Karthika Deepam 4 Dec Today Episode : ఆపరేషన్ ఫెయిల్.. చనిపోయిన పేషెంట్.. కార్తీక్ పై దుమ్మెత్తిపోసిన పేషెంట్ భార్య | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 4 Dec Today Episode : ఆపరేషన్ ఫెయిల్.. చనిపోయిన పేషెంట్.. కార్తీక్ పై దుమ్మెత్తిపోసిన పేషెంట్ భార్య

 Authored By gatla | The Telugu News | Updated on :4 December 2021,9:01 am

Karthika Deepam 4 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు డిసెంబర్ 4, 2021 శనివారం ఎపిసోడ్ 1214 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ చేస్తూ కార్తీక్ ఒక పేషెంట్ ను చంపేస్తాడు. వద్దు అని చెప్పినా వినలేదు కదా నువ్వు కార్తీక్ అంటాడు రవి. పక్కకు తప్పుకో అని చెప్పినా కూడా వినకుండా ఆఫరేషన్ చేసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నావు కదా కార్తీక్.. అంటాడు రవి. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. నాకు ఏదో మత్తు వచ్చినట్టు అనిపించింది అంటాడు కార్తీక్. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. వందల ఆపరేషన్లు చేసి సక్సెస్ చేసిన గ్రేట్ కార్డియాలజిస్ట్ ఇప్పుడు ఇలా ఒక పేషెంట్ ను చంపడం ఏంటి అని అంటాడు రవి.

karthika deepam 4 december 2021 full episode

karthika deepam 4 december 2021 full episode

కట్ చేస్తే మోనిత ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తనకు ఒక మెసేజ్ వస్తుంది. జయంతి నుంచి వస్తుంది. థమ్సప్ సింబల్ తో మెసేజ్ వస్తుంది. దీంతో ప్రియమణి చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. కార్తీక్ జీవితం తలకిందలు చేశాను ప్రియమణి అంటుంది మోనిత. కార్తీక్ పని అయిపోయింది ప్రియమణి.. అంటుంది మోనిత. నాకేం అర్థం కావడం లేదు అంటుంది ప్రియమణి. నీకు అర్థం కావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ముందు వెళ్లి ఆనంద రావు సంగతి చూడు అని చెబుతుంది మోనిత. మైడియర్ కార్తీక్.. మోనిత ఏం చేస్తుందో ఏం చేయగలదో నీకు ఇప్పట్లో అర్థం కాదు అనుకుంటుంది మోనిత.

నర్సు జయంతి కార్తీక్ కు ఆపరేషన్ కు ముందు కాఫీ ఇస్తుంది. ఆ కాఫీలో మత్తు ట్యాబ్లెట్లు వేసి ఇస్తుంది. అది తాగాకనే కార్తీక్ ఆపరేషన్ థియేటర్ కు వెళ్తాడు. మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక.. పేషెంట్ చనిపోతాడు. పేషెంట్ చనిపోయాడని తెలుసుకున్న పేషెంట్ భార్య కార్తీక్ మీద విరుచుకుపడుతుంది. నువ్వేం డాక్టర్ వి అంటారు.

ఆసుపత్రిలో ఆ పేషెంట్ భార్య ఏడుస్తూ నువ్వే చంపేశావు నా మొగుడిని. నీకిదేమన్నా న్యాయంగా ఉందా? నీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్నావు కదా. వాళ్లకు మా పాపం తగులుతుంది. మా పిల్లల ఉసురు తగులుతుంది. మా తాళీ తెంపేశావు. మీరు నాశనం అయిపోతారు.. మట్టి కొట్టుకుపోతారు అని అంటుంది.

కట్ చేస్తే.. ఇంట్లో పిల్లలతో సంతోషంగా ఉంటారు పిల్లలు. సౌందర్య, ఆనంద రావుతో సరదాగా గడుపుతుంటారు. కార్తీక్ పిల్లల గురించే ఆలోచిస్తుంటాడు. నాకేమైంది. ఎందుకిలా అయింది. రవి మాటలు వింటే అలా జరగకపోయేదేమో. నిండు ప్రాణం నిలబడేదేమో. సరిదిద్దుకోలేని పాపం చేశాను.. అని కార్తీక్ బాధపడుతుంటాడు.

Karthika Deepam 4 Dec Today Episode : నువ్వు బాగుపడవు.. అని కార్తీక్ ను శాపనార్థాలు పెట్టిన పేషెంట్ భార్య

వెళ్తున్నావా డాక్టర్. ఇంటికి వెళ్తున్నావా? మీ ఇంట్లో దీపం వెలిగించే ప్రతి రోజు నా ఇంటి దీపం ఆపేశావన్న సంగతి ఎప్పుడూ నీకు గుర్తొస్తుంది. నీ చేతులతో నా పసుపు కుంకుమను తూడ్చేశావు. నీ చేతితో అన్నం కలుపుకు తినే ప్రతిసారి.. నేను గుర్తుకు రావాలి. నువ్వు నీ పెళ్లాం పిల్లలు బాగుపడరు. నాశనం అయిపోతారు.. మట్టికొట్టుకుపోతారు.. అని అంటుంది పేషెంట్ భార్య.

మరో వైపు ఇంట్లో మాత్రం అందరూ సంతోషంగా ఉంటారు. కార్తీక్ ఆపరేషన్ చేసి పేషెంట్ ను చంపేసిన విషయం తెలియదు. అయితే.. కార్తీక్ ఇంకా రావడం లేదని ఓవైపు సౌందర్య ఎదురు చూస్తూనే ఉంటుంది. కానీ.. ఈ విషయం మాత్ర ఎవ్వరికీ తెలియదు.

పిల్లలు.. ఆదిత్యతో గొడవ పడుతుంటారు. మాకు ఐస్ క్రీమ్ తినిపిస్తేనే దీపు గాడిని ఎత్తుకుంటాం అంటారు శౌర్య, హిమ. ఇంతలో కార్తీక్ ఇంటికి వస్తాడు. ఆనందంగా ఉన్న పిల్లలను చూస్తాడు. ఏ చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

 

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది