Karthika Deepam 4 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 మార్చి 2022, శుక్రవారం ఎపిసోడ్ 1291 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా కార్డులు ప్రింట్ చేసి మరీ అందరినీ ఆహ్వానించింది మీ అమ్మ అని కార్తీక్ తో అంటుంది మోనిత. దీంతో మమ్మీ.. ఏంటిది. ఆనంద్ ను మనం దత్తత ఇస్తున్నామా. నువ్వు కార్డులు పంచావా అని అడుగుతాడు కార్తీక్. దీంతో అవును కార్తీక్ అంటుంది సౌందర్య. మమ్మీ.. ఏం మాట్లాడుతున్నావు. ఆనంద్ ను మనం దత్తత ఎందుకు ఇస్తాం అంటాడు కార్తీక్. పిల్లలు లేని దంపతులు నన్ను కలిశారు. అందుకే.. ఆనంద్ ను వాళ్లను దత్తత ఇవ్వాలనిపించింది అంటుంది సౌందర్య. దీంతో దత్తత ఇవ్వడానికి వీళ్లు ఎవరు.. తీసుకోవడానికి వాళ్లు ఎవరు.. అని అంటుంది మోనిత.
ఈ దత్తతను నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అంటుంది మోనిత. ఇది జరిగి తీరుతుంది అంటుంది సౌందర్య. దీంతో నువ్వెవరే ఒప్పుకోకపోవడానికి అంటుంది సౌందర్య. దీంతో నేను ఆ బాబు కన్నతల్లిని అంటుంది మోనిత. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. మోనిత మతిపోయిందా నీకు.. అని అంటాడు కార్తీక్. దీంతో నాకు మతి ఇప్పుడు పోతోంది కార్తీక్. ఈ ఆనంద్ నా బాబు. మన బాబు. నా కన్నకొడుకు అంటుంది మోనిత. దీంతో మమ్మీ ఏంటిది.. దీప.. తనేం మాట్లాడుతుందో విన్నావా అని అంటాడు కార్తీక్. తను నిజం చెబుతోంది కార్తీక్ అంటుంది సౌందర్య. ఆనంద్ మోనిత బిడ్డే అంటుంది సౌందర్య. ఈ విషయం తన నోటి నుంచి తనే ఒప్పుకోవాలని ఈ దత్తత నాటకం ఆడాను అంటుంది సౌందర్య.
నాటకమా.. అంటుంది మోనిత. అవునే.. నాటకశిరోమణి. తెలివితేటలు నీకే ఉన్నాయా.. నీ బిడ్డ మా ఇంట్లోనే ఉన్నాడని తెలిసి కూడా కార్తీక్ ను ఇబ్బంది పెడుతూ.. దగ్గరవ్వాలని ప్లాన్లు వేస్తూ.. నీ బిడ్డను వెతికివ్వాలని కార్తీక్ కే చెబుతావా.. ఏంటి నాటకాలా. ఇంకా ఎన్నాళ్లు మా ఫ్యామిలీతో ఆడుకుంటావే. బాబును మేము ఎవ్వరికీ దత్తత ఇవ్వడం లేదు.. అంటుంది సౌందర్య.
నిన్ను ఇక్కడికి రప్పించాలనే కార్డులు ప్రింట్ చేయించి బస్తీ వాళ్లకు ఇచ్చి వచ్చాను. ఆ విషయం నీకు తెలుస్తుందని.. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. అందుకే దత్తత అని నీతో నాటకం ఆడాను. నువ్వు మాములు నటివి అయితే.. నేను మహానటినే అంటుంది సౌందర్య.
తెలివి తేటలు ఏ ఒక్కరి సొత్తు కాదు. భగవంతుడా నన్ను క్షమించు. నీ సన్నిధిలో ఈరకంగానైనా ఒక మంచి పని జరుగుతోంది.. అంటుంది సౌందర్య. మమ్మీ.. ఆనంద్ మోనిత కొడుకు ఏంటి మమ్మీ.. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ అంటాడు కార్తీక్.
దీంతో సారీరా పెద్దోడా.. ఈ విషయం నాకు లేట్ గా తెలిసింది. ఆనంద్ తన కొడుకు అని తెలిసినా.. చెప్పకుండా.. ఆ వంకతో నిన్ను కలవచ్చని మోనిత ప్లాన్ వేసింది. కొన్నాళ్లు నిన్ను తిప్పి తిప్పి ఆ తర్వాత నీకు దగ్గరయి.. బాబును అడ్డం పెట్టుకొని నిన్ను ఇరికించాలని తను లాభం పొందాలనిప ప్లాన్ వేసింది.. అంటుంది సౌందర్య.
తన బిడ్డ మన దగ్గరికి ఎలా వస్తాడు. నువ్వేదో పొరపాటు పడ్డట్టున్నావు అంటాడు కార్తీక్. దీంతో తాడికొండలో ఉండే కోటేశ్.. హైదరాబాద్ కు వచ్చి మోనిత బిడ్డను కారులో నుంచి ఎత్తుకొచ్చాడు అని చెబుతుంది సౌందర్య. దత్తత తీసుకున్నాను అని కోటేశ్ మనకు అబద్ధం చెప్పాడు అంటుంది దీప.
కోటేశ్.. బిడ్డను దొంగలించిన వీడియో నీకు చూపించొద్దని రత్నసీతకు ఈ మోనిత ఆదేశాలు జారీ చేసింది.. అంటుంది సౌందర్య. దీంతో కోటేశ్ బిడ్డను ఎత్తుకెళ్తే నేనేం చేస్తా. అయినా.. రత్నసీతకు వీడియో చూపించొద్దని నేనెందుకు చెప్తా ఆంటి అంటుంది మోనిత.
దీంతో రత్నసీతను పిలుస్తుంది సౌందర్య. దీంతో మోనితకు ఏం చేయాలో అర్థం కాదు. దీని కుట్ర బయటపెట్టాలనే పూజ అని అబద్ధం చెప్పి నిన్ను ఇలా బయటికి తీసుకొచ్చాను అంటుంది సౌందర్య. రత్నసీత.. ఆ వీడియో కార్తీక్ కు చూపించు అంటుంది సౌందర్య.
దీంతో తన ఫోన్ లో ఉన్న వీడియోను కార్తీక్ కు చూపిస్తుంది రత్నసీత. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఈ వీడియో మీరు అడిగితే లేదని చెప్పమంది సార్. కానీ.. అబద్ధం చెప్పలేక దీపక్క వస్తే ఈ వీడియో చూపించాను అంటుంది రత్నసీత.
అవును.. నేను నా బిడ్డను అడ్డం పెట్టుకొని ప్లాన్ చేశాను. అయితే ఏంటట అంటుంది మోనిత. దీంతో మోనిత దగ్గరికి వెళ్లిన సౌందర్య.. మోనిత చెంప చెళ్లుమనిపిస్తుంది. ఎందుకు పుట్టావే నువ్వు.. మా ఫ్యామిలీ వాళ్లకు నరకం చూపించడానికా అంటుంది సౌందర్య.
అసలు నువ్వేం మనిషివే. నువ్వేం ఆడదానివే. ఎన్నిసార్లు నిన్ను కొట్టినా.. తిట్టినా.. జైలుకు వెళ్లి వచ్చినా నీకు బుద్ధి రాలేదా.. అంటుంది సౌందర్య. ఇంత చేసి.. ఇన్ని నాటకాలు ఆడి పసివాడిని అడ్డం పెట్టుకొని ప్లాన్లు వేశావు. నిజం తెలిశాక కూడా అయితే ఏంటట అంటున్నావా చీ.. చీ.. అంటుంది సౌందర్య.
నీ బిడ్డను నీకు ఇచ్చేస్తే.. కార్తీక్ జోలికి రానన్నావట కదా. కార్తీక్ ను వదిలేసి వెళ్లిపోతా అన్నావట కదా.. అని చెప్పి ఆనంద్ ను తీసుకొని వెళ్లి తనకు ఇచ్చేస్తుంది సౌందర్య. నీ కొడుకును తీసుకెళ్లు అంటుంది సౌందర్య. మీరెవరూ ఏం మాట్లాడొద్దు. మధ్యలో అడ్డురాకండి అంటుంది సౌందర్య.
ప్రేమలను అడ్డుపెట్టుకొని గేమ్స్ ఆడటం దీనికి బాగా అలవాటు. మనం బాబును ఇవ్వమని.. ఇవ్వలేమని దీని ధైర్యం. మోనిత.. ఆఖరి సారిగా చెబుతున్నాను విను. నువ్వు అన్నట్టే.. నీ బిడ్డను నీకు ఇచ్చేశాను. ఇక జన్మలో మా ఫ్యామిలీ వైపు చూడకు. నీ బిడ్డ ఎప్పటికీ మా ఇంటి వారసుడు కాడు.. కాడు.. కాలేడు అంటుంది సౌందర్య.
నువ్వు ఎప్పటికీ మా ఇంటి కోడలుగా రాలేవు.. కాలేవు. నాకు ఇద్దరు కొడుకులు.. ఇద్దరు కోడళ్లు. ఒక మనవడు. ఇద్దరు మనవరాళ్లు. అంతే.. ఇదే నా ఫ్యామిలీ.. అంటుంది సౌందర్య. చూశారు కదా అందరూ.. దీనితో.. దీని కొడుకుతో మాకు ఇక ఎలాంటి సంబంధం లేదు.. అని బస్తీ వాసులకు చెబుతుంది సౌందర్య.
పిలవగానే అందరూ వచ్చినందుకు నమస్కారం అని చెప్పి.. పదండ్రా.. ఈరోజుతో మనకు పీడ పోయింది అంటుంది సౌందర్య. కానీ.. ఆనంద్ ను వదిలి రావడానికి కార్తీక్, దీపకు మనసు ఒప్పదు. కానీ.. ఆనంద్ ను చూస్తూ అక్కడి నుంచి బాధగా వెళ్లిపోతారు.
కట్ చేస్తే అందరూ ఇంటికి వస్తారు. బాధగా కూర్చుంటారు. అప్పుడే హిమ వస్తుంది. అమ్మా.. తమ్ముడెక్కడ కనిపించడం లేదు అంటుంది హిమ. అమ్మా.. మాట్లాడవేంటి అంటుంది హిమ. తమ్ముడికి పాలు తాగించాలి అంటుంది హిమ.
అందరూ ఇక్కడే ఉన్నారు. మరి తమ్ముడెక్కడ అంటుంది హిమ. డాడీ… తమ్ముడేడి అని అడుగుతుంది హిమ. నానమ్మ.. తమ్ముడేడి అని అడుగుతుంది హిమ. ఎవ్వరూ మాట్లాడటం లేదేంటి. చెప్పండి.. అని అడుగుతుంది హిమ. దీంతో సౌందర్య లేచి.. తమ్ముడిని వాళ్ల బంధువులు వచ్చి తీసుకెళ్లారమ్మా అంటుంది సౌందర్య.
దీంతో తన చేతుల్లో ఉన్న పాలడబ్బా, ఆట వస్తువులను కింద పడేస్తుంది హిమ. తీసుకెళ్లారా.. తీసుకెళ్లడమేంటి.. తమ్ముడికి బంధువులు ఎవ్వరూ లేరు కదా అంటుంది హిమ. అయినా.. మీరెలా ఇస్తారు అంటుంది హిమ. అమ్మ.. తమ్ముడిని ఎవరికి ఇచ్చారు. మనం వెళ్లి తెచ్చుకుందాం పదా అంటుంది హిమ.
డాడీ.. తమ్ముడిని తెచ్చుకుందాం పదండి.. అంటుంది హిమ. కానీ.. కార్తీక్ రాడు. శౌర్య.. నువ్వు మాట్లాడవు ఏంటి.. తమ్ముడు వెళ్లిపోతే నీకు బాధలేదా.. అంటుంది హిమ. నాకు తమ్ముడు కావాలి.. నాకు ఆనంద్ కావాలి అని వెక్కి వెక్కి ఏడుస్తుంది హిమ. ఆతర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.