Karthika Deepam 31 May Today Episode : శోభను పెళ్లి చేసుకోవడానికి నిరుపమ్ ఒప్పుకుంటాడా? ఈ విషయం తెలిసి జ్వాల షాకింగ్ నిర్ణయం

Karthika Deepam 31 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 మే 2022, మంగళవారం ఎపిసోడ్ 1366 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిరుపమ్ మాత్రం హిమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నాకు నువ్వంటే ఇష్టం బావ అని హిమ అప్పుడు అన్న విషయాన్నే గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో హిమ అక్కడికి వస్తుంది. డాక్టర్ నిరుపమ్ అని పిలుస్తుంది. దీంతో నిరుపమ్ షాక్ అవుతాడు. ఏమైంది హిమ నీకు. బావ అనే పిలుపు కూడా మరిచిపోయావా? డాక్టర్ నిరుపమ్ అంటున్నావు అంటాడు. దీంతో నిన్ను మరిచిపోవడం కాదు.. నువ్వు నన్ను మరిచిపోవడమే నాకు కావాలి అని మనసులో అనుకుంటుంది హిమ. బావ అని కాకుండా.. డాక్టర్ నిరుపమ్ అంటే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా హిమ. ఒక త్రిశూలం తెచ్చి గుండెల్లో గుచ్చినంత బాధగా ఉంటుంది హిమ అంటాడు నిరుపమ్.

karthika deepam 31 may 2022 full episode

నీకు తగిన అమ్మాయిని చూపిస్తాను. పెళ్లి చేసుకో అంటుంది హిమ. దీంతో నిరుపమ్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు. నువ్వు నాకు అమ్మాయిని చూపిస్తావా. నేను పెళ్లి చేసుకోవాలా. ఏమైంది నీకు అంటాడు నిరుపమ్. ఇంతలో అక్కడికి శోభ వస్తుంది. దీంతో పదా బయటికెళ్దాం అని శోభను తీసుకెళ్తాడు నిరుపమ్. మరోవైపు తన ఇంటికి సౌందర్యను తీసుకొని వెళ్తుంది జ్వాల. కుడికాలు ముందుకు పెట్టి లోపలికి రా అంటుంది. నేనేమైనా కొత్త కోడలునా అంటుంది సౌందర్య. నీకు నాకు ఏం గొడవలు ఉన్నాయి అంటుంది. లోపలికి తీసుకెళ్లి ఇదే నా సామ్రాజ్యం అంటుంది జ్వాల.

తర్వాత తనకు టీ ఇస్తుంది. సౌందర్య తాగిన తర్వాత ఏదో మాట్లాడాలన్నావు కదా అని అంటుంది. దీంతో ఏం లేదు రౌడీ. మా మనవరాలు అంటూ ఏదో చెప్పబోతుంది. ఇంతలో హిమ.. జ్వాలకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు అని అడుగుతుంది.

దీంతో నేను తర్వాత మాట్లాడుతాను అంటుంది. ఇప్పుడు చెప్పు సీసీ.. ఏమైంది అని అడుగుతుంది. దీంతో తన మనవరాలు హిమ గురించి మాట్లాడుతుంది. తనది నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయింది. తనతో మాట్లాడి తనను ఎలాగైనా పెళ్లికి ఒప్పించు అంటుంది.

నా శత్రువు పెళ్లికి నేను ఒప్పించాలా.. కుదరని పని అనుకుంటుంది. ఆగు.. ఇప్పుడే వస్తా ఆగు అంటుంది. మరోవైపు ఇంద్రుడు, చంద్రమ్మను చూస్తుంది స్వప్న. నన్నే బురడి కొట్టిస్తున్నారా.. మీ సంగతి చెబుతా ఆగు అని అనుకొని వాళ్లను పిలుస్తుంది.

Karthika Deepam 31 May Today Episode : శోభను నీకిచ్చి పెళ్లి చేస్తా అని నిరుపమ్ తో చెప్పిన స్వప్న

ఏమైంది మేడమ్ కారు బాగోలేదా అని అంటాడు ఇంద్రుడు. కారు బాగానే ఉంది కదా అంటాడు. మేమిద్దరం చాలా మంచి వాళ్లం మేడమ్ అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటారు వీళ్లు. మరోవైపు హిమను చూసుకోవడానికి వస్తారు. మా అబ్బాయి మిమ్మల్ని ఎక్కడో చూసి ఇష్టపడ్డాడట అంటారు.

నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిస్తే అయినా నిరుపమ్ బావ మనసు మారుతుందేమో అని అనుకుంటుంది హిమ. బావ నా మీద ప్రేమ చంపుకుంటాడేమో ఎలాగైనా సరే.. ఈ విషయం బావకు తెలిసేలా చేయాలి అని అనుకుంటుంది హిమ.

ఈ కాలంలో పుట్టినా కూడా అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది అంటారు. మరోవైపు శోభను నీకిచ్చి పెళ్లి చేస్తా అని నిరుపమ్ తో చెబుతుంది స్వప్న. దీంతో ఇలాంటి ఆలోచనలు మనసులో నుంచి తీసేయ్. శోభకు ఈ విషయం తెలిస్తే లేనిపోని ఆశలు పెట్టుకుంటుంది అంటాడు నిరుపమ్.

నేను పెళ్లి చేసుకోనని చెబుతున్నాను కదా అంటాడు నిరుపమ్. హిమ కాదంటే నేను పెళ్లే చేసుకోను అంటాడు. నిన్ను కాదన్న హిమ ఏమో పెళ్లి చేసుకుంటోంది. నువ్వేమో దాన్ని తలుచుకుంటూ పెళ్లే వద్దంటున్నావు అంటుంది స్వప్న. దీంతో నేను నమ్మను అంటాడు. కానీ.. చివరకు హిమ పెళ్లి చేసుకుంటోందని షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

9 minutes ago

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

1 hour ago

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌ పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !

Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…

2 hours ago

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

3 hours ago

Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా…?

Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…

4 hours ago

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

5 hours ago

Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?

Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…

6 hours ago

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

7 hours ago