Karthika Deepam 31 Oct Today Episode : మోనిత కొడుకు వల్ల కార్తీక్ కు ప్రాణగండం.. మోనితకు కొడుకు ఎలా పుట్టాడో తెలుసుకొని దీప షాకింగ్ నిర్ణయం?
Karthika Deepam 31 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ 1 నవంబర్ 2021, 1185 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శనివారం ఎపిసోడ్ లో కార్తీక్ పై ఆనంద రావు సీరియస్ అవుతాడు. కార్తీక్ ను కొడతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఛీ.. ఛీ.. నువ్వసలు మనిషివేనా అంటూ తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో కార్తీక్ చాలా బాధపడతాడు. అయితే.. మోనితకు కొడుకు పుట్టిన విషయాలు ఏవీ కార్తీక్, సౌందర్య.. దీపకు చెప్పరు. కానీ.. ప్రియమణి ద్వారా దీప అన్ని విషయాలు తెలుసుకుంటుంది. మోనితకు కొడుకు పుట్టిన విషయాన్ని తెలుసుకొని చాలా బాధపడుతుంది.

karthika deepam 31 october 2021 episode highlights
మరోసారి ల్యాబ్ కు వెళ్తుంది. అక్కడ ఆరా తీయగా.. అసలు ఆ శాంపిల్స్ ఎవ్వరికీ ఇవ్వలేదని.. మోనిత ఎవరో కూడా మాకు తెలియదని.. నూటికి నూరు శాతం ఆ శాంపిల్ ఇక్కడే ఉందని డాక్టర్ చెప్పడంతో షాక్ అవుతుంది దీప. ఏం చేయాలో దీపకు అర్థం కాదు. మరి ఎవరు మోసం చేస్తున్నట్టు.. కార్తీక్ అబద్ధం చెబుతున్నాడా…. లేక మోనిత డాక్టర్లను మేనేజ్ చేస్తుందా? అసలు మోనితకు గర్భం ఎలా వచ్చిందో తెలియక సతమతం అవుతుంది దీప.
మరోవైపు ఇంట్లో అమ్మ లేదు ఎటో వెళ్లిపోయింది.. ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది అని చెప్పి పిల్లలు వచ్చి కార్తీక్, సౌందర్యను అడుగుతారు. దీంతో కార్తీక్, సౌందర్య టెన్షన్ పడతారు. ఎక్కడికి వెళ్లింది దీప అని అందరూ టెన్షన్ పడతారు. కానీ.. దీప వచ్చింది ల్యాబ్ కు అనే విషయం వారికి తెలియదు. అసలు.. ఏం జరుగుతుందో తెలియక సతమతం అవుతుంది దీప.
Karthika Deepam 31 Oct Today Episode : మరో ప్లాన్ వేసిన ప్రియమణి
ఇంతలో ప్రియమణి వచ్చి పుట్టిన బాబు పేగు మెడకు వేసుకొని పుట్టాడంట కదా అమ్మా అంటుంది. హా.. అయితే ఏంటి అని సౌందర్య ప్రశ్నిస్తుంది. ఏం లేదమ్మా.. అలా పుడితే కన్నతండ్రికి గండం అట కదమ్మా.. ఆ పిల్లాడి తండ్రి కార్తీకే కదా అంటుంది ప్రియమణి. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. కార్తీక్ కు నిజంగానే ఏదైనా అవుతుందా అని టెన్షన్ పడుతుంది సౌందర్య.

karthika deepam 31 october 2021 episode highlights
అసలు.. మీ రిపోర్ట్ తీసుకోవడానికే ఎవ్వరూ రాలేదు అని దీపతో డాక్టర్ అంటాడు. మా ల్యాబ్ నుంచి శాంపిల్ వెళ్లలేదు.. వెళ్లదు కూడా అని ఖరాఖండిగా చెబుతాడు డాక్టర్. దీంతో దీప షాక్ అవుతుంది. ఈ విషయం ఎక్కడికి వచ్చి చెప్పమన్నా.. నిర్భయంగా చెబుతాను మేడమ్ అని డాక్టర్ అనేసరికి.. దీప లేచి ఒక్కతే నడుచుకుంటూ వెళ్లిపోతుంది. పక్కనే కారు ఉన్నా.. వారణాసి ఉన్నా పట్టించుకోకుండా.. అక్కడి నుంచి నడుచుకుంటూ ఎక్కడికో వెళ్లిపోతుంది. ఆ తర్వాత దీప ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు ఆగాల్సిందే.