Karthika Deepam 7 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 మే 2022, శనివారం ఎపిసోడ్ 1346 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చెత్త పేపర్లు తీసుకొని వెళ్తూ.. తనను ఫాలో చేద్దామని అనుకుంటుంది జ్వాల కానీ.. తనను ఫాలో చేయడం కుదరదు. ఇంతలో జ్వాల బొమ్మను చెత్త ఏరుకునే వ్యక్తి చూసి షాక్ అవుతాడు. మరోవైపు నిరుపమ్ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు. తన మమ్మీ డాడీని ఎలా కలపాలా అని ఆలోచిస్తూ ఉంటాడు నిరుపమ్. ఇంతలో జ్వాల ఫోన్ చేస్తుంది. ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. రెస్టారెంట్ లో ఉన్నా అంటాడు నిరుపమ్. ఇంతలో స్వప్న రెస్టారెంట్ కు వస్తుంది.
ఏంట్రా ఇక్కడికి రమ్మన్నావు అంటుంది స్వప్న. ఏంటి.. నేనిలా అరుస్తానని రెస్టారెంట్ హాల్ మొత్తం బుక్ చేశావా.. అందరం అనేది వద్దు. అందరిలో మీ డాడీ, మీ అమ్మమ్మ లేకపోతేనే నాకు ఇష్టం. నిరుపమ్.. నువ్వు ఎందరిని పిలుసుకున్నా పర్వాలేదు కానీ.. వాళ్లు మాత్రం రావడానికి వీలు లేదు అంటుంది స్వప్న. ఎవ్వరూ వద్దు అనుకుంటే ఎలా మమ్మి అంటాడు నిరుపమ్. దీంతో నాకు ఏం చెప్పొద్దు అంటుంది స్వప్న. నేను వెళతాను ఇక అంటుంది స్వప్న. దీంతో కూర్చో.. కాస్త మంచినీళ్లు తాగు అంటాడు నిరుపమ్. అందరి సంగతి ఏంటో కానీ.. నేను పూర్తిగా నీ మనసును అర్థం చేసుకున్నాను అంటాడు నిరుపమ్.
ఇంతలో సత్యం, జ్వాల ఇద్దరూ అక్కడికి వస్తారు. వాళ్లను చూసి స్వప్న షాక్ అవుతుంది. వాళ్లు రాగానే.. మీరు మీరు మాట్లాడుకోండి.. నేను వెళ్తాను అంటుంది స్వప్న. ఇలా ఆటో వాళ్లతో నీకు ఫ్రెండ్ షిప్ నచ్చుతుందేమో కానీ.. నాకు ఒళ్లు కంపరంగా ఉంటుంది అంటుంది స్వప్న.
నాకు నీ మీద కోపం. నీ లాంటి వాళ్లతో భోజనాలు తెప్పించుకొని తింటున్నవారి మీద కోపం అంటుంది స్వప్న. ఈరోజు మీ మ్యారేజ్ డేనా.. పెళ్లి రోజులు శుభాకాంక్షలు సార్ అంటుంది జ్వాల. ఏంటి మేడమ్ అలా చూస్తున్నారు అంటుంది. నేను ఎలా ఛూస్తే నీకెందుక అంటుంది స్వప్న.
మీకు శుభాకాంక్షలు చెప్పలేదని కోపంగా ఉందా అంటుంది. దీంతో నీ శుభాకాంక్షలు నాకేమీ అవసరం లేదు అంటుంది స్వప్న. మేడమ్.. ఇందాక ఆటో వాళ్లు.. స్థాయి అన్నారు కదా. మా బస్తీలో మొన్న ఒకరికి మ్యారేజ్ డే అయింది. మీలాగా ధనవంతులు కాదు. భార్యాభర్తలు ఇద్దరూ కూలీ పని చేసుకుంటారు అంటుంది.
ఇద్దరూ మ్యారేజ్ డేను చేసుకున్నారు. అందరికీ బిర్యానీ పెట్టారు. అందరూ సంతోషించారు. పాపం.. మీరూ ఉన్నారు. ఏం లాభం. అన్నీ ఉన్నా.. ఏం లేని పేదవాళ్లు అంటుంది జ్వాల. మీరిలాగే ఉంటారు. డబ్బులు ఉంటాయి కానీ.. మనసు ఉండదు అంటుంది జ్వాల.
పెద్ద పెద్ద ఇళ్లు ఉంటాయి కానీ.. అందరూ కలిసి ఉండరు. పెళ్లి రోజు వస్తుంది. కానీ కలుసుకోరు.. ఫంక్షన్ చేసుకోరు అంటుంది జ్వాల. మీ పెళ్లి రోజు సత్యం సార్ ఒకచోట.. మీరు ఒక చోట ఉండండి. రెండు కేకులు తెప్పించుకొని కట్ చేసుకోండి అంటుంది జ్వాల.
దీంతో నీకెందుకు.. నువ్వెంత.. నీ బతుకెంత అంటుంది. దీంతో మీ దృష్టిలో మేము చిన్నోళ్లమే. మేము చేసుకునే సంతోషాలను మీరు చేసుకోలేరు కదా. సత్యం సార్ తో కలిసి మ్యారేజ్ డే చేసుకుంటే మీరెక్కడ కలిసిపోతారేమోనని మీ భయం కదా.
కలిస్తే బంధం కలుస్తుందని లోపల భయం. అందుకే దూరంగా ఉంటారు అందుకే కలవరు. నాకేంటి భయం. నేనెలా ఉంటానో నువ్వెలా చెబుతావు అంటుంది స్వప్న. దీంతో గుడిలో నన్ను కొట్టినప్పుడే నాకు అర్థం అయిపోయింది.. అంటుంది జ్వాల.
నాకేం భయం లేదు. నా మనసు, నా ఆలోచన నా కంట్రోల్ లో ఉంటాయి అంటుంది స్వప్న. దీంతో అన్నీ ఉత్తుత్తి మాటలు చెబుతారు అంటూ రెచ్చగొడుతుంది జ్వాల. మీ మ్యారేజ్ డే ఫంక్షన్ ను నేను బస్తీలో చేస్తాను అంటుంది జ్వాల. దీంతో ఆయన్ను బస్తీకి తీసుకెళ్తావా షటప్ అంటుంది.
నువ్వేంటే ఫిక్స్ చేసేది. నేను ఫిక్స్ చేస్తున్నాను. మా మ్యారేజ్ డే ఫంక్షన్ నా కొడుకు చేస్తాడు. ఇద్దరికీ కలిపి చేస్తాడు. ఇది ఫిక్స్ అంటుంది స్వప్న. దీంతో నిరుపమ్ సంతోషిస్తాడు. ఏంటి అలా చూస్తున్నారు. వెళ్లండి దీంతో కాఫీ తాగండి అంటుంది స్వప్న.
ఆ ఏర్పాట్లేవో చూడు అని చెప్పి స్వప్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జ్వాలకు థాంక్స్ చెప్పి.. ఆ ఫంక్షన్ కు వచ్చాక నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను అంటాడు నిరుపమ్. కట్ చేస్తే.. హాస్పిటల్ కు వచ్చి నిరుపమ్.. స్వప్న.. మ్యారేజ్ డే ఫంక్షన్ కు ఒప్పుకున్న విషయం హిమకు చెబుతాడు.
జ్వాల వల్లనే ఇదంతా జరిగింది అంటాడు నిరుపమ్. జ్వాలను కూడా మ్యారేజ్ డే ఫంక్షన్ కు రమ్మన్నాను అంటాడు నిరుపమ్. దీంతో హిమ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.