Karthika Deepam 6 May Today Episode : జ్వాలకు హెల్ప్ చేసిన సౌందర్య.. తనే శౌర్య అని తెలుసుకుంటుందా? ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

Karthika Deepam 6 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 మే 2022, శుక్రవారం ఎపిసోడ్ 1345 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్వాల.. సత్యం కోసం బిర్యానీ తీసుకొస్తుంది. ఇదే మంచి సమయం అనుకొని.. ప్రేమ్ వెంటనే హిమకు ఫోన్ చేసి బిర్యానీ తినడానికి వస్తావా అని అడుగుతాడు. నిరుపమ్ కూడా వస్తున్నాని చెబుతాడు ప్రేమ్. తిక్క తీసుకొచ్చింది అని చెబుతాడు. దీంతో వెంటనే వస్తా అని చెబుతుంది హిమ. నీ బిర్యానీ తినడం కోసం తింగరితో పాటు డాక్టర్ సాబ్ కూడా వస్తున్నాడు అని ప్రేమ్.. జ్వాలతో చెబుతాడు. మరోవైపు కార్తీక్, దీప ఫోటో చూసి మీరేమో మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు అని బాధపడుతూ ఉంటుంది సౌందర్య. ఆదిత్య అమెరికా వెళ్లిపోయాడు. ఉన్న స్వప్న.. తన చేజేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటోంది అంటుంది సౌందర్య.

karthika deepam 6 may 2022 full episode

రేపు సత్యం, స్వప్నల 25వ పెళ్లి రోజు. అంతా బాగుంటే.. అందరం కలిసి ఉంటే ఈ ఇంట్లో ఫంక్షన్ ను పెద్ద పండుగలా చేసేదాన్ని. ఏం లాభం. స్వప్న ఒక చోట.. సత్యం ఒక చోట. మన కుటుంబానికి ఏ శాపం తగిలిందో ఏంటో.. పెళ్లయిన కొన్నాళ్లకే నువ్వు, దీప విడిపోయారు. ఇప్పుడు సత్యం, స్వప్న కూడా అలాగే తయారయ్యారు. భార్యాభర్తలకు విడివిడిగా శుభాకాంక్షలు చెప్పడం అనేది ఎంత అసహజంగా ఉంటుందో కదా. స్వప్న మారితే బాగుండు. ఈ పెళ్లి రోజు అయినా కలిసి చేసుకుంటే బాగుండు అని అనుకుంటుంది సౌందర్య. ఇంతలో అక్కడికి హిమ వస్తుంది. నేను సత్యం మామయ్య వాళ్ల ఇంటికి వెళ్తున్నాను అంటుంది హిమ. డిన్నర్ కు వెళ్తున్నాను అంటుంది.

అవును అమ్మ అందరూ కలుసుకుంటే బాగుంటుంది కానీ.. కలుసుకోవాలని అందరికీ ఉండాలి కదా. వెళ్లిపోయిన శౌర్య ఎప్పుడు కలుస్తుందో.. దూరందూరంగా ఉన్న సత్యం, స్వప్నలు ఎప్పుడు కలుస్తారో అని అనుకుంటుంది సౌందర్య. మరోవైపు నిరుపమ్, హిమ బిర్యానీ తినడం కోసం సత్యం ఇంటికి వెళ్తారు. అయితే.. నిరుపమ్ కే బిర్యానీని ఎక్కువగా వడ్డిస్తూ ఉంటుంది జ్వాల. తను చేస్తున్న పని చూసి అందరూ నవ్వుకుంటారు. నిరుపమ్ బిర్యానీ తింటుంటే.. తననే చూస్తుంటుంది జ్వాల. బిర్యానీ అదిరిపోయింది జ్వాల. చాలా బాగుంది అంటాడు నిరుపమ్. హలో బ్రదర్ బిర్యానీ తను చేసి ఉండదులే. వాళ్ల పిన్ని చేసి ఉంటుంది అంటాడు ప్రేమ్.

డాక్టర్ సాబ్ నన్ను పొగిడితే నీకేంటి కడుపు మంట అంటుంది జ్వాల. నిజంగా బిర్యానీ చాలా బాగుంది అని అంటుంది హిమ. ఇద్దరికే తేకుండా ఎక్కువ తీసుకొచ్చింది నేను. ఇవన్నీ నీకు తెలియదు కదా ఎక్స్ ట్రా అంటుంది జ్వాల. ఇలా మనం అందరం కలిసి తిన్నట్టే మమ్మీ డాడీలతో కలిసి తినాలి అంటాడు నిరుపమ్.

Karthika Deepam 6 May Today Episode : పెగ్ వేసి ఏదేదో మాట్లాడిన సత్యం

మమ్మీ, డాడీ మనం అందరం కలిసి పోవాలి. దీని కోసం ఆలోచించు అంటాడు నిరుపమ్. అవును.. మామయ్య ఏంటి ఇంకా రాలేదు అంటుంది హిమ. ఇంతలో సత్యం వస్తాడు. నువ్వు కూడా కూర్చో అంటాడు నిరుపమ్. దీంతో పర్లేదు డాక్టర్ సాబ్.. అంటుంది.

