Karthika Deepam 31 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 జనవరి 2022, సోమవారం ఎపిసోడ్ 1263 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 5 లక్షలు ఇచ్చి మీ కూతురును బాగుచేయించుకోండి అంటుంది రుద్రాణి. మీ కూతురుకు ఏమైందో ఏమో.. తీసుకెళ్లి వైద్యం చేయించు. నీ వెనుక నేనున్నాను సారు అంటుంది రుద్రాణి. డబ్బుదేముంది సారు.. ఇవాళ నా చేతుల్లో ఉంటుంది.. రేపు నీ చేతుల్లో ఉంటుంది. డబ్బు శాశ్వతం కాదు కదా సారు.. నేను చెడ్డదాన్నే నాకు డబ్బు అంటే పిచ్చి కాదనట్లేదు. కానీ.. అంతకంటే ఎక్కువగా పిల్లలంటే ఇష్టం సారు.. నువ్వు ఎలాగూ సంతకం పెట్టావు. కానీ డబ్బులు కట్టలేదు. కట్టలేవు కూడా. అది నాకు బాగా తెలుసు. ఈ డబ్బు తీసుకో. ఎటూ నీకూతుళ్లలో ఒకరిని నాకు ఇవ్వాలి కదా అంటుంది రుద్రాణి.
దీంతో రుద్రాణి గారు.. అంటాడు. ఏంటి సారు.. నేను ఇచ్చినా ఎవరు ఇచ్చినా డబ్బులు అవసరానికి పనికొస్తాయి సారు.. తీసుకో అని అతడి చేతుల్లో పెడుతుంది రుద్రాణి. నాకు తెలుసు సారు.. నువ్వు డబ్బులు తీసుకుంటావని. డబ్బులు ఎలాంటి వారినైనా మాయ చేస్తాయి అంటుంది. దీంతో ఆ డబ్బులను తీసి తన మనిషి చేతుల్లో పెడతాడు. రుద్రాణి గారు మీకు డబ్బు ఎక్కువగా ఉండొచ్చు. కానీ.. అంతకంటే ఎక్కువ నాకు ఆత్మాభిమానం ఉంది. గడువుకు ఇంకా చాలా సమయం ఉంది. మీ గడువులోగా డబ్బు చెల్లిస్తాను. అది చెప్పడానికే ఇక్కడిదాకా వచ్చాను. మీ వాళ్లను నా వెంట పడొద్దని చెప్పండి అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
రౌడీని కాపాడుకోవాలంటే ఇక నాకు వేరే దారి లేదు. వెంటనే ఆదిత్యతో మాట్లాడాలి అని అనుకుంటాడు కార్తీక్. అత్తమ్మ అంటూ రౌడీ పక్కనే ఉంటుంది దీప. నువ్వు వెళ్లు అప్పారావు అంటుంది దీప. మిమ్మల్ని ఇలా వదిలిపెట్టి నేను వెళ్లను అక్క అంటాడు అప్పారావు.
ఇంతలో కార్తీక్.. సైకిల్ మీద ఇంటికి వస్తుంటాడు. అప్పారావును చూసి నువ్వేంటి ఇక్కడ అంటాడు. మా ఇల్లు నీకెలా తెలుసు అంటాడు. బావా నాకు అన్నీ తెలిశాయి బావా. హోటల్ ఓనర్ అన్నీ చెప్పాడు అంటాడు. మరోవైపు కార్తీక్ ఇంట్లోకి వెళ్తాడు. శౌర్యను చూసి బాధపడతాడు.
వెళ్లిన పని అయిందా అని అడుగుతుంది దీప. దీంతో లేదు దీప అంటాడు కార్తీక్. శౌర్య పరిస్థితి ఏం బాగాలేదు అని అనుకుంటాడు. ఒక ట్యాబ్లెట్ తెచ్చి ఈ ట్యాబ్లెట్ శౌర్య నాలిక కింద పెట్టాలి అంటాడు. ఏమైనా ప్రమాదమా అంటుంది దీప. ఏం లేదు.. ఏం కాదు అంటాడు కార్తీక్.
