Karthika Deepam 6 Sep Today Episode : హమ్మయ్య.. మోనితను అడ్డంగా పట్టేసుకున్న దీప.. పోలీసులకు మోనితను పట్టిస్తుందా? డాక్టర్ బాబును రిలీజ్ చేస్తారా? కార్తీక్ ఇంటికి వెళ్తాడా?

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

Karthika Deepam 6 Sep Today Episode : కార్తీకదీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 6 సెప్టెంబర్ 2021, సోమవారం 1137 ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆదిత్యకు యాక్సిడెంట్ అవ్వడంతో అందరూ తెగ టెన్షన్ పడతారు. ఏం కాలేదులే వదిన.. నువ్వేం బాధపడకు అని దీపతో ఆదిత్య అంటాడు. శ్రావ్య కూడా వెక్కి వెక్కి ఏడుస్తుంది. మన అదృష్టం బాగుండి చిన్నచిన్న దెబ్బలు తాకాయి. హెల్మెట్ ఉండటం వల్ల తలకు దెబ్బలు తగల్లేదు.. అని అంటుంది శ్రావ్య.

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

ఇంతకీ ఆ లాయర్ ఏమన్నాడు.. అని అడుగుతాడు ఆనందరావు. ఏమంటాడు.. తర్వాత మాట్లాడుతానులే అని అంటాడు ఆదిత్య. నాన్న ఎలా ఉన్నాడమ్మా అని అడుగుతారు పిల్లలు. బాగానే ఉన్నాడమ్మా.. మిమ్మల్ని బెంగపెట్టుకోవద్దన్నాడు.. అని అంటారు పిల్లలు. రేపు వచ్చేస్తాడా డాడీ.. అని అడుగుతారు. దీంతో అత్తయ్య ఎప్పుడు వస్తారు మామయ్య గారు అని అడుగుతుంది దీప. స్కూళ్లను చెక్ చేసి వస్తానని చెప్పి వెళ్లింది. మంచి స్కూల్ చూసి వస్తానని చెప్పింది అని ఆనంద రావు అనడంతో.. ఎందుకు మేము అస్సలు వెళ్లం. నాన్నను వదిలేసి మేం అక్కడ స్కూళ్లకు వెళ్లం. మేం నాన్నతోనే ఉంటాం.. అంటూ మొండికేసినట్టు చెబుతారు పిల్లలు.

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

మమ్మల్ని వదిలించుకోవాలని అనుకుంటున్నారా? మమ్మల్ని హాస్టల్ కు పంపించి.. నాన్నకు దూరం చేస్తారా? మీరు ఎంత చెప్పినా మేము మాత్రం అస్సలు వినం. మేము అక్కడికి వెళ్లం. ఇక్కడే ఉంటాం.. అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరూ వెళ్లిపోతారు.

Karthika Deepam 6 Sep Today Episode : ఎస్ఐకి ఫోన్ చేసి.. కార్తీక్ తో మాట్లాడాలని చెప్పిన మోనిత

కట్ చేస్తే.. కార్తీక్ ఇంకా ఆ మోనిత గురించే ఆలోచిస్తుంటాడు. మోనిత బారి నుంచి ఎలా తప్పించుకోవాలని చూస్తుంటాడు. నా కుటుంబాన్ని మోనిత బారి నుంచి ఎలా రక్షించుకోవాలి. ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలి.. అని అనుకుంటుండగానే ఇంతలోనే ఎస్ఐ అక్కడికి వచ్చి మీకు ఫోన్ వచ్చింది అంటాడు. ఎవరు ఫోన్.. అనగానే డాక్టర్ రీనా గారు ఫోన్ చేశారు.. మాట్లాడండి.. అని అంటాడు. నేను పడుకున్నా అని చెప్పు.. తర్వాత మాట్లాడుతా అని చెప్పు అంటే.. చచ్చిపోయిన మోనిత ఫోన్ చేసినట్టు అంత ఉలిక్కిపడుతున్నారు ఎందుకు.. డాక్టరేగా ఫోన్ చేసింది.. మాట్లాడండి సార్.. అని అంటాడు పోలీస్.

