Karthika Deepam 6 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 డిసెంబర్ 2021, సోమవారం 1215 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ చేసి పేషెంట్ ను చంపేసిన తర్వాత కార్తీక్ చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు. ఇంతలో డాడీ అంటూ పిల్లలు తన దగ్గరికి వెళ్తారు. ఎందుకు లేట్ అయింది అని సౌందర్య అడుగుతుంది. కానీ.. కార్తీక్ ఏం మాట్లాడడు. పిల్లలను దగ్గర తీసుకుంటాడు. కార్తీక్ కు అన్నీ పేషెంట్ భార్య మాట్లాడిన మాటలే గుర్తుకు వస్తుంటాయి. మీకేం కాదమ్మా.. నిండు నూరేళ్లు జీవిస్తారు అని మనసులో అనుకుంటాడు. కార్తీక్ కు ఏమైంది.. డల్ గా కనిపిస్తున్నాడు. మళ్లీ మోనిత ఏమైనా గొడవ పెట్టిందా అని అనుకుంటుంది సౌందర్య. దీంతో పిల్లలను ఐస్ క్రీమ్ కోసం తీసుకెళ్లమని సౌందర్య చెబుతుంది. దీంతో ఆదిత్య వాళ్లను ఐస్ క్రీమ్ తినిపించేందుకు వెళ్తాడు.
తర్వాత కార్తీక్ ఏమైంది. ఏదోలా కనిపిస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు మమ్మీ అంటాడు. సైట్ చూడటానికి దీప బస్తీకి వెళ్లింది నీకు ఏమైనా ఫోన్ చేసిందా అని అడుగుతుంది సౌందర్య. లేదు మమ్మీ అంటాడు కార్తీక్. ఏమైందిరా మళ్లీ అంటాడు ఆనంద రావు. మోనిత వచ్చి ఏమైనా గొడవ చేసిందా అని అడుగుతాడు. అలాంటిదేం లేదు డాడీ అంటాడు. కానీ.. వాళ్లు తెగ టెన్షన్ పడుతుంటారు. మరోవైపు ప్రియమణి.. అంటూ సంతోషంతో అరుస్తుంది మోనిత. మళ్లీ ఏమైందమ్మా అని అడుగుతుంది ప్రియమణి. అయిపోయింది ప్రియమణి.. అయిపోయింది. కార్తీక్ పని అవుట్.. అంటుంది. నీ కార్తీకయ్య డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అయింది. నీ కార్తీకయ్య ఇక డాక్టర్ కాడు. డాక్టర్ కార్తీక్ ఇప్పుడు ఉత్త కార్తీక్ అయ్యాడు. డాక్టర్ గిరీ ఊడిపోయింది. ఊడిపోయేలా చేశాను నేను. ఆ దీప నన్ను ఎలా బెదిరించింది. ఇప్పుడు ఏమైంది. ఇప్పుడు ఏం చేస్తుందో ఆ దీప.. అంటుంది మోనిత. డాక్టర్ బాబులో నుంచి డాక్టర్ ను విడగొట్టేశా అంటుంది మోనిత.
కట్ చేస్తే కార్తీక్ తన బెడ్ రూమ్ లోకి వస్తాడు. ఏడుస్తూ బెడ్ మీద కూర్చుంటాడు. తన పిల్లలకు ఏమౌతుందో అని తెగ టెన్షన్ పడుతుంటాడు. ఆ పేషెంట్ భార్య అన్నట్టుగా నా పిల్లలకు ఏదైనా అవుతుందా అని భయపడిపోతుంటాడు కార్తీక్. నా పిల్లలు చేసిన తప్పేంటి. తప్పు చేసింది నేను అయితే అంటాడు కార్తీక్.
తప్పు చేసింది నేను.. నన్ను శిక్షించాలి. నన్ను శపించండి. నా పిల్లలేం చేశారు.. అని వాళ్లు వేసిన డ్రాయింగ్ పేపర్స్ ను పట్టుకొని ఏడుస్తాడు. ఏమైంది నాకు. ఈ చేతులతో ఎన్నో సర్జరీలు చేశాను కదా. ఈరోజు నాకు ఏమైంది. నా బాడీలో మార్పులు ఎందుకు వచ్చాయి. నా చేతులు ఎందుకు వణికాయి. నాకేమైంది. . అని అనుకుంటాడు కార్తీక్.
ఇది వందశాతం నీ తప్పే కార్తీక్. ఒక నిండు ప్రాణం పోయింది. అసలు నీకు ఏమైంది కార్తీక్.. తప్పంతా నీదే కార్తీక్.. అంటాడు రవి. జరిగిన దానికి నేను బాధ్యత వహిస్తాను.. అంటాడు కార్తీక్. నీ డాక్టర్ లైసెన్స్ రద్దు అవుతుంది కార్తీక్ అంటాడు రవి. నువ్వు ఇంకెక్కడా ప్రాక్టీస్ చేయడానికి ఉండదు అని చెబుతాడు రవి. దీంతో కౌన్సిల్ తీసుకునే ఏ నిర్ణయానికైనా నేను తలవంచుతాను అని చెబుతాడు కార్తీక్.
ఆ తర్వాతే ఇంటికి వస్తాడు కార్తీక్. ఇప్పుడు నేను డాక్టర్ కార్తీక్ ను కాదా అని అనుకుంటాడు కార్తీక్. నేను డాక్టర్ గా అనర్హుడినా అని అనుకుంటాడు కార్తీక్. రూమ్ లో ఏడుస్తున్న కార్తీక్ దగ్గరికి వచ్చిన సౌందర్య, ఆనంద రావు.. కార్తీక్ ను చూసి షాక్ అవుతారు. ఏమైందిరా నీకు అని అడుగుతారు.
దీంతో అన్నీ చెబుతాడు కార్తీక్. దీంతో సౌందర్య, ఆనంద రావు షాక్ అవుతారు. వాళ్లకు ఒక విషయం చెప్పి.. దీప ఇంటికొచ్చే లోగా ఇవన్నీ జరిగిపోవాలి మమ్మీ అని అంటాడు కార్తీక్. మరోవైపు చనిపోయిన పేషెంట్ ఇంటికి కార్తీక్, సౌందర్య ఇద్దరూ వస్తారు.
వాళ్లను చూసి పేషెంట్ భార్య షాక్ అవుతుంది. ఎందుకొచ్చావయ్యా.. ప్రాణం పూర్తిగా పోయిందో లేదో చూడటానికి వచ్చావా.. అని అడుగుతుంది. ఇంకా ఏం చేద్దాం అని వచ్చావు అని అడుగుతుంది. మేము ఎట్లా బతకాలి అని అడుగుతుంది. నీకు ఏం అన్యాయం చేశాం అని ప్రశ్నిస్తుంది.
నా ఏడుపు మీకు తగులుతుంది. నా ఉసురు మీకు తగులుతుంది అని అంటుంది. దీంతో అమ్మ.. మీకు అన్యాయం జరిగింది. నేను కాదనను. పోయిన మీ ఆయనను నేను తెచ్చి ఇవ్వలేను. జరిగిన నష్టాన్ని ఏం చేసినా తీర్చలేనమ్మా. పోయిన మనిషి ప్రాణం తీసుకురాలేనమ్మా. కానీ.. ఒక్క పని చేయగలను అమ్మా.. అని ఒక కవర్ ను తీసుకొని తనకు ఇస్తాడు కార్తీక్. అందులో ఏముంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.