Karthika Deepam 6 July Today Episode : జ్వాలకు అసలు నిజం తెలిసి షాక్.. జ్వాలే శౌర్య అని తెలిసి నిరుపమ్ తనను ప్రేమించడం స్టార్ట్ చేస్తాడా? ఇంతలో ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 6 July Today Episode : జ్వాలకు అసలు నిజం తెలిసి షాక్.. జ్వాలే శౌర్య అని తెలిసి నిరుపమ్ తనను ప్రేమించడం స్టార్ట్ చేస్తాడా? ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

 Authored By gatla | The Telugu News | Updated on :6 July 2022,10:30 am

Karthika Deepam 6 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 జులై 2022, బుధవారం ఎపిసోడ్ 1397 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అమ్మానాన్నలను పొట్టన పెట్టుకున్నావు. నా జీవితంలో కలలను, ఆశలను కూల్చేశావు. ఆహా.. ఆది దంపతులు.. ఓహో.. ఆదర్శ దంపతులు.. గొప్ప వాళ్లండి మీరు. సౌందర్య గారు.. ఆనంద రావు గారు.. మీరు మహానటులు. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటించారు అని అంటుంది జ్వాల. శౌర్య.. నన్ను క్షమించు అంటుంది హిమ. దీంతో హిమ చెంప మళ్లీ చెళ్లుమనిపిస్తుంది జ్వాల. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అవతారు. తనకు ఇచ్చే ట్రోఫీని కూడా కిందపడేస్తుంది జ్వాల. కట్ చేస్తే ఇదంతా కల. హిమ ఇదంతా కల కంటుంది. కానీ.. ఇంతలోనే హిమ గారు.. జ్వాల గారికి మొమెంటో అందజేయండి అంటారు నిర్వాహకులు. దీంతో జ్వాల షాక్ అవుతుంది. అంటే తను హిమ అని అనుకుంటుంది జ్వాల.

karthika deepam 6 july 2022 full episode

karthika deepam 6 july 2022 full episode

ఇంతలో స్టేజ్ మీదికి వస్తుంటుంది హిమ. తనను చూసి జ్వాలకు గతం అంతా గుర్తొస్తుంటుంది. తనే హిమా అని షాక్ అవుతుంది. కానీ.. ఏం మాట్లాడదు. సైలెంట్ గా ఉంటుంది జ్వాల. తర్వాత హిమ.. తనను సత్కరిస్తుంది. ట్రోఫీ అందిస్తుంది. కానీ..జ్వాలకు మాత్రం చాలా కోపం వస్తుంటుంది. కంట్రోల్ చేసుకుంటుంది. భయంతోనే హిమ.. తనకు ట్రోఫీని అందిస్తుంది. నమస్తే డాక్టర్ హిమ గారు అంటుంది జ్వాల. నాకు కంగ్రాట్స్ చెప్పరా డాక్టర్ హిమ గారు అంటుంది జ్వాల. ఇద్దరి చేతుల మీద ఉన్న హెచ్, ఎస్ అనే అక్షరాలను చూసుకుంటారు. మహా నటి అంటుంది జ్వాల. నేనొక రెండు మాటలు మాట్లాడొచ్చా అంటుంది జ్వాల. దీంతో సరే మేడమ్ మాట్లాడండి అంటారు నిర్వాహకులు.

ఇంతలో హిమ వెళ్లిపోతుండగా డాక్టర్ హిమ గారు మీరు ఉండండి ప్లీజ్. మీరు ఎక్కడికి వెళ్తారండి అంటుంది జ్వాల. అందరికీ నమస్కారం. నాకు అవార్డు ఇచ్చిన మీకు నమస్కారం. మీకైతే పెద్ద నమస్కారం అని సౌందర్య, ఆనంద రావును చూస్తూ అంటుంది జ్వాల.

డాక్టర్ హిమ గారు మీరు ఎందరి ప్రాణాలో కాపాడి ఉంటారు కదా అంటుంది జ్వాల. మీకు మహానమస్కారాలు. వేల వేల నమస్కారాలు అంటుంది జ్వాల. నన్నేదో ధైర్యవంతురాలు అంటూ పొగుడుతూ ఈ అవార్డు ఇచ్చారు. అంతకన్నా నాకు ఇంకేం కావాలి.

Karthika Deepam 6 July Today Episode : హిమ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న జ్వాల

గొప్ప డాక్టర్. గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చిన డాక్టర్ హిమ గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడంతో నా జన్మ ధన్యం అయింది. డాక్టర్ హిమ గారు.. మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు నా మనసు పొంగిపోతోంది. మిమ్మల్ని మీరిచ్చిన గొప్ప అవార్డును జీవితంలో మరిచిపోలేను అంటుంది జ్వాల.

ఆటో నడిపే నాకు.. అవార్డు ఇవ్వడమే గొప్ప అనుకుంటే ఇంత గొప్పవాళ్ల చేతుల మీదుగా అందుకోవడం ఎంతో గొప్ప కదా. నాకు.. ఆనందంతో కళ్లల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి అంటుంది జ్వాల. సౌందర్య మేడమ్.. నమస్తే మేడమ్ అంటుంది జ్వాల. ఆనంద రావు సార్ నమస్తే సార్ అంటుంది జ్వాల.

ఇదంతా మీ ఆధ్వర్యంలోనే జరిగింది కదా అంటుంది జ్వాల. అవార్డ్స్ కార్యక్రమం గురించి సార్ నేను చెప్పేది అంటుంది జ్వాల. మీ ఫ్యామిలీ గ్రేట్ సార్ అంటుంది జ్వాల. గొప్పోళ్లు సార్ మీరు. అందరూ అందరూ గొప్పోళ్లు అంటుంది జ్వాల. మంచి అవార్డు ఇచ్చారు అంటుంది జ్వాల.

ఆ తర్వాత జ్వాలకు అవార్డు ఇచ్చే ప్రోగ్రామ్ టీవీలో వస్తుంటే చూస్తుంటాడు నిరుపమ్. జ్వాలకు అవార్డు ఇచ్చారు అని స్వప్నతో అంటాడు. దీంతో టీవీని ఆఫ్ చేస్తుంది స్వప్న. ఆ మనవరాలే కాదు.. ఈ పెద్దవాళ్లు ఇద్దరు కూడా ఆ ఆటోదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఏం మనుషులో ఏంటో.. అని అంటుంది స్వప్న.

దీంతో జ్వాల గురించే ఆలోచిస్తూ ఉంటాడు నిరుపమ్. తర్వాత ఇంటికి వెళ్లి.. ఆటో మీద రాసిన వదిలేదేలే అనే బోర్డును విరగ్గొట్టేస్తుంది జ్వాల. తనకు పిచ్చి లేస్తుంది. ఇంత మోసమా అని అనుకుంటుంది. అంతా మనవాళ్లే అయినా మోసం చేశారు అందరు అంటుంది జ్వాల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది