Karthika Deepam 7 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 ఏప్రిల్ 2022, గురువారం ఎపిసోడ్ 1320 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్వాల చీర కట్టుకుంటుందా లేదా అని చంద్రమ్మ, ఇంద్రుడు ఎదురు చూస్తుంటారు. చీర కట్టుకొని బయటికి వస్తుంది జ్వాల. చీరలో జ్వాల చూసి మురిసిపోతుంది. చీరలో ఎంత బాగున్నావో అంటుంది చంద్రమ్మ. నా బంగారు తల్లి.. నా కల్ప వల్లి.. నా ముద్దుల తల్లి అంటుంది చంద్రమ్మ. చీర కట్టుకున్నాక ఎలా ఉండాలో జ్వాలకు చెబుతుంది చంద్రమ్మ.
ఆటో స్టాండ్ లో నా మానాన నేను కస్టమర్ల కోసం చూస్తుంటే నన్ను రమ్మన్నారు. తర్వాత చీర కట్టుకోమన్నారు. ఎందుకు.. ఈ చీర కట్టుకోమన్నారు అని అడుగుతుంది జ్వాల. పెళ్లి చూపుల కోసం కట్టుకోమన్నాను అని చెబితే నా పీక పిసికేస్తుంది కావచ్చు అని అనుకుంటుంది చంద్రమ్మ. నిన్ను అలా చీరలో చూడాలని అనిపించింది అంటుంది చంద్రమ్మ. ఈ చీర అయినా కొన్నారా లేక ఎక్కడైనా కొట్టేశారా అని అడుగుతుంది జ్వాల. దీంతో లేదు.. సత్యం సార్ అడ్వాన్స్ ఇచ్చారు కదా.. ఆ డబ్బులతోనే కొన్నాం అంటుంది చంద్రమ్మ.
నాకు జీవితంలో ఒక లక్ష్యం ఉంది. అది అయ్యేదాకా పెళ్లి చూపులు, పెళ్లి అనే ఆలోచనలు నీ దొంగబుద్ధిలోకి రానివ్వకూడదు అంటుంది జ్వాల. నేను వెళ్తాను అని చెప్పి వెళ్లిపోతుంది జ్వాల. తను వెళ్లగానే.. పెళ్లి వాళ్లకు ఫోన్ చేస్తాడు. నువ్వు దూరం నుంచి మాత్రమే చూడు బాబు అంటాడు.
మరోవైపు బస్తీలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది హిమ. ఒక ముసలావిడ వస్తే ఈ బస్తీలో వారణాసి, లక్ష్మణ్, అరుణ అని ఉండేవారు. వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా అని అడుగుతుంది. దీంతో ఆ పేరు ఉన్న వాళ్ల గురించి విన్నాను కానీ.. వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మాత్రం తెలియదు అని అంటుంది. దీంతో సరే అంటుంది.
మరోవైపు మెడికల్ క్యాంపు దగ్గరికి ప్రేమ్, సత్యం ఇద్దరు వస్తారు. హిమను చూసి మురిసిపోతాడు ప్రేమ్. ఎంత బాగుంటుందో హిమ. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది అని అనుకుంటాడు ప్రేమ్. మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు నిరుపమ్.
మీరు మంచి పని చేస్తున్నారు. అందుకే ఇక్కడికి వచ్చా అంటాడు. పక్కనే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాం అని చెబుతాడు నిరుపమ్. మీకు లేట్ అవుతున్నట్టుంది. అందరికీ క్యారేజ్ ఇక్కడికే తీసుకురమ్మని చెబుతాను అంటాడు సత్యం.
మరోవైపు ఆనంద రావు.. స్వప్న ఇంటికి వస్తాడు. బ్యాగు పట్టుకొని వచ్చారేంటి అని అడుగుతుంది. నా కూతురును చూడాలనిపించి వచ్చాను అంటాడు. స్వప్న తండ్రి హోదాలో వచ్చాను అంటాడు ఆనంద రావు. నా మనసుకు మానిపోని గాయం చేసింది మీ ఆవిడ అంటుంది స్వప్న.
మరోవైపు ఆటోలో క్యారేజ్ తీసుకొని వస్తుంది జ్వాల. చీర కట్టుకొని ఉన్న జ్వాలను చూసి ప్రేమ్ షాక్ అవుతాడు. ఏంటి ఎక్స్ ట్రా భయపడ్డావా అంటుంది జ్వాల. బుద్ధి ఉందా చూసుకొని నడపాలి కదా అంటాడు ప్రేమ్. తను ఫోటోలు తీస్తుంటే ఆటోతో అతడిని ఢీకొట్టబోతుంది జ్వాల.
తర్వాత ప్రేమ్ ఏం ఫోటోలు తీశాడో కెమెరాలో చూడబోతుంది. వద్దు అంటాడు. ఆ ప్రయత్నంలో తను కింద పడబోతుంటే పట్టుకుంటాడు ప్రేమ్. ఆ తర్వాత తనను వదిలేస్తాడు. దీంతో కింద పడిపోతుంది. నన్ను కింద పడేస్తావా అని ఇద్దరూ మళ్లీ గొడవ పెట్టేసుకుంటారు.
ఇంతలో జ్వాల.. నిరుపమ్ ను చూస్తుంది. తను చీర కట్టుకొని రావడం చూసి నిరుపమ్ షాక్ అవుతాడు. తనను అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత నిరుపమ్ దగ్గరికి వస్తుంది జ్వాల. హల్లో రౌడీ బేబీ ఏంటి ఈ కొత్త లుక్ అని అంటాడు నిరుపమ్.
మీ అందరికీ ఫుడ్ తీసుకొని వచ్చాను తింగరి అని అంటుంది జ్వాల. దీంతో థాంక్యూ జ్వాల అంటాడు నిరుపమ్. చీరలో చాలా బాగున్నావు జ్వాల అంటాడు నిరుపమ్. దీంతో థాంక్యూ డాక్టర్ సాబ్ అంటుంది జ్వాల. నాకు ఈ చీర చాలా కొత్తగా, ఇబ్బందిగా ఉంది అంటుంది.
ఇంతలో తను కింద పడిపోతుండగా నిరుపమ్ తనను పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ తర్వాత జ్వాల బ్లడ్ ఇస్తుండగా తన చేతి మీద ఉన్న హెచ్ అనే పచ్చబొట్టును చూస్తాడు నిరుపమ్. అది ఎవరిది అని అడుగుతాడు.
ఆ విషయం విని హిమ షాక్ అవుతుంది. ఆ పేరు ఎవరిది అని అడుగుతాడు నిరుపమ్. దీంతో నా శత్రువుది అని చెబుతుంది జ్వాల. దీంతో హిమ మరోసారి షాక్ అవుతుంది. ఈ హిమను శౌర్య ఎప్పటికీ క్షమించదా అని అనుకుంటుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్‌లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
This website uses cookies.