Karthika Deepam 4 Nov Today Episode : శౌర్యను వెతుక్కుంటూ ఇంద్రుడు ఇంటికి వచ్చిన హిమ, ఆనంద రావు.. కార్తీక్, దీపను అక్కడ చూస్తారా?

Advertisement
Advertisement

Karthika Deepam 4 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 నవంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 1501 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్య అక్కడే ఉంది. ఖచ్చితంగా అక్కడే ఉంది. తన బిడ్డను చూపించమంటే ఎందుకు ఆవిడ టెన్షన్ పడింది. ఎందుకు భయపడింది అని దుర్గతో అంటుంది దీప. దీంతో శౌర్య అక్కడ లేకపోవచ్చు. ఏ తల్లి అయినా తన బిడ్డను నా బిడ్డలాగా ఉంది చూపించు అంటే ఎవ్వరూ చూపించరు దీపమ్మ. అసలు వాళ్ల దగ్గర ఉన్నది శౌర్యమ్మే అయితే మిమ్మల్ని తీసుకెళ్లడం ఇష్టం లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చి ఉండేవాళ్లే కదా. లేదంటే మీకు కనిపించకుండా ఊరు వదిలి పారిపోయేవాళ్లు అంటాడు దుర్గ. మన దృష్టి మొత్తం ఇప్పుడు మోనిత మీదనే ఉండాలి. మోనిత గురించి ఆలోచించు అంటాడు దుర్గ.

Advertisement

karthika deepam 4 november 2022 full episode

మరోవైపు కార్తీక్, మోనిత ఇద్దరూ కారు దిగుతారు. మోనిత మెకానిక్ ఏడి అని అడుగుతాడు. దీంతో మెకానిక్ వచ్చి రిపేర్ చేసి వెళ్లాడు అంటుంది మోనిత. దీంతో ఇప్పుడే కదా వచ్చింది. అప్పుడే రిపేర్ చేసి వెళ్లిపోయాడు అంటుంది మోనిత. దీంతో నీకు డౌట్ ఉంటే కారు స్టార్ట్ చేసి చూడు అంటుంది. దీంతో అవసరం లేదు అంటాడు కార్తీక్. అసలు.. నువ్వు ఆటోలో వెళ్లడానికే ఇదంతా చేశావా అని అడుగుతాడు. ఆ ఆటోడ్రైవర్ నీకు తెలియదా అని అడుగుతాడు. దీంతో కార్తీక్.. చీ ఎందుకు నన్ను ఇలా చంపుతున్నావు అని కారుకు తల కొట్టుకుంటూ ఉంటుంది. దీంతో ఇలా మారిపోయావు ఏంటి కార్తీక్. నేను తల కొట్టుకుంటున్నా కూడా ఆపవా అంటుంది మోనిత.

Advertisement

అసలు దీనంతటికీ కారణం ఆ దీపే. ఈరోజు దీని లెక్కేంటో తేల్చాలి అని అనుకుంటుంది మోనిత. డైరెక్ట్ గా దీప ఇంటికి వెళ్తుంది. నీ పీక పిసికేయాలన్నంత కోపం వస్తోంది అంటుంది మోనిత. అదృష్టం బాగుండి తప్పించుకున్నావు. అయినా సిగ్గు లేకుండా కార్తీక్ వెంట పడుతున్నావు అంటుంది మోనిత.

ఎప్పుడూ నా మాట వినే నా కార్తీక్.. ఇప్పుడు నన్నే అనుమానిస్తున్నాడు. ఏం మాయమాటలు చెప్పావు. ఏం మందు పెట్టావు అని అడుగుతుంది మోనిత. ఇవన్నీ అడగాల్సింది నేను. ఏంటే నీ బాధ. నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతోందా. అసలు నీ బతుకుకు ఏమైనా అర్థం ఉందా. నన్ను అనుమానించేలా చేసి డాక్టర్ బాబు చుట్టూ కుక్కలా చేరావు అంటుంది దీప.

Karthika Deepam 4 Nov Today Episode : మరోసారి కార్తీక్ కోసం కొట్టుకున్న మోనిత, దీప

కార్తీక్ నా వాడు. నా సొంతం అంటుంది మోనిత. దీంతో నీ సొంతం అయినప్పుడు నోర్మూసుకొని ఉండొచ్చు కదా. ఎందుకు వాగుతున్నావు అని అడుగుతుంది దీప. ఎందుకంటే డాక్టర్ బాబు నా సొంతం. అందుకే నువ్వు ఆయన కోసం పిచ్చిదానిలా తిరుగుతున్నావు అంటుంది దీప.

డాక్టర్ బాబు బిడ్డకు తల్లి కావాలని అడ్డదారిలో పిల్లలను కన్నావు. నీ అడ్డు తొలగించడం నాకు ఐదు నిమిషాల పని.. అంటుంది దీప. దీంతో నీకు అంత సీన్ లేదు. నువ్వు నన్ను ఏం చేయలేవు అంటుంది మోనిత.