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

దీంతో చేసేదేం లేక ఫోన్ తీసుకుంటాడు కార్తీక్. హలో.. అనగానే నేను నీ కాబోయే భార్యను అని అంటుంది. నా ఫోన్ చూసి అంత కంగారు పడుతావేంటి కార్తీక్. ఆ ఎస్ఐకి అనుమానం రాదు. ఇప్పుడే నీ మొదటి పెళ్లాం వెళ్లినట్టుంది. అందుకే రెండో పెళ్లాం వెంటనే ఫోన్ చేసింది. సరే.. ఇప్పుడు నేను ఫోన్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. పంతులుగారిని అడిగాను. రేపు ఉదయం 11.50 నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉందట. అది కానీ.. మిస్ అయితే నువ్వు జైలుకు నీవాళ్లు పైకి పోతారట. ఈ మాట పంతులు గారు చెప్పలేదు. నీ రెండో పెళ్లాం చెబుతోంది. రేపు ముహూర్తం టైమ్ కు నువ్వు నా మెడలో తాళి కట్టాలి. మనవాళ్లు హ్యాపీ, సంతోషంగా ఉండాలనేది నీ చేతుల్లోనే ఉంది. ఇదే నీకు నేను ఇచ్చే లాస్ట్ చాన్స్.. అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మోనిత.

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

కట్ చేస్తే.. పిల్లలు నిద్రపోతుంటారు. వాళ్ల దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తుంటుంది దీప. డాక్టర్ బాబు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచిస్తుంది. దేనికైనా భయపడుతున్నారా? మానసికంగా బలహీనపడ్డారా? కడుపు నొప్పి తగ్గినా ఇంకా ఆసుపత్రిలోనే ఎందుకు ఉన్నారు. రేపు రోషిణి మేడమ్ తో మాట్లాడాలి.. అని అనుకుంటుంది దీప.

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

Karthika Deepam 6 Sep Today Episode : పిల్లల స్కూల్ గురించి వెళ్లి తిరిగి వచ్చిన సౌందర్య

కట్ చేస్తే.. ఉదయమే సౌందర్య ఇంటికి వస్తుంది. ఆనంద రావు సోఫాలో పడుకొని ఉంటే అతడిని లేపుతుంది. ఇక్కడ పడుకున్నారు ఏంటండి.. అని అడుగుతుంది సౌందర్య. గదిలో ఒంటరిగా పడుకుంటే.. నిద్ర రాలేదు సౌందర్య. అందుకే ఇక్కడ పడుకున్నా అని చెబుతాడు.

పెద్దోడిని ఈరోజే కోర్టుకు హియరింగ్ కు తీసుకెళ్తున్నారట. లాయర్ గారితో మాట్లాడారా? అని అనగానే.. చిన్నోడు లాయర్ తో మాట్లాడేందుకు వెళ్లాడు. సాక్ష్యాలన్నీ కార్తీక్ కు వ్యతిరేకంగా ఉన్నాయట. బెయిల్ దొరకడం కష్టం అని లాయర్ అన్నాడట.. అని ఆనంద రావు.. సౌందర్యతో అంటాడు.

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

పిల్లలు.. ఇంట్లో ఉండి దీప మీద అకారణంగా ధ్వేషం పెంచుకుంటున్నారు. నా మనసు కూడా ఇక్కడే ఉంది. ఏమాత్రం స్థిమితంగా లేదు. పిల్లల కోసం స్కూల్ కు వెళ్లాను కానీ.. నాకు ఏం అర్థం కావడం లేదు. సాక్ష్యాలు బలంగా ఉన్నాయని.. బెయిల్ ఇవ్వకపోతే రిమాండ్ కు తరలిస్తారేమో.. అని అంటుంది సౌందర్య.

