Karthika deepam 6 september 2021 monday 1137 episode highlights
Karthika deepam 6 september 2021 monday 1137 episode highlights
Karthika Deepam 6 Sep Monday Episode Highlights : కార్తీక దీపం సీరియల్ ఆదివారం ప్రసారం కాదు. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే ప్రసారం అవుతుంది. అయితే.. సోమవారం, 6 సెప్టెంబర్ 2021 ఎపిసోడ్ 1137 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Karthika deepam 6 september 2021 monday 1137 episode highlights
శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూశాం కదా. మోనిత.. అన్నంత పని చేసేసింది. కార్తీక్ ను పెళ్లి చేసుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తానని చెప్పిన మోనిత.. ఆదిత్యకు యాక్సిడెంట్ చేయించింది. ఆదిత్యకు యాక్సెడెంట్ చేయించి.. అదే విషయాన్ని కార్తీక్ కు ఫోన్ చేసి చెబుతుంది మోనిత.
Karthika deepam 6 september 2021 monday 1137 episode highlights
తనను పెళ్లి చేసుకోకపోతే.. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేస్తానంటూ బెదిరించేసరికి.. ఏం చేయాలో కార్తీక్ కు అర్థం కాదు. తనను పోలీసులకు పట్టిద్దామని అనుకున్నా.. తను ఫ్యామిలీని ఏం చేస్తుందోనని కార్తీక్ వెనుకడగు వేస్తున్నాడు. అందుకే.. తనలో తానే మాట్లాడుకోవడం.. ఎప్పుడూ ఆ మోనిత గురించే ఆలోచిస్తుండటంతో.. కార్తీక్ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడని అనుకుంటున్నారు తన కుటుంబ సభ్యులు.
Karthika deepam 6 september 2021 monday 1137 episode highlights
నిజానికి.. మోనితను సోది చెప్పే ఆవిడ రూపంలో దీప ఎప్పుడో చూసింది. ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పినా నమ్మలేదు. చివరకు కార్తీక్ కు చెప్పినా నమ్మలేదు. తనే స్వయంగా చూశాక కానీ.. అప్పుడు నమ్మాడు కార్తీక్. తనకు టీ ఇచ్చే మూగ అమ్మాయిగా వచ్చింది మోనితే అని.. తన చేయి స్పర్శ చూసి కనిపెట్టాడు కార్తీక్. ఆ తర్వాత ఆసుపత్రికి వచ్చి డాక్టర్ గా వేషం వేసుకొని తను కార్తీక్ కు ట్రీట్ మెంట్ చేస్తుంది.
Karthika deepam 6 september 2021 monday 1137 episode highlights
కార్తీక్ కు కడుపునొప్పి వచ్చేలా ప్లాన్ చేసి.. చాయ్ లో కడుపు నొప్పి ట్యాబ్లెట్ కలిపి కార్తీక్ కు ఇవ్వడంతో.. ఆరోజు సాయంత్రం కాగానే.. కార్తీక్ కు కడుపునొప్పి లేస్తుంది. దీంతో కార్తీక్ ను రత్నసీత.. ఆసుపత్రికి తరలిస్తుంది. అక్కడ డాక్టర్ అవతారం ఎత్తిన మోనిత.. కార్తీక్ దగ్గరికి వెళ్లి.. తనను బెడ్ కు కట్టేసి.. తనను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరిస్తుంది.
Karthika deepam 6 september 2021 monday 1137 episode highlights
తనను పెళ్లి చేసుకోకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పింది మోనిత. దీంతో మెంటల్ గా బాగా డిస్టర్బ్ అవుతాడు కార్తీక్. కార్తీక్ కు తన కన్నా కూడా తన ఫ్యామిలీ అంటేనే ఇష్టం. దాన్నే అలుసుగా తీసుకుంది మోనిత. అయితే.. మోనిత ఊరికే.. బెదిరిస్తోందని కార్తీక్ అనుకున్నాడు కానీ.. ఆదిత్యకు యాక్సిడెంట్ చేయించేసరికి.. కార్తీక్ భయం ఇంకా పెరిగింది.
Karthika deepam 6 september 2021 monday 1137 episode highlights
డాక్టర్ బాబుతో దీప ఉన్నప్పుడే.. దీపకు పిల్లలు ఫోన్ చేసి.. బాబాయ్ కి యాక్సిడెంట్ అయిందని చెబుతారు. దీంతో దీప హుటాహుటిన ఇంటికి వెళ్తుంది.
Karthika deepam 6 september 2021 monday 1137 episode highlights
అయితే.. అంతకుముందే డాక్టర్ బాబుకు మోనిత ఫోన్ చేసి.. ఆదిత్యకు యాక్సిడెంట్ అయిందని.. ఇక నుంచి గాయాలు చేయడం కాదు.. ఏకంగా ప్రాణాలే పోతాయని చెప్పుకొచ్చింది మోనిత. దీంతో మరింత ఆందోళనకు గురవుతాడు కార్తీక్.
Karthika deepam 6 september 2021 monday 1137 episode highlights
వెంటనే ఇంటికి వెళ్లి ఆదిత్యను పలకరిస్తుంది దీప. అయితే.. ఆదిత్య వెళ్లే రోడ్డును బ్లాక్ చేసి.. వేరే రోడ్డు ద్వారా వెళ్లేలా చేసి రోడ్డుకు అడ్డంగా తీగ కట్టి.. ఆదిత్య బైక్ కిందపడేలా చేపిస్తుంది మోనిత. దీంతో ఆదిత్య కిందపడిపోతాడు. ఆయనకు హెల్మెట్ ఉండటం వల్ల పెద్దగా దెబ్బలు తాకవు కానీ.. ఆయన చేతికి, కాళ్లకు కొన్ని గాయాలు అవుతాయి.
Karthika deepam 6 september 2021 monday 1137 episode highlights
చేతికి కట్టుకట్టించుకొని ఆదిత్య.. ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే.. అందరూ షాక్ అవుతారు. శ్రావ్య అయితే గుక్కపెట్టి ఏడుస్తుంది. దీప చూసి.. ఏంటి ఆదిత్య ఇది.. అని అడుగుతుంది. ఏం కాలేదు వదినా.. మీరు టెన్షన్ పడకండి.. అంటాడు ఆదిత్య. చిన్న దెబ్బలే అంటాడు.
Karthika deepam 6 september 2021 monday 1137 episode highlights
అదంతా ఓకే కానీ.. అసలు.. ఏం జరిగింది.. నువ్వు లాయర్ దగ్గరికి వెళ్లిన విషయం ఏమైంది అని అడుగుతాడు ఆనంద రావు. దీంతో ఆదిత్య.. ఇప్పుడెందుకు నాన్న… దాని గురించి తర్వాత మాట్లాడుతానులే అని అంటాడు. అంటే.. లాయర్ దగ్గర మాట్లాడినప్పుడు ఏం జరిగింది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. అలాగే.. అక్కడ పిల్లలు కూడా ఉండటంతో.. ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదని ఆదిత్య.. ఆ టాపిక్ ను డైవర్ట్ చేస్తాడు.
Karthika deepam 6 september 2021 monday 1137 episode highlights
అసలు.. ఆదిత్య లాయర్ దగ్గరికి వెళ్లి ఏం మాట్లాడాడు. లాయర్ ఆదిత్యకు ఏం చెప్పాడు? కార్తీక్ కు బెయిల్ వస్తుందా? లేదా? అనే విషయాలు తెలియాలంటే.. సోమవారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.