Karthika Deepam 7 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 1503 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్య రానని ఎంత మొత్తుకున్నా కూడా ఆనంద రావు వినడు. వెళ్దాం అంటాడు. బలవంతంగా తనను కారులో హైదరాబాద్ తీసుకెళ్తుంటాడు. నేను రాను.. ఇక్కడే బాబాయి వాళ్ల దగ్గరే ఉంటాను అంటుంది శౌర్య. అమ్మానాన్న ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ తాతయ్య. నన్ను వదిలేయండి అంటుంది శౌర్య. కానీ.. ఆనంద రావు అస్సలు వినడు. మరోవైపు దీప, కార్తీక్ ఇద్దరూ ఆటో కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఆనంద రావు, శౌర్య ఉన్న కారు అటుగా వెళ్తుంది. ఆ కారును ఇంద్రుడు కూడా ఆటోలో వెంబడిస్తుంటాడు. ఇంతలో బాబాయి అంటూ బయటికి చూసి పిలుస్తుంది శౌర్య. దీంతో డాక్టర్ బాబు ఆ గొంతు శౌర్యదే. డాక్టర్ బాబు కారు ఆపండి. శౌర్య కారులో ఉంది అంటుంది దీప.
ఆ కారు వెనుక పరిగెడుతారు దీప, కార్తీక్ కానీ.. కారు మాత్రం ఆగదు. దీంతో ఆ ఆటో ఇంద్రుడిదే. మోనిత, ఇంద్రుడు ఇద్దరూ కలిసి శౌర్యను ఎక్కడికో తీసుకెళ్తున్నట్టున్నారు. మోనిత ఎందుకు ఇలా చేస్తోంది అని అనుకుంటారు. నువ్వు టెన్షన్ పడకు. మనం డైరెక్ట్ గా ఇంద్రుడు ఇంటికే వెళ్దాం అని అంటాడు కార్తీక్. ఇంతలో కారును ఆటోతో అడ్డగించి కారును ఆపుతాడు ఆనంద రావు. దీంతో కారు దిగి ఇంద్రుడు దగ్గరికి వెళ్తుంది శౌర్య. ఆగు తాతయ్య. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా బాగుండదు. అమ్మానాన్నలు ఇక్కడే ఉన్నారు. అమ్మానాన్నలు కనిపించేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నేను రాను అని చెప్పి ఇంద్రుడుతో కలిసి ఆటోలో వెళ్లిపోతుంది శౌర్య. అమ్మానాన్నలు ఇక్కడే ఉన్నారు లేకపోతే మనం ఊరు వదిలి వెళ్లిపోయేవాళ్లం అని అంటుంది శౌర్య.
అమ్మానాన్నలు ఇక్కడ లేరేమో అంటాడు. అమ్మానాన్నలు సంగారెడ్డిలో ఉన్నారేమో. అప్పుడు మనకు అక్కడ కనిపించారు కదా. సంగారెడ్డి వెళ్లి వెతుకుదాం ఏమంటావు అని అంటాడు ఇంద్రుడు. దీంతో నిజమే బాబాయి. అక్కడే ఉండి అమ్మానాన్నలను వెతుకుదాం అంటుంది శౌర్య. దీంతో సరే అంటాడు ఇంద్రుడు.
మరోవైపు మోనిత.. దీప ఇంటికి వస్తుంది. అక్కడ చూస్తే తన ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఎక్కడికి వెళ్లింది అని అనుకుంటుంది మోనిత. ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటుండగా నీ బాధ పడలేక లేచిపోయారు అంటాడు దుర్గ. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా అంటుంది మోనిత.
నిజం.. ఇద్దరూ లేచిపోయారు అంటాడు. పరాయి ఆడదాని భర్తను నువ్వు వశం చేసుకోవాలని చూడగా లేనిది.. భార్యాభర్తలు ఇద్దరూ లేచిపోతే తప్పేంటి అంటాడు. నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా డాక్టర్ బాబుకు గతం గుర్తొచ్చేసింది అంటాడు. దీంతో మోనిత షాక్ అవుతుంది.
మరోవైపు ఇంద్రుడు ఇంటికి వెళ్తారు కార్తీక్, దీప. అక్కడ తాళం వేసి ఉంటుంది. దీంతో ఎక్కడికి వెళ్లారు అని పక్కింటి వాళ్లను అడుగుతారు. దీంతో ఇంట్లో వాళ్లంతా ఇప్పుడే బయటికి వెళ్తారు అంటాడు. సామాన్లు కూడా తీసుకెళ్లారా అని అడుగుతారు. దీంతో లేదు.. వాళ్లే వెళ్లారు అంటాడు.
అక్కడే అమ్మానాన్నలు ఎక్కడున్నారు అని రాసి ఉన్న పేపర్ అక్కడే పడేస్తారు. దాన్ని చూసి షాక్ అవుతారు. అంటే శౌర్య వీళ్ల దగ్గరే ఉంది. అందుకే మనం వెళ్లిపోదాం. వాళ్లు మనం ఇక్కడ ఉన్నది చూసి అట్నుంచి అటే వెళ్లిపోతారు. అందుకే.. మనం ఉదయమే వచ్చి మాట్లాడుదాం పదా అంటుంది దీప. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు దీప, కార్తీక్.
మరోవైపు ఆనందరావు, హిమ చాలా బాధపడతారు. వాళ్లకు పిల్లలు లేరు కదా. శౌర్యను వాళ్ల దగ్గరే ఉంచేయాలని అనుకుంటున్నారేమో అని అంటాడు ఆనంద రావు. మరి ఇప్పుడు ఏం చేద్దాం తాతయ్య అంటుంది హిమ. దీంతో మీ నానమ్మ రెండు రోజుల్లో వస్తుంది కదా. అప్పుడు వీళ్ల సంగతి చూద్దాం అంటాడు ఆనంద రావు.
కార్తీక్ కు గతం తెలిసిందా అని టెన్షన్ పడుతుంది మోనిత. ఆ దుర్గ గాడు అబద్ధం చెబుతున్నాడు అని అనుకొని వెంటనే కార్తీక్ ఫోన్ చేస్తుంది మోనిత. కానీ.. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయడు. అంటే కార్తీక్, దీప ఇద్దరూ లేచిపోయారా. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటుండగానే కార్తీక్ వస్తాడు.
ఉదయం లేవగానే ఇంద్రుడు ఇంటికి వెళ్తారు. కానీ.. అప్పటికే ఇల్లు ఖాళీ చేసి సంగారెడ్డి వెళ్లిపోతారు ఇంద్రుడు ఫ్యామిలీ. అక్కడే ఉన్న శౌర్య ఫోటోను చూసి షాక్ అవుతారు దీప, కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.