ఇది రెండోసారి వాడు కోర్టుకు వెళ్లడం. మన కుటుంబం పరువు ప్రతిష్ఠలతో పాటు… ఏ నేరం చేయని మన కొడుకు జీవితమే నాశనం అయ్యేలా ఉంది.. అని ఆనంద రావుతో చెబుతుంది సౌందర్య. నేను ఒకసారి దీప దగ్గరికి వెళ్లి వస్తా.. అని అంటుంది సౌందర్య. దీప ఇంట్లో లేదు. బయటికి వెళ్లింది. పెద్దోడి దగ్గరికే కావచ్చు.. అని అంటాడు ఆనంద రావు.

Karthika Deepam 6 Sep Today Episode : మోనిత బతికే ఉందని ఏసీపీకి చెప్పిన దీప

కట్ చేస్తే ఏసీపీ రోషిణి.. ఆఫీసులో కూర్చొని పనిచేస్తుంటుంది. ఏసీపీ దగ్గరికి దీప వస్తుంది. నమస్కారం పెడుతుంది. ముద్దాయిని కోర్టులో హాజరుపరిచేముందు నేను ముద్దాయి కుటుంబ సభ్యులతో మాట్లాడను.. అని ఏసీపీ అంటుంది. ముద్దాయి అని మీరు ముందే ముద్ర వేయకండి మేడమ్.. అనగానే.. ఏది ఏమైనా ఈరోజు కోర్టులో అది కూడా తేలిపోతుంది కదా.. అని చెబుతుంది ఏసీపీ.

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

అసలు మీరు ఈ కేసు విషయమై ఏం దర్యాప్తు చేశారు. ఏం కనిపెట్టారు.. మేడమ్.. మీ మీద ఉన్న చనువుతో అడుగుతున్నాను.. అని అంటుంది దీప. డాక్టర్ బాబుకు కడుపునొప్పి వచ్చింది నిజం. కానీ.. అదేరోజు తగ్గిపోయింది. కానీ.. అక్కడ ఉన్న పోలీసులుకు కూడా తెలుసు. కానీ.. ఇన్ని రోజులు డాక్టర్ బాబును ఇన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచారు. అంటే.. ఫుడ్ పాయిజన్ అయితే.. కడుపులో ఇన్ఫెక్షన్ తగ్గేదాకా ట్రీట్ మెంట్ చేయాలి.. అని చెబుతుంది ఏసీపీ. మరి.. అక్కడ ట్రీట్ మెంట్ చేసేవాళ్లే లేరు కదా. ఆయన్ను ఊరికే బెడ్ మీద పడుకోబెడుతున్నారు.. అని దీప అనుమానం వ్యక్తం చేస్తుంది దీప. నీకు, నీ అత్తయ్యకు బాగా లా పాయింట్స్ తెలుసు.. అంటూ చెబుతుంది ఏసీపీ.

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

ఇంకా నీకు ఏం డౌట్స్ ఉన్నాయో చెప్పు.. అని ఏసీపీ చెప్పగానే మోనిత బతికే ఉంది.. అని అంటుంది దీప. మోనిత బతికే ఉందని.. డాక్టర్ బాబు కూడా చెప్పారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి టీ ఇచ్చిన అమ్మాయి.. ఎవరో కాదు.. మోనితే అని డాక్టర్ బాబే చెప్పాడు. ఇంకొద్ది గంటల్లో ఆయన భవిష్యత్తు శాసించబడుతుంది. ఈలోపు మాకోసం కాదు.. న్యాయం కోసం మీవైపు నుంచి ఏదైనా న్యాయం చేయండి. మోనిత బతికి ఉండి.. డాక్టర్ బాబుకు శిక్ష పడితే అది కరెక్ట్ కాదు కదా.. దయచేసి ఆ దిశగా ఆలోచించండి.. అని చెప్పి వెళ్లిపోతుంది దీప.

