Karthika Deepam 6 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 నవంబర్ 2021, శనివారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సౌందర్య కారులో వెళ్లడం చూసి షాక్ అవుతుంది దీప. అక్కడికే వస్తున్నా భారతి అంటూ ఫోన్ లో మాట్లాడి వెళ్తోంది. అసలు అత్తయ్య ఎందుకు ఇంతలా మారిపోయారు. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్లు. వేళ కాని వేళ పూజ గది దగ్గరికి వచ్చి మాట్లాడుకున్నారు. ఏంటో అత్తయ్య మాట్లాడేదాంట్లో పొంతన లేకుండా పోయింది. ఏంటి అత్తయ్య మీరు మారిపోయారా? మీరు కూడా నన్ను వదిలేశారా? మీరు కూడా అటువైపే వెళ్లిపోయారా? అని తెగ బాధపడిపోతుంది దీప. ఎన్ని కష్టాలు వస్తే మనసు అంత గట్టిగా రాయిలా మారుతుంది అంటారు. సరే.. అందరూ నాకు ఎదురు తిరుగుతున్నారు కదా. ఇది నాకు మంచికే అనుకుంటాను. నేను తీసుకునే నిర్ణయం మంచిదే అని మీరు అందరూ ఈరకంగా అయినా నిరూపిస్తున్నారు అని అనుకుంటుంది దీప.
ఇంతలో శౌర్య వచ్చి దీపను తీసుకెళ్లిపోతుంది. కారులో వెళ్తున్న సౌందర్య.. ఈశ్వరా ఏంటి నాకు ఈ బాధ. నా కొడుకు కార్తీక్ మూలంగా 10 రెట్లు చూడాల్సి వచ్చింది. నేను సూటిగా చూసి మాట్లాడితే నా కళ్లలోకి చూసి మాట్లాడలేని మోనితను కూడా నేను ఇప్పుడు బతిమిలాడాల్సి వస్తోంది. దీపకు రేపు తెలిస్తే ఎలా.. ఇదంతా దీప కోసమే చేస్తున్నాను అని దీపకు ఎలా చెప్పాలి. కార్తీక్ ఒక్కడు కరెక్ట్ గా ఉంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదుద అంటుంది సౌందర్య.
కట్ చేస్తే హిమ.. కార్తీక్ తో కలిసి సరదాగా ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో దీపను శౌర్య తీసుకొచ్చి రా అమ్మా.. మనం ఇక్కడ పడుకుందాం అంటుంది. దీంతో దీప షాక్ అవుతుంది. ఏంటమ్మా ఆగిపోయావు అంటుంది శౌర్య. నేను, హిమ.. ఇవాళ మీ పక్కనే పడుకుంటాం అంటుంది. కానీ.. దీప వద్దులే అమ్మా.. నేను ఇక్కడ పడుకోను అంటుంది. దీంతో శౌర్య షాక్ అవుతుంది. ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు. మేము మాట్లాడనప్పుడు మీకు కోపం వచ్చింది. మేము మాట్లాడుతుంటే ఇలా చేస్తున్నారు ఎందుకు అంటుంది హిమ.
వద్దులే హిమ. మీరు ముగ్గురూ ఇక్కడే ఉండండి. నేను వెళ్తున్నాను అంటుంది శౌర్య. దీంతో శౌర్య దీపను వెళ్లకుండా అడ్డుకుంటుంది. హిమ వెళ్లి.. ప్లీజ్ అమ్మా ఈరోజు ఇక్కడే ఉండు అమ్మా.. రా అమ్మా అంటుంది. మనకన్నీ ఉన్నాయనిపిస్తుంది. కానీ.. ఈ ఇంట్లో ఎవ్వరూ సంతోషంగా ఉన్నట్టు కనిపించరు అంటుంది శౌర్య. డాడీ కూడా అంత తొందరగా ఏం ఒప్పుకోలేదు శౌర్య. బాగా బతిమాలించుకున్నాడు. తర్వాత అమ్మ కూడా అలాగే చేస్తోంది అంటుంది హిమ.
కట్ చేస్తే సౌందర్య.. మోనిత ఇంటికి వస్తుంది. ఆంటి మీరా.. రండి అంటుంది. కార్తీక్ రాలేదా ఆంటి అంటుంది. నువ్వు లోపలికి వెళ్లు ప్రియమణి అంటుంది. చెప్పండి ఆంటి.. ఏంటి ఇలా దారి తప్పి వచ్చారు అంటుంది. నేను ఎందుకు వచ్చానో నీకు బాగా తెలుసు. భారతి చెప్పింది. అయినా నువ్వు కావాలని అడుగుతున్నావని నాకు తెలుసు. చూడు మోనిత.. నేను ఇక్కడికి వచ్చానని పొంగిపోకు. నేను వచ్చింది నా కొడుకు కోసం కాదు.. నా కోడలు కోసం.. నా దీప కోసం అంటుంది సౌందర్య.
ఏంటి ఆంటి రాక రాక ఇంటికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి.. అంటుంది. కానీ.. సౌందర్య మాత్రం మోనితపై చాలా సీరియస్ అవుతుంది. ఎక్కువగా ఆలోచించకు అంటుంది. పూజకురా అని చెప్పి వెళ్లిపోబోతుంది. ఇంత దూరం వచ్చి మనవడిని కూడా చూసివెళ్లవా? అంటుంది. సౌందర్య వెళ్లాక.. భారతికి ఫోన్ చేసి.. నేను పూజకు వస్తున్నాను అని చెప్పు అంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.