ్వడం లేదమ్మా. చివరకు పాల ప్యాకెట్లు కూడా ఇవ్వడం లేదు అంటుంది. ఓకే.. ఎక్స్ పెక్ట్ చేశా. సహాయనిరాకరణ అన్నమాట.. అంటుంది. నీది ఏ ఊరు అని అడుగుతుంది. ఊరుదేముంది మేడమ్ నేను దూరం వెళ్లి అన్నీ తీసుకొస్తా అని చెబుతుంది నర్సమ్మ. ఏంటి దీపక్క.. నీకు ఇక్కడ ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారా? అసలు నేను ఇక్కడికి వచ్చిందే మీరు ఎక్కడున్నారో ఆచూకీ తెలుసుకోవడం కోసం. ఇవాళ కాకపోతే రేపు.. రేపు కాకపోతే ఎల్లుండి తెలుస్తుంది. అందుకే ఇక్కడ కాలు పెట్టాను.. రేపు వాళ్లను కూడా నావైపునకు తిప్పుకుంటాను అని అనుకుంటుంది మోనిత.

మరోవైపు తన కొడుకును ఎత్తుకెళ్లిన కోటేశ్ ఫోటోను చూసి.. వీడెవడు.. అసలు.. ఎక్కడుంటాడు. వీడిని ఎలా పట్టుకోవాలి అంటూ బాధపడుతూ ఉంటుంది మోనిత. మరోవైపు తమ బిడ్డ తమకు దక్కాడని చాలా సంతోష పడతారు కోటేశ్, శ్రీవల్లి. మేము గుడికి వెళ్లి వస్తాము.. కాసేపు బాబును చూడు అంటుంది శ్రీవల్లి. ఈ ఒక్క రోజు చూసుకో అక్క. అటునుంచి అటే స్కూల్ కు వెళ్లి వస్తాము అంటుంది శ్రీవల్లి.

Karthika Deepam 31 Dec Today Episode : గుడికి వెళ్లిన శ్రీవల్లి, కోటేశ్.. ఇంటికి తిరిగి వస్తారా?

సరేలే అని చెబుతుంది. దీంతో వాళ్లు వెళ్లిపోతారు. తమ్ముడు అంటూ పిల్లలు కూడా ఆడుకుంటారు. నాన్న ఎక్కడికి వెళ్లాడు అంటే.. బయట కూర్చున్నాడు అంటుంది దీప. మరోవైపు ఆదిత్య.. ఫెద్దోడి గురించి ఏదైనా ఆచూకి తెలిసిందా అని అడుగుతుంది సౌందర్య. అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను కానీ.. ఫోన్ లేకపోవడం వల్ల ఆచూకీ తెలియడం లేదు అంటాడు ఆదిత్య.

కార్తీక్ అందరికీ దూరంగా వెళ్లాడు కానీ తప్పించుకొని వెళ్లలేదు. వాడిని వెతుకు కానీ.. వాడు తలవంచుకునేలా మాత్రం చేయకు అని ఆదిత్యతో అంటాడు ఆనంద రావు. వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అంటాడు ఆనంద రావు. పిల్లాడిని చూసి ముచ్చటపడుతుంది దీప.

ఇంతలో కార్తీక్ వచ్చి.. రుద్రాణి జైలు నుంచి విడుదలైందట. రుద్రాణి.. కోటేశ్ ను అస్సలు వదలు అని కూడా అనుకుంటున్నారు. కోటేశ్ వాళ్లకు కూడా చాలా ప్రమాదం అని అనుకుంటారు. ఇంతలో కోటేశ్, శ్రీవల్లి స్కూటీ మీద గుడికి వెళ్లి వస్తుంటారు. రుద్రాణి మనిషి అబ్బులు ట్రక్ లో కూర్చొని వాళ్లు రోడ్డు మీద వెళ్తుండగానే చూసి పోనియిరా అంటాడు. దీంతో ట్రక్.. వాళ్ల స్కూటీని ఫాలో అవుతుంది.

మరోవైపు నాన్నను ఏమీ అడగొద్దు అంటూ పిల్లలకు స్కూల్ కు వచ్చి మరీ చెబుతుంది దీప. మీకు ఏది అవసరం ఉన్నా కూడా నన్నే అడగాలి అంటుంది దీప. వాళ్ల కోసం చెప్పులు కొని తీసుకొస్తుంది దీప. వాటిని వేసుకుంటారు పిల్లలు. కార్తీక్ మాత్రం ఇంకా ఏదో విషయం గురించి సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు.

ఇంతలో ట్రక్ తో కోటేశ్ స్కూటీని గుద్దిస్తుంది రుద్రాణి. దీంతో కోటేశ్, శ్రీవల్లి రోడ్డు పక్కన పడిపోతారు. ఇద్దరికీ తీవ్రగాయాలు అవుతాయి. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్ వెంటనే రుద్రాణి ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

13 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

14 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

14 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

16 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

17 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

18 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

19 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

19 hours ago