Karthika Deepam 6 June Today Episode : ఇంద్రుడు, చంద్రమ్మను టార్గెట్ చేసిన శోభ.. వాళ్లను సేవ్ చేసిన హిమ.. ఇంతలో జ్వాల షాకింగ్ నిర్ణయం

Advertisement
Published by
Advertisement

Karthika Deepam 6 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 జూన్ 2022, 1371 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మరోవైపు నిరుపమ్, హిమ ఇద్దరూ శోభ ఇంటికి వస్తారు. హాయ్ డాక్టర్ హిమ.. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అంటుంది శోభ. అందరూ వస్తుంటారు కానీ.. ఎక్కడా కనిపించడం లేదు ఏంటి అని అంటుంది శోభ. దీంతో ఎవరు శోభ అని అడుగుతాడు నిరుపమ్. దీంతో ఇంకెవరు నీ ఫ్రెండ్. ఆ ఆటో అమ్మాయి జ్వాల అంటుంది శోభ. తనతో నీకేం పని అంటాడు నిరుపమ్. దీంతో మీరు మీరు ఫ్రెండ్స్ కదా. ఎక్కడికెళ్లినా మీరిద్దరే కలుస్తుంటారు కదా. అందుకే.. తనను కూడా ఈ పార్టీకి పిలిచాను అంటుంది శోభ. తను డాక్టర్ కాదు కదా. ఈ ఫంక్షన్ కు తననెందుకు పిలిచావు అంటాడు నిరుపమ్. దీంతో తను డాక్టర్ కాకపోయినా మీరిద్దరూ ఫ్రెండ్స్ కదా.. అంటుంది శోభ. దీంతో తను రాకపోవచ్చు అంటాడు నిరుపమ్. ఏం కాదు ఒకసారి తనకు కాల్ చేయ్ అంటుంది శోభ.

Advertisement

దీంతో తనకు ఫోన్ చేస్తాడు నిరుపమ్. మీరు వస్తున్నారంటే.. నేను కూడా వస్తున్నాను అంటుంది జ్వాల. దీంతో గుడ్ గుడ్ వచ్చేయ్ అంటాడు నిరుపమ్. నిరుపమ్ ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది శోభ. మరోవైపు హిమకు భయంగా ఉంటుంది. ఏదో అవుతుందని టెన్షన్ పడుతుంది. ఉన్నట్టుండి శోభ సడెన్ గా పార్టీ అరెంజ్ చేసింది. అవసరానికి మించి ఉత్సాహంగా కనిపిస్తోంది. పైగా జ్వాల గురించి అడుగుతోంది. ఏదైనా జరగరానిది జరగబోతోందా. లేక నానమ్మ మీద పగ తీర్చుకోవడానికి ఈ ఫంక్షన్ లో ఏదైనా చేస్తుందా అని అనుకుంటుంది హిమ. ఇంతలో ఫంక్షన్ కు స్వప్న వస్తుంది. నిరుపమ్, హిమ ఇద్దరిని చూసి షాక్ అవుతుంది స్వప్న. స్వప్నను చూసి తన దగ్గరికి వస్తుంది శోభ. నేను ఫుల్ మూన్ హాస్పిటల్ పెట్టిన సందర్భంలో ఇస్తున్న పార్టీకి పిలవగానే వచ్చిన అందరికీ థాంక్స్ అంటుంది శోభ.

Advertisement

ఈ పార్టీకి ముఖ్య అతిథి.. నాకు చాలా ఆప్తులు మా స్వప్న ఆంటి గారు అంటుంది శోభ. ఇంతలో అక్కడికి డ్రింక్స్ పట్టుకొని ఇంద్రుడు, చంద్రమ్మ వస్తారు. అందరికీ అందిస్తుంటారు. వాళ్లను అక్కడ చూసి హిమ షాక్ అవుతుంది. డాక్టరమ్మ మీరేంటి ఇక్కడ అని అంటారు ఇంద్రుడు, చంద్రమ్మ.

దీంతో మీరేంటి ఇక్కడ అని నేనే మిమ్మల్ని అడగాలి అంటుంది హిమ. శాంతాబాయి చెబితే ఈ ఫంక్షన్ కు వచ్చాం అంటారు. మరోవైపు స్వప్నను చూసి షాక్ అవుతారు వీళ్లు. ఏంటి గండా.. ఆవిడ ఇక్కడుంది అంటుంది చంద్రమ్మ. దీంతో ఆవిడ ఎక్కడుంటే మనకేంటి.. అంటాడు ఇంద్రుడు.

Karthika Deepam 6 June Today Episode : శోభ పార్టీకి వచ్చిన జ్వాల

మరోవైపు హిమ టెన్షన్ పడటం చూసి.. ఏమైంది ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అంటాడు నిరుపమ్. దీంతో ఏం లేదు బావ అంటుంది హిమ. మరోవైపు స్వప్న.. ఇంద్రుడు, చంద్రమ్మలను చూస్తుంది. వాళ్లేంటి ఇక్కడ అంటుంది స్వప్న.

వాళ్ల సంగతి నీకు తెలియదు అంటుంది స్వప్న. దీంతో వాళ్ల గురుంచి మీరు వదిలేయండి.. పార్టీని ఎంజాయ్ చేయండి అంటుంది. ఇంతలో జ్వాల అక్కడికి వస్తుంది. అదిగో జ్వాల కూడా వచ్చింది అంటుంది శోభ. దాన్నెందుకు పిలిచావు.. అని అడుగుతుంది స్వప్న.

దీంతో చూస్తూ ఉండండి.. ఆంటి. ఈ శోభ అంటే ఏంటో కాసేపట్లో తెలుస్తుంది అంటుంది శోభ. ఇంతలో బాబాయి, పిన్నిని చూస్తుంది జ్వాల. మీరేంటి ఇక్కడ. మీరేం చేస్తున్నారు ఇక్కడ అంటుంది. దీంతో మీకు చెప్పాం కదా అమ్మా.. క్యాటరింగ్ కు పిలిచారని అంటాడు ఇంద్రుడు.

సరే.. ఇక్కడ కానీ.. మీ చేతివాటం చూపించారో మర్యాదగా ఉండదు అంటుంది జ్వాల. జాగ్రత్త అంటుంది. తర్వాత డాక్టర్ సాబ్ దగ్గరికి వెళ్తుంది జ్వాల. హలో తింగరి అంటుంది. నిన్నెందుకో శోభ చాలా గుర్తు చేసింది. మీ ఇద్దరి మధ్య అసలు ఏముంది అని అడుగుతాడు నిరుపమ్.

దీంతో ఊరుకోండి డాక్టర్ సాబ్.. నాకు ఉన్నది మీరిద్దరే అంటుంది జ్వాల. ఆ తర్వాత హాయ్ జ్వాల వెల్ కమ్ అంటుంది శోభ. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో అంటుంది శోభ. జ్వాల.. తీసుకో అని కూల్ డ్రింక్ ఇస్తుంది శోభ. ఏంటి అలా చూస్తున్నావు. దీంట్లో ఏమీ కలపలేదలే తీసుకో అంటుంది శోభ.

ఇంతలో కరెంట్ పోతుంది. కరెంట్ రాగానే.. నా మెడలో చైన్ పోయింది అని యాక్షన్ చేస్తుంది శోభ. దీంతో ఇంద్రుడు, చంద్రమ్మ టెన్షన్ పడతారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు నిరుపమ్. వాళ్లు వస్తారు. వర్కర్స్ మీద అనుమానం ఉందని చెబుతుంది శోభ.

చాలా సందర్భాల్లో ఇలాంటి వన్నీ కొత్తగా పనిలో చేరిన వాళ్లే చేసే అవకాశం ఉంది అంటారు పోలీసులు. ముందుగా ఈ వర్కర్స్ ను చెక్ చేస్తా. తర్వాత గెస్టులను కూడా చెక్ చేస్తా. కోఆపరేట్ చేయండి అంటాడు ఎస్ఐ. తర్వాత ఒక్కొక్కరిని చెక్ చేస్తూ ఉంటాడు పోలీస్.

ఇంద్రుడిని చెక్ చేస్తుండగా అతడి జేబులో శోభ చైన్ ఉంటుంది. దాన్ని తీసుకొని నెక్లెస్ ఇదేనా అని అడుగుతాడు పోలీస్. ఇదే నా నెక్లెస్ అంటుంది శోభ. దీంతో ఇంద్రుడిని పట్టుకుంటాడు పోలీస్. సార్.. వాళ్లిద్దరూ తోడుదొంగలు అని అంటుంది స్వప్న.

జ్వాల వీళ్లు ఎవరు అని అడుగుతాడు నిరుపమ్. దీంతో మా బాబాయి, పిన్ని అని చెబుతుంది జ్వాల. వీళ్లదంతా దొంగల బ్యాచ్ రా నిరుపమ్ అంటుంది స్వప్న. ఒకప్పుడు చేసేవాళ్లు కానీ.. ఇప్పుడు మాత్రం చేయడం లేదు అంటుంది జ్వాల.

డాక్టర్ సాబ్.. మా వాళ్లు దొంగతనాలు చేయడం నిజంగా మానేశారు అంటే నిరుపమ్ వినడు. నువ్వు ఇంకా వాళ్లనే సమర్ధిస్తున్నావా అని అంటాడు నిరుపమ్. ఇంద్రుడు మాత్రం నేను ఈ దొంగతనం చేయలేదు అంటాడు ఇంద్రుడు. ఇంతలో హిమ ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది.

ఎస్ఐ గారు ఒక్క నిమిషం అని ఆపుతుంది. ఈ ఏరియాలో అంతా కరెంట్ పోయిందా. లేక ఈ ఇంట్లోనే కరెంట్ పోయిందో ఒక్కసారి మీరు తెలుసుకోగలరా అని అడుగుతుంది హిమ. కానిస్టేబుల్ గారు.. మీరు ఒకసారి పక్కింటికి వెళ్లి కరెంట్ పోయిందో లేదో తెలుసుకొని రండి అంటుంది హిమ.

పక్కింట్లో కరెంట్ పోలేదంట మేడమ్ అంటాడు. ఈ ఇంట్లోనే పవర్ పోయిందంటే.. ఎవరో కావాలనే టైమ్ చూసి తీశారన్నమాట అంటుంది హిమ. వెంటనే హిమ అక్కడ పని చేసే మరో వ్యక్తిని పిలిచి.. వాడి చెంప చెళ్లుమనిపిస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.

కరెంట్ ఎందుకు ఆఫ్ చేశావు అని అడుగుతుంది హిమ. మెయిన్ నువ్వే ఆఫ్ చేశావు. అది హాఫ్ చేస్తుండగా సీసీ కెమెరాలో నువ్వు పడ్డావు. ఆ విషయం తెలుసా నీకు అని అడుగుతుంది హిమ. ఇప్పుడు నెక్లెస్ ఎవరు తీశారో తేలిపోతుంది అంటుంది హిమ.

ఎస్ఐ గారు వీడే మెయిన్ ఆఫ్ చేశాడు. ఇంకొకడు నెక్లెస్ దొంగలించాడు.. అంటుంది. దీంతో నేను మెయిన్ ఆఫ్ చేశాను అంటాడు పనివాడు. ఇది ఎవరు చేశారో ఒప్పుకుంటే మంచిది.. అని శోభను చూస్తూ మాట్లాడుతుంది. తర్వాత శోభ దగ్గరికి వెళ్లి నిరుపమ్ బావ ముందు నీ పరువు పోవాలంటే నాకు క్షణం పని అని శోభకు చెబుతుంది.

దీంతో ఇద్దరు పని వాళ్లను కొట్టి.. వాళ్లిద్దరిని తీసుకెళ్లమని చెబుతుంది శోభ. ఇంద్రుడుకు సారీ చెబుతుంది శోభ. తర్వాత జ్వాల కూల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Rajinikanth : రాజకీయాల్లోకి వచ్చుంటే సీఎం అయ్యేవాడిని.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు!

Rajinikanth :  సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…

13 hours ago

Linguda : లింగుడా ఆకుకూరలో దాగి ఉన్న అద్భుత ప్రయోజనాలు.. షుగర్, జాయింట్ పెయిన్‌కు సూపర్ ఫుడ్..!

Linguda  : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…

14 hours ago

Fenugreek Seeds : మెంతులు శరీరంలో వేడి పెంచుతాయా..? తగ్గిస్తాయా..? అసలు నిజం ఇదే!

Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…

19 hours ago

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

3 days ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

4 days ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

4 days ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

4 days ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

4 days ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

4 days ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

4 days ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

5 days ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

5 days ago