బిర్యానీ ఉంది కదా అని సత్యం ఒక పెగ్ వేసి వస్తాడు. అందరితో ప్రేమగా మాట్లాడుతుండటంతో షాక్ అవుతాడు. జ్వాలను కూడా బంగారం అంటాడు సత్యం. ఆయన లోకం ఆయనది అని అనుకుంటాడు నిరుపమ్. ఎలాగైనా అమ్మానాన్నను కలపాలి. ఈ విషయంలో జ్వాల హెల్ప్ తీసుకోవాలి అని అనుకుంటాడు నిరుపమ్.

మరోవైపు నిరుపమ్, జ్వాలకు పెళ్లయినట్టు కలగంటుంది జ్వాల. తనకు బిర్యానీ వండిస్తున్నట్టు కలగంటూ.. నిరుపమ్ కు బిర్యానీ ఎక్కువగా వడ్డిస్తుంది జ్వాల. అంత నిరుపమ్ కు వడ్డిస్తావా.. కొంచెం మాకు కూడా వడ్డించు అంటుంది హిమ.

మమ్మీ డాడీల గురించి ఆలోచించాలి అంటాడు నిరుపమ్. దీంతో ఇంత కాలం మనం చేసింది అదే కదా. ఏం జరిగింది అంటాడు నిరుపమ్. దీంతో అది కాదు.. మ్యారేజీ యానివర్సరీ కదా.. ఎలాగైనా కలపాలి అంటాడు నిరుపమ్. వాళ్లిద్దరినీ కలిపితే భవిష్యత్తులో హ్యాపీగా ఉంటాం అంటాడు నిరుపమ్.

దీంతో సరే ముందు బిర్యానీ తిను.. తర్వాత మాట్లాడుకుందాం అంటాడు ప్రేమ్. ఈ తిక్క ముందు ఇంటి విషయాలు మాట్లాడటం ఎందుకు అని అనుకుంటాడు ప్రేమ్. కట్ చేస్తే తెల్లారుతుంది. స్వప్న, సత్యం ఫంక్షన్ గురించి ప్రేమ్, హిమతో మాట్లాడుతుంది సౌందర్య.

వాళ్ల పెళ్లి రోజు ఫంక్షన్ కు మీ మమ్మీని ఎలా ఒప్పించాలి అని అంటుంది సౌందర్య. నిరుపమ్ మమ్మీని ఒప్పిస్తా అన్నాడు. ఏదో ఒక రకంగా అత్తయ్యను ఒప్పిస్తాడనే నమ్మకం నాకుంది అంటుంది హిమ. వాళ్లిద్దరి మ్యారేజ్ డేను ఇక్కడే ప్లాన్ చేద్దాం అంటుంది హిమ.

మరోవైపు చెత్త కాగితాల షాపునకు వెళ్లి 10 కిలోలు వేస్ట్ పేపర్స్ కావాలి అంటుంది జ్వాల. దీంతో అతడు వేస్ట్ పేపర్స్ తూకం వేస్తుంటాడు. అక్కడే గీత గీసిన బొమ్మలు కూడా ఉంటాయి. అప్పుడే అక్కడికి సౌందర్య కారులో వచ్చి.. జ్వాలను చూస్తుంది.

పనికొచ్చే పేపర్స్ ఇవ్వు. చిత్తు కాగితాలు అన్నారు కానీ.. చెత్త కాగితాలు అనలేదు కదా అంటుంది. ఇంతలో జ్వాల ఆటోలోకి ఓ దొంగ దూరి తన ఆటోలో ఉన్న డబ్బులు దొంగలించడం సౌందర్య చూస్తుంది. వెంటనే కారు దిగి.. అతడిని పట్టుకొని దొంగ వెదవ అంటూ అతడిని తిట్టి డబ్బులు లాక్కుంటుంది.

ఇంతలో జ్వాల వస్తుంది. నీ డబ్బులు వీడు కొట్టేశాడు అంటుంది. ఏంట్రా ఇలా చేశావు అంటే.. తప్పయింది అక్క అంటాడు. దీంతో తనకు కోపం వచ్చి చెంప చెళ్లుమనిపిస్తుంది. తర్వాత వాడికి కొంత డబ్బు ఇచ్చి తిన్నావో లేదో.. తినుపో అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Guvvala Balaraju : బిజెపిలోకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు : రాంచందర్ రావు

Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…

27 minutes ago

Zodiac Signs : ఆగ‌స్ట్‌లో ఈ రాశుల వారు జ‌ర భద్రం…ఆర్ధికంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఎక్కువ‌..!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…

1 hour ago

Coconut Oil : జిడ్డు వ‌ల‌న బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి..!

Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…

2 hours ago

Gym : వ్యాయామ సమయంలో బిగుతైన దుస్తులు వేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో తెలుసా?

Gym  : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…

3 hours ago

Onions Black Spots : ఉల్లిపాయలపై నల్ల మచ్చలు.. నిపుణుల హెచ్చరిక..ఈ విష‌యంలో శ్రద్ధగా ఉండాలి..!

Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…

4 hours ago

Smartphone : రూ.15 వేల ధరలో బెస్ట్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌… ఇది ట్రై చేయండి..!

Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…

5 hours ago

Tea BP : బీపీ ఉన్న వారు టీ తాగితే మంచిదేనా…ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి..!

Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…

6 hours ago

Varalakshmi Vratham : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం.. ఏయే నైవేధ్యాలు చేయాల‌ని ఆలోచిస్తున్నారా..?

Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…

7 hours ago