Karthika Deepam 7 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 జూన్ 2022, మంగళవారం ఎపిసోడ్ 1372 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తొందరపాటులో ఏదో అనేశాను.. సారీ అని జ్వాలతో అంటాడు నిరుపమ్. దీంతో ఊరుకోండి డాక్టర్ సాబ్.. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అంటుంది. నన్ను ఏదైనా అనే హక్కు మీకు ఉంది అంటుంది జ్వాల. దీంతో నా మీద నీకు ఎలాంటి కోపం లేదా అని అడుగుతాడు నిరుపమ్. ఇంతలో తింగరి వస్తుంది. నువ్వు సూపర్ తింగరి. నీకు ఎన్ని థాంక్స్ చెప్పినా తక్కువే అవుతాయి. జ్వాల చెప్పింద నిజం.. చివరి నిమిషంలో చాలా బాగా ఆలోచించావు అంటాడు నిరుపమ్. నీ తెలివితేటలకు అందరూ పరేషాన్ అయ్యారు తెలుసా అని అంటుంది జ్వాల. ఇంత తెలివైనది.. మంచి మనసు ఉన్న హిమ.. నన్ను ఎందుకు వద్దనుకుంటుందో నాకు అర్థం కావడం లేదు అనుకుంటాడు నిరుపమ్.
మరోవైపు స్వప్నకు చాలా కోపం వస్తుంది. చీ.. చీ.. పరువు తీశావు అని శోభపై విరుచుకుపడుతుంది. అందరి ముందు ఆ హిమ అరవలేదు. పద్ధతిగా దగ్గరికి వచ్చి చెప్పింది. రచ్చ చేసే అవకాశం ఉన్నా చేయలేదు సంతోషించు అని చెబుతుంది స్వప్న. మరోవైపు మమ్మీ ఇది జరగని పని అని అంటాడు నిరుపమ్. దీంతో ఏంట్రా జరగని పని. శోభను నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంతే.. అంటుంది స్వప్న. దీంతో శోభ కూడా నీకు నా ద్వారానే పరిచయం అయింది.. అంటాడు నిరుపమ్. మీరు పెద్దలుగా పెద్దమనుషులుగా నా పెళ్లి విషయంలో దీవించాలి అంతే కానీ.. నా పెళ్లి విషయంలో మీరు కలుగజేసుకోకండి అంటాడు నిరుపమ్. మీరేం మాట్లాడరేం. మీకేం బాధ్యత లేదా. వాడు అలా మాట్లాడుతుంటే మీరేం చెప్పరా అని అడుగుతుంది స్వప్న.
దీంతో నా బాధ్యతలను ఎవరు పట్టించుకున్నారు అని అంటాడు సత్యం. మీరు మారరు అంటుంది స్వప్న. వాళ్ల పెళ్లి నిర్ణయాన్ని వాళ్లకే వదిలేద్దాం అంటాడు సత్యం. దీంతో కరెక్ట్ డాడీ అంటాడు నిరుపమ్. ఇది నా జీవితం. నా జీవితాన్ని నాకు కాబోయే భార్యను నువ్వెలా డిసైడ్ చేస్తావు. ఇది తప్పు కాదా అంటాడు నిరుపమ్.
దీంతో అవును స్వప్న.. ఈ టాపిక్.. ఇంతటితో వదిలేద్దాం అంటాడు సత్యం. దీంతో స్వప్నకు ఏం అర్థం కాదు. మీ బోడి సలహాలు నాకు అవసరం లేదు. మీరు సైలెంట్ గా ఉండండి.. అంటుంది స్వప్న. మిమ్మల్ని ఇంటికి రానివ్వడమే వేస్ట్ అని అంటుంది.
నా మాట విని శోభను పెళ్లి చేసుకో. రెండు వారాల్లో పెళ్లి అని అంటుంది స్వప్న. దీంతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెబుతున్నాను కదా అంటాడు నిరుపమ్. అయినా కూడా స్వప్న వినదు. దీంతో నిరుపమ్ కు కోపం వస్తుంది. అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతాడు.
మరోవైపు హాస్పిటల్ లో హిమ ఉంటుంది. ప్రేమ్ అక్కడికి వస్తాడు. అతడిని చూసి బావ రా కూర్చో అంటుంది హిమ. ఏంటి బావ చాలా రోజులకు వచ్చావు అని అడుగుతుంది. దీంతో నువ్వు రావట్లేవు కదా హిమ అని అడుగుతాడు. దీంతో నాకు తీరిక లేదు అంటుంది హిమ.
మన అనుకునే వాళ్ల కోసం మనం కొంచెం టైమ్ కేటాయించాలి అని అంటుంది. మామయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది. నేను ఎలా ఉన్నా అని అడగవా అని అంటాడు. దీంతో నీకేమైంది. ఆరోగ్యం బాగోలేదా అని అడుగుతుంది. దీంతో మనసు బాగోలేదు అని మనసులో అనుకుంటాడు.
బావ.. నీతో మాట్లాడుతున్నప్పుడు పేషెంట్స్ వస్తే నువ్వు అస్సలు ఫీల్ అవ్వకూడదు. హాస్పిటల్ కొంచెం బిజీగా ఉంది అని అంటుంది హిమ. దీంతో నువ్వు మారిపోయావు అంటాడు ప్రేమ్. అవునా బావ. చాలామంది అదే అంటున్నారు అంటుంది హిమ.
ఇంతలోనే మీ ఫోన్ బాగయింది అని ఓ వ్యక్తి తీసుకొచ్చి ఇస్తాడు. కాకపోతే ఫోన్ లోని వీడియోలు, ఫోటోలు అన్నీ పోయాయి అని అంటాడు. దీంతో ఆ వీడియోను హిమ చూడలేదని సంతోషిస్తాడు ప్రేమ్. ఆ తర్వాత నిరుపమ్.. సత్యం ఇంటికి వచ్చేస్తాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన జ్వాల కూడా సంతోషిస్తుంది. అన్నీ సర్దుకున్నాక మళ్లీ అందరూ కలిసిపోతారు అని చెబుతుంది జ్వాల. ఇంతలో అక్కడికి శోభ కూడా వస్తుంది. ఇక ముందు మీ ప్యామిలీ అందరూ కలిసే ఉంటారు అంకుల్ అంటుంది శోభ.
అక్కడికి స్వప్న కూడా వస్తుంది. స్వప్నను చూసి అందరూ షాక్ అవుతారు. ఇది కలా నిజమా అని ప్రేమ్ అంటాడు. రేయ్.. నువ్వు మీ డాడీ ఒకచోట.. నేను నిరుపమ్ ఇంకోచోట.. పంతం పట్టింపు నా మాటే చెల్లాలన్న పెంకితనం ఇన్నాళ్లు గడిచాయి.. అంటుంది.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్‌లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.