Karthika Deepam 8 April Today Episode : జ్వాలే శౌర్య అని పచ్చబొట్టు ద్వారా తెలుసుకున్న హిమ.. ఇంతలో హిమకు భారీ షాక్
Karthika Deepam 8 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 ఏప్రిల్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 1321 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందరికీ భోజనాలు తీసుకొని క్యాంపునకు వస్తుంది జ్వాల. నాకు ఈ చీర కొత్తగా ఇబ్బందిగా ఉంది అని చెబుతుంది. ఇప్పుడు నాకు అర్థం అయింది. నీకు చీర కట్టుకోవడం నిజంగా కొత్తే అని అంటాడు నిరుపమ్. ఇక.. మెడికల్ క్యాంపు పని చూద్దామా అంటుంది హిమ. ఇంతలో శౌర్య గురించి ఏదైనా ఆచూకీ దొరికితే బాగుండు అని అనుకుంటుంది హిమ. ఆ తర్వాత పేషెంట్లను చూస్తారు హిమ, నిరుపమ్.
మరోవైపు ప్రేమ్ ఫోటోలు తీస్తూ ఉంటాడు. నువ్వు ఎవరి ఫోటోలను తీస్తున్నావు. ఆ తింగరివే కదా అంటుంది జ్వాల. తనవి నేనెందుకు తీస్తాను అంటాడు ప్రేమ్. ఆటో నడుపుతున్నాను కదా అని నన్ను లైట్ తీసుకోకు అంటుంది జ్వాల. దీంతో అసలు ఈ మెడికల్ క్యాంపుతో మనకు ఏ సంబంధం లేదు కదా.. నువ్వు వెళ్లి అక్కడ బ్లడ్ డొనేట్ చేసిరా అంటాడు ప్రేమ్. దీంతో పదా వెళ్దాం ఇద్దరం కలిసి రక్తదానం చేద్దాం అంటుంది జ్వాల. ప్రేమ్ నుంచి హిమ రక్తం తీస్తుంది. తర్వాత ఇద్దరూ రక్తం ఇస్తారు. మరోవైపు మెడికల్ క్యాంపు ముగుస్తుంది కానీ.. శౌర్య ఆచూకీ మాత్రం హిమకు తెలియదు. ఎవ్వరిని అడిగినా హిమకు శౌర్య గురించి తెలియదు.
రక్తం ఇచ్చాక కూర్చుంటుంది జ్వాల. తన చేతికి ఉన్న హెచ్ అనే అక్షరాన్ని చూస్తాడు నిరుపమ్. ఎవరి పేరు అని అడుగుతాడు. ఏం లేదు అంటుంది జ్వాల. చేతి మీద హెచ్ అనే పచ్చబొట్టు ఉందంటే.. ఎవరిది అనుకోవాలి జ్వాల అంటాడు ప్రేమ్.
అప్పుడే ఆ విషయాన్ని వింటుంది హిమ. విని షాక్ అవుతుంది. హెచ్ అనే పచ్చబొట్టు జ్వాల చేతి మీద ఉండటం ఏంటి. అంటే.. జ్వాలే శౌర్యనా.. అని అనుకుంటుంది హిమ. ఏంటి జ్వాల ఆ హెచ్ ఎవరిదో చెప్పడం లేదంటే.. కొంపదీసి నీ లవర్ పేరు ఏదైనా అంటాడు ప్రేమ్.
ఇన్నాళ్ల నా కల నెరవేరింది.. నేనే హిమను అని శౌర్యకు చెప్పేస్తాను అని అనుకుంటుంది హిమ. ఇంతలోనే ఆ హెచ్ అనే అక్షరం నా శత్రువుది అంటుంది శౌర్య. శత్రువు పేరులో నుంచి అక్షరాన్ని పచ్చబొట్టు వేయించుకున్నావా అంటే వేయించుకోవాల్సి వచ్చింది అంటుంది శౌర్య.
Karthika Deepam 8 April Today Episode : ఇది పచ్చబొట్టు కాదు.. నా జీవితంలో మానిపోని గాయం అని చెప్పిన శౌర్య
ఇది పచ్చబొట్టు కాదు.. నా జీవితంలో మానిపోని ఒక గాయం అంటుంది శౌర్య. అంతగా ఏం తప్పు చేశారు అంటే.. తప్పు కాదు.. ద్రోహం అంటుంది శౌర్య. నా జీవితంలో నుంచి ఆనందాన్ని తీసుకెళ్లిన మనిషి అంటుంది శౌర్య. దీంతో హిమ కుమిలిపోతుంది.
ఏంటి జ్వాల.. నీ వెనుక ఇంత బాధ ఉందా అంటాడు ప్రేమ్. దీంతో బాధ కాదు.. ఆవేశం, ప్రతీకారం అంటుంది శౌర్య. ఎప్పుడు నాకు ఎదురు పడతారా అని ఎదురు చూస్తున్నాను అంటుంది శౌర్య. అంతగా ఏం చేశారు తెలుసుకోవచ్చా అని అడుగుతాడు ప్రేమ్.
మళ్లీ మళ్లీ నేను ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాను డాక్టర్ సాబ్ అంటుంది శౌర్య. నా కోపం ఏంటో నాకు తెలుసు.. నా శత్రువుకు తెలుసు అంటుంది శౌర్య. ఒకవేళ ఎదురుపడితే ఏం చేస్తావు అని అడుగుతాడు నిరుపమ్. దీంతో అప్పుడు ఆ క్షణంలో ఏం చేయాలనిపిస్తే అది చేస్తా అంటుంది శౌర్య.
ఆరోజు నువ్వు ఆటో మీద వదిలేదేలే అని ఎందుకు రాశావని. తనకోసమే అలా రాయించాను. వదిలేదేలే. తనను ఎప్పటికీ వదిలిపెట్టను అంటుంది శౌర్య. ఏంటి రౌడీ లావాలా మండిపోతున్నావు అంటాడు నిరుపమ్. నాలో దాచుకున్న కోపాన్ని నేను చెప్పలేకపోతున్నాను అంటుంది శౌర్య.
నా శత్రువును నేను ఎప్పటికీ వదలను కాక వదలను అంటుంది శౌర్య. దీంతో హిమ వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఏయ్ తింగరి అని పిలుస్తుంది శౌర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.