Karthika Deepam 6 Sep Today Episode : పెళ్లికూతురు నగలను, తాళిని చూసి తెగ మురిసిపోయిన మోనిత

కట్ చేస్తే.. తన పెళ్లి కోసం ముస్తాబు అవుతుంటుంది మోనిత. నగలు, తాళి, పెళ్లి చీర.. అన్నింటినీ సిద్ధం చేసుకుంటుంది. వాటిని చూసి తెగ మురిసిపోతుంది. ఇంకాసేపట్లో మోనిత.. మోనితా కార్తీక్ గా మారిపోతుంది. తాళి బొట్టుతో నా మెడకు ఎంతో అందం వచ్చింది. ఇన్ని రోజులు నా మెడలో స్కెతస్కోప్ మాత్రమే ఉండేది.. ఇప్పుడు తాళి కూడా ఉంటుంది.. అని అనుకుంటుంది మోనిత.

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

ఆనంద్.. అంటూ తన కడుపులో ఉన్న కొడుకును పలకరిస్తుంది. ఇక నుంచి నీ పేరు ఇదే. మా మామయ్య పేరు. ఈరోజు నేను పెళ్లి చేసుకోబోతున్నాను. మీ నాన్నను.. అంటూ తన కడుపులోని బిడ్డకు చెబుతుంది మోనిత.

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

కట్ చేస్తే దీప చెప్పిన విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుంది రోషిణి. వెంటనే పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా ఫుటేజ్ ను చెక్ చేస్తుంది. రత్నసీతను పిలుస్తుంది. ఏం జరుగుతోంది మన స్టేషన్ లో అని అడుగుతుంది రత్నసీతను. ఇంతవరకు నీ సర్వీస్ లో చనిపోయారు.. అని అనుకున్నవారు బతికే ఉండటం చూశావా? అని అడుగుతుంది రోషిణి. మరి అలా అంటాడేంటి కార్తీక్.. అతడు చూశాడంటనా.. అంటే.. కళ్లారా చూశాడంట.. మన స్టేషన్ లోనే చూశాడంట. చనిపోయిన మోనిత ఇక్కడికి రావడం ఏంటి మేడం అని అనగానే.. తను చనిపోయిందని మొదటి నుంచి కార్తీక్ నమ్మడం లేదు కదా. స్టేషన్ కు వచ్చి టీ ఇచ్చి వెళ్లిందని అంటున్నాడు కదా. ఇంతకీ శుక్రవారం ఫుటేజ్ లేదేంటి.. అని చెక్ చేస్తుంటుంది రోషిణి. ఆ రోజు అన్ని కెమెరాలు సర్వీసింగ్ కు ఇచ్చేశాం కదా మేడమ్ అంటుంది రత్నసీత. ఓహ్.. ఆరోజే తీసేశారన్నమాట.. అని అంటుంది రోషిణి.

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

Karthika Deepam 6 Sep Today Episode : మోనితను చూసి షాక్ అయిన దీప

కట్ చేస్తే కార్తీక్ కు భోజనం వడ్డించేందుకు ఆసుపత్రికి వెళ్తుంది దీప. మళ్లీ ఎస్ఐకి ఫోన్ చేసి.. కార్తీక్ కు ఇవ్వమంటుంది. దీప.. బయటికి వచ్చి చూసే సరికి.. మోనిత.. రీనా వేషంలో బయట ఉండి మాట్లాడుతుంటుంది. అద్దంలో మోనిత ముఖాన్ని చూసి షాక్ అవుతుంది. అంటే.. డాక్టర్ రీనాలా ఇన్ని రోజులు వచ్చింది మోనితనా. అందుకే.. డాక్టర్ బాబు ఇంతలా భయపడుతున్నాడా? అని అనుకొని అక్కడికి వస్తుంది.

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

నా గురించి నా కన్నా నీకే ఎక్కువగా తెలుసు కార్తీక్. త్వరగా నీ పెళ్లాన్ని ఇక్కడి నుంచి పంపించి.. నా మెడలో తాళి కట్టేసేయ్.. అంటుంది మోనిత. అది విన్న దీప.. తన చేతుల్లో ఉన్న ప్లేట్లను విసిరేస్తుంది. దీంతో.. వెనక్కి తిరిగి చూస్తుంది మోనిత. దీపను చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago