
karthika deepam 5 may 2022 full episode
Karthika Deepam 5 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 మే 2022, గురువారం ఎపిసోడ్ 1344 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమ.. స్వప్నకు ట్రీట్ మెంట్ చేస్తుంది. అత్తయ్య మీరు నన్ను కోపంగా చూస్తున్నారు. దాని వల్ల.. మీ గుండె వేగం, పల్స్ రేట్ పెరుగుతోంది అంటుంది. నన్ను ఒక డాక్టర్ గా చూడండి అంటుంది. దీంతో నువ్వు ఒక డాక్టర్ వా. ఇంజెక్షన్ చేయడానికే భయపడతావు అంటుంది స్వప్న. ఇప్పుడు ఉన్న హిమ.. మునుపటి హిమ కాదు. దీనిలో చాలా మార్పు వచ్చింది. ఈ మార్పుకు కారణం ఎవరో తెలుసా? ఆ ఆటో అమ్మాయే అంటుంది సౌందర్య. దీంతో ఈ ఇద్దరూ నాకే తగిలారు. అసలు.. నేను దీనితో ట్రీట్ మెంట్ చేయించుకోవడం ఏంటి అని అనుకుంటుంది స్వప్న. మరోవైపు హిమ నువ్వు చెక్ చేయి అని హిమతో చెబుతుంది సౌందర్య.
karthika deepam 5 may 2022 full episode
దీంతో స్వప్నకు చెక్ చేస్తుంది హిమ. ట్యాబ్లెట్స్ రాసి ఇస్తుంది. బీపీ చాలా ఎక్కువగా ఉంది. ఆలోచనలు తగ్గించుకోవాలి. అనవసరంగా టెన్షన్ పడకూడదు అంటుంది హిమ. దీంతో టెన్షన్ పెట్టేవాళ్లు మొత్తం నా చుట్టూ ఉంటే.. నేను టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను అంటుంది స్వప్న. మరోవైపు నిరుపమ్.. తనకు ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది జ్వాల. నిరుపమ్.. హిమను ప్రేమిస్తున్నాననే విషయం జ్వాలకు ఎలా చెప్పాలో అర్థం కాదు. డాక్టర్ సాబ్.. నేను ఐలవ్యూ అని చెప్పడానికి ఎంత టెన్షన్ పడుతున్నానో.. అంతే టెన్షన్ మీలోనూ ఉంటుంది అని అనుకుంటుంది జ్వాల. ఈ మాట ఫోన్ లోనే చెబుదామనుకున్నాను కానీ.. డైరెక్టర్ గానే చెబితే బాగుంటుంది అనిపించింది అంటాడు నిరుపమ్. కానీ.. కొంత ఇబ్బంది ఉంటుంది లేండి అంటుంది జ్వాల. దీంతో నువ్వు ఎదుటివారి మనసును ఈజీగా అర్థం చేసుకుంటావు. ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతావు. అందుకే నేను నిన్నే ఎంచుకున్నాను అంటాడు నిరుపమ్.
డాక్టర్ సాబ్ నాకు టెన్షన్ గా ఉంది. చెప్పేయండి.. ఐలవ్యూ అని చెప్పేయండి అని అనుకుంటుంది. జ్వాల.. ఒక డాక్టర్ అయి ఉండి నేను ఇలా చెప్పడం కరెక్ట్ కాదేమో కానీ.. నీకు తప్ప ఇంకెవరికీ చెప్పలేను కూడా అంటాడు నిరుపమ్. ఇంతలో టీ వస్తుంది.
తీరా చెప్పాక.. నువ్వేం ఫీల్ అవ్వొద్దు అంటాడు నిరుపమ్. దీంతో నేనేమనుకుంటాను డాక్టర్ సాబ్. మీరు పెద్ద డాక్టర్ సాబ్. నేను ఆటో నడుపుకుంటాను. మీరు ఇలా నాతో మాట్లాడటమే గొప్ప నాకు అంటుంది జ్వాల. ఇంతలో కప్పులో టీ పోసి ఇచ్చి ఇలా షేర్ చేసుకొని తాగితే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా జ్వాల అంటాడు నిరుపమ్.
దీంతో అవును అంటుంది జ్వాల. నిజానికి నేనే ముందుగా మీకు ఒకటి చెప్పాలని అనుకున్నాను డాక్టర్ సాబ్ అంటుంది జ్వాల. దీంతో అవునా అంటాడు నిరుపమ్. ఫస్ట్ టైమ్ నాకు కొంచెం భయం, ఇంకేదో సిగ్గు అనిపించాయి అంటుంది.