దుర్గ రెడీగా ఉన్నాడు. మళ్లీ డాక్టర్ బాబు వైపు చూడకుండా తరిమి తరిమి కొడతాడు. నాకు నీ అడ్డు తొలగించుకోవాలనే ఉంది కానీ.. ఎందుకు ఆగుతున్నానో తెలుసా. నువ్వు ఎలాంటి దానివైనా నా భర్తను కాపాడి నాకు దక్కేలా చేశావు అంటుంది దీప.

కార్తీక్ ను నా సొంతం చేసుకోవడం తప్ప నాకు ఇంకో ఆలోచనే ఉండదు. ఏం జరిగినా పట్టు వదిలేదే లేదు అంటుంది మోనిత. మరోవైపు చంద్రమ్మ.. దీప గురించి టెన్షన్ పడుతుంది. పొద్దున్నే ఆమె వచ్చింది. గండ రాగానే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ మాత్రం ఉండకూడదు అని అనుకుంటుంది చంద్రమ్మ.

ఇంతలో ఇంద్రుడు వస్తాడు. జ్వాల ఎక్కడుంది అని అడుగుతాడు. జ్వాలమ్మను వాళ్ల నాన్న చూశాడు. ఆటో ఆపడానికి ప్రయత్నించాడు కానీ.. నేను వేగంగా వచ్చేశా అంటాడు. ఇప్పుడు ఇల్లు కూడా తెలిసిపోయింది కదా వాళ్లు వస్తారు.

ఏదో ఒకటి చేయాలి చంద్రమ్మ అంటాడు. దీంతో ఊరు వదిలి వెళ్లిపోవడమే దీనికి పరిష్కారం అంటుంది చంద్రమ్మ. దీంతో దానికి జ్వాలమ్మ ఒప్పుకోదు అంటాడు ఇంద్రుడు. దీంతో ఎలాగైనా ఒప్పించాలి అంటాడు ఇంద్రుడు.

ఇంతలో అక్కడికి ఆనందరావు, హిమ కారు వేసుకొని వస్తారు. వాళ్లను చూసి షాక్ అవుతారు ఇంద్రుడు, చంద్రమ్మ.

మరోవైపు దీప వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. దుర్గ వచ్చి ఏమైంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. కార్తీక్ సార్ గురించి ఏడుస్తున్నవా? వద్దు అంటాడు. ఇంతలో కార్తీక్ వస్తాడు. దీపమ్మకు అనుమానం వచ్చి వాళ్లింటికి వెళ్లింది అని కార్తీక్ కు చెబుతాడు దుర్గ.

ఈ టైమ్ లో వెళ్లడం కరెక్ట్ కాదు. నేను, వంటలక్క కలిసి రేపు వెళ్లి మాట్లాడుతాం అంటాడు కార్తీక్. మనిద్దరం కలిసి వెళ్దాం. మీరు వెళ్లండి దుర్గ గారు అంటాడు కార్తీక్. వంటేం చేశావు అని అడుగుతాడు కార్తీక్.

దీంతో భోం చేస్తారా అని వంట చేస్తుంటుంది దీప. మరోవైపు కార్తీక్ ఏంటి ఇంతలా మారిపోయాడు అని అనుకుంటుంది మోనిత. గతం ఏమన్నా గుర్తొచ్చిందా అని అనుకుంటుంది మోనిత.

మరోవైపు మనింటికి వెళ్దాం రా అని అడుగుతాడు ఆనంద రావు. దీంతో రానని చెప్పా కదా తాతయ్య. మళ్లీ మళ్లీ ఎందుకు అడుగుతున్నారు అంటుంది శౌర్య. అమ్మనాన్నలు కనిపించేంత వరకు నేను ఇక్కడే ఉంటా. నేను రాను అంటుంది శౌర్య.

అమ్మానాన్నలను వెతకడానికి వాళ్లు తప్పిపోలేదు. వాళ్లు ఒకవేళ వస్తే మన ఇంటికే వస్తారు రా అని అంటాడు. కానీ.. శౌర్య వినదు. మీకు ఈ ఇల్లు ఎలా తెలిసింది అని అడుగుతుంది శౌర్య. నువ్వు ఎక్కడున్నావో.. ఏం చేస్తున్నావో ప్రతి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం అంటాడు ఆనంద రావు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Maha Shivratri : మహా శివరాత్రి పర్వదినం రోజున భక్తులు తప్పక పాటించాల్సిన విషయాలు

Maha Shivratri : ఫిబ్రవరి 15, 2026న రానున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, శివాలయ సందర్శనలో భక్తులు పాటించాల్సిన…

3 minutes ago

T20 World Cup 2026: కివీస్ కోట బద్దలు.. న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…

7 hours ago

Telangana : తెలంగాణా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారం ఎవరిది..?

Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…

9 hours ago

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

10 hours ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

11 hours ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

13 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

13 hours ago