ఈ ట్యాబ్లెట్ నాలిక కింద పెడితే హార్ట్ ఎటాక్ ను కాసేపు ఆపొచ్చని నీకు ఎలా చెప్పాలి దీప అని అనుకుంటాడు కార్తీక్. ఆదిత్యకు ఫోన్ చేయడం తప్ప మరో మార్గం లేదు. శౌర్యను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. స్టంట్ వేయించాలి. అవసరం అయితే ఆపరేషన్ కూడా చేయాలేమో అని అనుకుంటాడు కార్తీక్.
బయటికి వచ్చి అప్పు ఫోన్ నుంచి ఆదిత్యకు ఫోన్ చేస్తాడు కార్తీక్. కానీ.. ఆదిత్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో ఏం చేయాలో కార్తీక్ కు అర్థం కాదు. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేస్తాడు. ఇంతలో అంబులెన్స్ వస్తుంది. దాంట్లో శౌర్యను తీసుకొని ఆసుపత్రికి వెళ్తారు. మేము వచ్చేవరకు ఆనంద్ ను చూసుకోమ్మని మహాలక్ష్మికి చెప్పు అని విజయలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప.
కట్ చేస్తే.. ఆసుపత్రికి శౌర్యను తీసుకొని వస్తారు. ఏమైంది అని అడుగుతారు. సడెన్ గా పడిపోయింది. ఒకసారి డాక్టర్ ను పిలవండి అంటాడు కార్తీక్. ముందు ఏమైందో చెప్పండి అంటుంది. డాక్టర్ గారు బిజీగా ఉన్నారు.. ఆపరేషన్ చేస్తున్నారు అంటుంది.
ఇంతలో రుద్రాణి వస్తుంది. వాళ్ల పద్ధతులేవో వాళ్లకు ఉంటాయి కదా దీపమ్మ అంటుంది రుద్రాణి. ఏం దీప.. అప్పు పుట్టిందా.. పుట్టదు అని నాకు తెలుసు కదా అంటుంది. చూడు సారు.. చూస్తే చదువుకునే వాడిలా ఉన్నావు. ఇందులో డబ్బు ఉంది.. డబ్బు కట్టకుండా ఆసుపత్రుల్లో ఎవ్వరూ వైద్యం చేయరు. డబ్బు కట్టాల్సిందే కదా.. తీసుకోండి సారు అంటుంది.
దీపమ్మ తీసుకో. ఏంటమ్మా అలా చూస్తున్నారు. కోపం వస్తుందా అంటుంది రుద్రాణి. నీ కూతురును చూడు ఎలా పడి ఉందో.. కూతురు కొట్టిమిట్టాడుతుంటే ఇప్పుడు కోపం ఏంటి దీపమ్మ. ఆత్మాభిమానం ఉండాలి కానీ.. మరీ ఇంత ఉండొద్దు కదా.. ఏంటి సారు ఇది మీకు అస్సలు లౌక్యం తెలియదు.. అంటుంది రుద్రాణి.
ముందు డబ్బులు తీసుకొని లెక్కలు తర్వాత చూసుకోండి అంటుంది రుద్రాణి. నేను ఏం అడుగుతున్నాను. పాత బాకీ రద్దు చేస్తాను. వడ్డీ డబ్బులు మాఫీ చేస్తాను. ఇప్పుడు ఇచ్చే కొత్త అప్పు.. అప్పే కాదు. నాకు ఈ డబ్బు తిరిగి ఇవ్వకండి. బదులుగా ఈ బంగారు తల్లిని ఇవ్వండి చాలు అంటుంది రుద్రాణి.
దీంతో రుద్రాణిపై కార్తీక్, దీప సీరియస్ అవుతారు. మీరేంటి అసలు.. పిల్లను అనారోగ్యంతో దూరం చేసుకుంటారా.. నా దగ్గరికి పంపించి పిల్లను కాపాడుకుంటారా? జరగరానిది ఏదైనా జరిగితే అని రుద్రాణి అనగానే రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
పాపను వచ్చి డాక్టర్ చూస్తాడు. ట్రీట్ మెంట్ చేయండి సార్ అంటాడు. స్టంట్ వేయాలి సార్ అంటాడు. ఫార్మాలిటీస్ పూర్తి చేశారా అని డాక్టర్ అడుగుతాడు. ముందు ఆపరేషన్ చేయండి సార్ అంటాడు. కుదరదు అంటాడు డాక్టర్. నీ కూతురు ఉంటే ఇదే పని చేస్తావా అని అంటాడు. దీంతో వీళ్లను బయటికి గెంటేయండి అంటాడు డాక్టర్.
ఇంతలో అప్పారావు వచ్చి హిమ కనిపించడం లేదు బావా అంటాడు. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇంతలో హిమ.. రుద్రాణి ఇంటికి వస్తుంది. మా శౌర్యకు ఏమైందో తెలియదు. ఆపరేషన్ చేయాలంటున్నారు. డాడీ దగ్గర డబ్బులు లేవు.. అంటుంది హిమ.
నన్ను ఏం చేయమంటావు బంగారం అంటుంది రుద్రాణి. నేను మీ దగ్గరే ఉంటాను. శౌర్య ఆపరేషన్ కు డబ్బులు ఇవ్వండి.. ప్లీజ్ ఆంటి. ఎప్పటికీ ఇక్కడే ఉండమన్నా ఉంటాను. మా శౌర్యకు ఏం కాకూడదు అంటుంది హిమ. నాకు శౌర్య బాగుంటే చాలు. నేను మీదగ్గరే ఎప్పటికీ ఉండిపోతాను. సరేనా ఆంటి అంటుంది హిమ.
డబ్బులు ఇచ్చి శౌర్యను కాపాడండి ఆంటి అంటుంది హిమ. నా బంగారమే.. నా తల్లే. ఏంట్రా నువ్వు నా ముందు చేతులు కట్టుకోవడం ఏంటి. నాకు పిల్లలు లేని ముచ్చట తీర్చాలి. నువ్వు మా అమ్మలాగే ఉంటావు తెలుసా. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటుంది.
నీది ఎంత మంచి మనసురా బంగారం. నన్ను వెతుక్కుంటూ వచ్చావా. నేను చెప్పినట్టు మీ అమ్మానాన్నలు వినడం లేదు. నేను ఏం చేయాలి అంటుంది రుద్రాణి. నువ్వు ఇదే మాట మీద ఉండు. నేను మీ అమ్మానాన్నలతో మాట్లాడుతాను అంటుంది రుద్రాణి. తనను ఇంట్లోకి తీసుకెళ్తుంది.
కట్ చేస్తే ఆదిత్య.. ఫోన్ పోయిందని బాధపడుతూ ఉంటాడు. అలా ఎలా ఫోన్ మరిచిపోతావు అని శ్రావ్య అడుగుతుంది. దీంతో మోనిత కనిపించగానే ఆ ఫ్రస్ట్రేషన్ లో అలా ఫోన్ మరిచిపోయా అంటాడు. నా ఫోన్ కూడా రిపేర్ కు ఇచ్చా అంటుంది శ్రావ్య.
ఆ ఫోన్ నెంబర్ కూడా అన్నయ్య పేరు మీద ఉంది అని అంటాడు ఆదిత్య. మరోవైపు హిమకు స్వీట్లు తీసుకొచ్చి ఇస్తుంది రుద్రాణి. మా శౌర్యకు హెల్త్ బాగా లేదు. నేను తినను అంటుంది హిమ. అబ్బ.. ఇదిరా పెంపకం అంటే.. అంటుంది రుద్రాణి.
మా శౌర్య బాగు అవ్వాలంటే డబ్బులు కావాలి అంటుంది హిమ. దీంతో డబ్బులు నేను ఇస్తాను కదా అంటుంది రుద్రాణి. నా ఆస్తులన్నీ నీకే. నిన్ను తాడికొండలో మరో రుద్రాణిలా తయారు చేస్తా అంటుంది రుద్రాణి. ఇంతలో దీప వచ్చి రుద్రాణి అంటుంది.
మరోవైపు శౌర్యను ఇంకో ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఈ ఆపరేషన్ చాలా కష్టం అని నేను ఈ ఆపరేషన్ చేయలేనని డాక్టర్ అంటాడు. ఈ ఆపరేషన్ డాక్టర్ కార్తీక్ అయితేనే చేయగలరు అంటాడు డాక్టర్. దీంతో నేను కార్తీక్ గారితో మాట్లాడుతాను అంటుంది దీప. మీరే శౌర్యను కాపాడాలని.. శౌర్యకు ఆపరేషన్ చేయాలని అంటుంది దీప. దీంతో కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.