ఇంతలో మీరు ఇక్కడ కలుద్దాం అన్నారు. మీరు చెప్పండి డాక్టర్ సాబ్ అంటుంది. దీంతో అయ్యో జ్వాల ముందు నువ్వే చెప్పు అంటాడు నిరుపమ్. నువ్వంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం అంటాడు. నేను ముందుగా చెప్పేస్తే అయిపోతుంది కదా అనుకుంటుంది జ్వాల.
అయినా.. ముందుగా నేనే ఐలవ్యూ చెప్పినట్టు జీవితాంతం గుర్తుంటుంది అనుకొని నిరుపమ్ కు ఐలవ్యూ చెప్పబోతుండగా.. అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి.. తన కప్పులోని టీ తాగుతాడు. దీంతో జ్వాల షాక్ అవుతుంది. హాయ్.. చాయ్ బాగుంది అంటాడు ప్రేమ్.
మీరేంటి ఇక్కడ అంటాడు. నువ్వేంట్రా బాబు. సరిగ్గా టైమ్ కు వచ్చావు అని అనుకుంటుంది జ్వాల. మేమేదో సడెన్ గా కలిశాం. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు నిరుపమ్. ఇది జ్వాల కోసం చెప్పిన టీ. ఇంకోటి తెచ్చుకొని తాగొచ్చు కదా అంటాడు నిరుపమ్.
దీంతో పక్కనోడి టీ లాక్కొని తాగితేనే కదా కిక్కు అంటాడు ప్రేమ్. వీడేంటి.. సరిగ్గా హిమ విషయం జ్వాలకు చెబుదామని అనుకునేలోపే వచ్చాడు అని అనుకుంటాడు నిరుపమ్. ఇంతలో మీకు ఫోన్లు చాలా వచ్చాయి అని వెయిటర్ చెబుతాడు. దీంతో అవునా అని చెప్పి జ్వాల బై అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్.
ఏయ్ తిక్క.. నేనూ వెళ్తున్నా బై.. బిల్ పే చేసేయ్ అని చెప్పి అక్కడి నుంచి ప్రేమ్ కూడా వెళ్లిపోతాడు. దీంతో జ్వాలకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు స్వప్నకు ఇంకా ట్రీట్ మెంట్ చేస్తూనే ఉంటుంది హిమ. అత్తయ్య స్థిమితపడండి. మీరు ఇంకా ఆవేశంలో ఉన్నట్టున్నారు. నన్ను చూసి కోపం తెచ్చుకుంటున్నారో లేక ఇంకెవరిని చూశో కానీ.. మీ బీపీ ఇంకా తగ్గలేదు అంటుంది హిమ.
ఇంతలో నిరుపమ్ వస్తాడు. హిమ, నేను ఇద్దరం డాక్టర్లం ఉన్నాక నీకు ఏమౌతుంది చెప్పు. అవసరం లేని ఆలోచనలు అన్నీ బుర్రలో నుంచి తీసేయాలి. ప్రశాంతంగా ఉండాలి. టైమ్ కు సరిపోయేంత నిద్రపోవాలి కదా అంటాడు నిరుపమ్. దీంతో అవునురా మనవడా. మీరిద్దరూ డాక్టర్లు. ఇద్దరూ ఒకేచోట.. ఒకే ఇంట్లో ఉంటే.. మీ అమ్మ బీపీని కంట్రోల్ చేయొచ్చు అంటుంది సౌందర్య.
దీంతో హిమ, నిరుపమ్ ఇద్దరి పెళ్లి అయినట్టు ఊహించుకుంటుంది స్వప్న. ఒరేయ్.. దాని కళ్లు తెరిపించరా.. దాని ఆరోగ్యం పాడు చేసుకుంటోంది. నువ్వు చెబితేనైనా వింటుందేమో. స్వప్న.. కాస్త జాగ్రత్తగా ఉండవే. వాడు చెప్పేది అయినా వినవే. హిమ వెళ్దాం పదా అని అంటుంది. దీంతో ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
మరోవైపు హిమకు ప్రేమ్ ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రావాలి అంటాడు. జ్వాల బిర్యానీ తీసుకొచ్చింది. రా కలిసి తిందాం అంటాడు. దీంతో హిమ ఫుల్ ఖుషీ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.