karthika deepam 8 december 2021 full episode
Karthika Deepam 8 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 డిసెంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 1217 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీప ఇంటికి రాగానే.. తననను హత్తుకొని కార్తీక్.. నన్ను క్షమించు దీప అంటాడు. ఆ తర్వాత తనకు అన్ని విషయాలు చెప్పి… సౌందర్య, ఆనందరావుకు చెప్పకుండా ఇంట్లో నుంచి బ్యాగు పట్టుకొని బయటికి వస్తారు కార్తీక్, దీప, హిమ, శౌర్య. ఏంటి నాన్న.. ఎవ్వరికీ చెప్పకుండా ఇలా సడెన్ గా టూర్ ఏంటి నాన్న అని పిల్లలు అడుగుతారు. వాళ్లకు సర్ ప్రైజ్ ఇస్తున్నామా.. అని అడుగుతారు పిల్లలు. ఎప్పటిలాగే సవాలక్ష ప్రశ్నలు అడుగుతారు. ఇంతలో కార్తీక్ కు మోనిత ఫోన్ చేస్తుంది. మీరు ఇక్కడే ఉండండి.. నేను ఇప్పుడే వస్తాను అంటాడు కార్తీక్.
karthika deepam 8 december 2021 full episode
ఇంతలో అక్కడ ఓ పిచ్చోడు ఉంటాడు. కార్తీక్ ఫోన్ ను అక్కడ పడేస్తాడు. ఫోన్ ను పడేయడం పిచ్చోడు చూస్తాడు. ఇంతలో బస్ వస్తుంది. అందరూ బస్ ఎక్కుతారు. ఇంతలో ఆ పిచ్చోడు వెళ్లి ఆ ఫోన్ ను తీసుకుంటాడు. ఈయనేంటి కావాలని ఫోన్ వదిలేసి వెళ్లాడు. ఎందుకని అని అనుకుంటాడు పిచ్చోడు. కట్ చేస్తే.. ప్రియమణి పడుకొని ఉంటుంది. మోనిత.. ప్రియమణిని లేపుతుంది. ఏంటి అప్పుడే పడుకున్నావు అని అడుగుతుంది. నిద్ర వస్తుంది అమ్మ. టైమ్ ఎంతైంది అమ్మ అంటుంది. ఇప్పుడు టైమ్ ఎంతైంది అని కాదు.. మన టైమ్ బాగుందా లేదా అని అంటుంది. మొత్తం స్టోరీ చెబుతుంది. దీంతో ప్రియమణి షాక్ అవుతుంది. అంటే ఇప్పుడు కార్తీక్.. డాక్టర్ కాదా అంటుంది. కాదు అంటుంది మోనిత. మీ పగ దీపమ్మ మీద కదా.. కార్తీక్ మీద ఎందుకు పగ తీర్చుకుంటున్నారు అని అడుగుతుంది ప్రియమణి.
కార్తీక్ ను జీరోగా మార్చితే చాలు. అదే నా టార్గెట్. కార్తీక్ ఏ పని లేకుండా ఖాళీగా ఉండాలి. అందరూ కార్తీక్ ను ఏం పని చేస్తున్నావు.. అంటూ అడగాలి. ఆ తర్వాత కార్తీక్ ను నేను నా హాస్పిటల్ లో డాక్టర్ గా తీసుకుంటాను. ఆ తర్వాత నా చుట్టూ తిప్పుకుంటాను. దీపకు దూరం చేస్తాను అంటంది మోనిత.
ఉదయం అవుతుంది. ఎలాగైనా కార్తీక్ కు 5 కోట్ల లోన్ ఇప్పించి ఏదైనా బిజినెస్ పెట్టిద్దాం అండి అంటుంది సౌందర్య. దీంతో సరే అంటాడు ఆనంద రావు. దీపకు ఈ విషయం చెబుదామని దీపను పిలుస్తుంది. కానీ.. ఇంట్లో దీప లేదనే విషయం వాళ్లకు తెలియదు. ఎంత పిలిచినా పలకకపోవడంతో.. వాకింగ్ కు వెళ్లారేమో అని అనుకుంటారు.
కానీ.. అక్కడ టేబుల్ మీద పెట్టి ఉన్న లెటర్ ను శ్రావ్య చూస్తుంది. దాన్ని చదివి షాక్ అవుతుంది. సౌందర్య అక్కడికి వచ్చి ఆ లెటర్ ను చదివి ఏడుస్తుంది. మమ్మీ డాడీ.. ఇన్నాళ్లు మిమ్మల్ని ఈ పెద్దోడు ఎన్నో కష్టాలు పెట్టాడు. తప్పు నేను చేశాను శిక్ష మీకు పడింది.. అంటూ లెటర్ రాస్తాడు కార్తీక్.
ఈసారి అలా జరగకూడదని.. నా తప్పులకు నేనే శిక్ష అనుభవించాలని నేనే వెళ్లిపోతున్నాను. నేను కన్నందుకు, కట్టుకున్నందుకు దీప, పిల్లలకు తప్పదు కదా.. ఎక్కడికి వెళ్తానో ఏమౌతానో నాకు తెలియదు. పిల్లలకు తెలియదు. నాకోసం వెతకొద్దు. నాకోసం బాధపడొద్దు. ఉన్నన్ని రోజులు అన్నీ రకాలుగా నా వల్ల మీరు బాధపడ్డారు. జీవితంలో అలసిపోయానో.. ఓడిపోయానో.. నేను ఏమైపోతున్నానో నాకే అర్థం కాని పరిస్థితి.
మమ్మల్ని లెక్కలోకి తీసుకోకండి. మీకు ఒకే కొడుకు అనుకోండి. ఒక్కడే మనవడు దీపూగాడు అనుకోండి. ఒకే కోడలు శ్రావ్య అనుకోండి. నేను ఓడిపోయాను.. అందుకే ఎవరికీ మొహం చూపించలేక.. వెళ్లిపోతున్నాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. శ్రావ్య, ఆదిత్య, దీపూలను బాగా చూసుకోండి. నేను పేరుకే ఈ ఇంటికి పెద్దోడిగా మిగిలాను. నా బాధ్యతలు ఏవీ కరెక్ట్ గా నిర్వర్తించలేదు. ఇట్లు మీకెన్నో తలవంపులు తెచ్చిన నిజంగా పెద్దోడు కాలేకపోయిన మీ పెద్దోడు.
ఇందేట్రా పెద్దోడా ఇది. నువ్వు వెళ్లిపోవడం ఏంట్రా అని వెక్కి వెక్కి ఏడుస్తుంది సౌందర్య. లెటర్ రాసి వెళ్లిపోతే అయిపోతుందా.. ఎక్కడున్నా వెతికి నేను తీసుకొస్తాను అంటాడు ఆదిత్య. ఏదో ఒకటి చేసి అన్నయ్య, వదిన, పిల్లలను మళ్లీ ఇంటికి తీసుకొస్తాను అంటాడు ఆదిత్య.
ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయిన వాళ్లను ఎక్కడని వెతుకుతాం చెప్పండి అంటుంది శ్రావ్య. నిజంగానే పెద్దోడు ఓడిపోయాడండి అంటుంది సౌందర్య. వాడు ఎప్పుడూ ఓడిపోడు. నా పెద్ద కోడలు వాడిని గెలిపిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా.. 11 ఏళ్లు ధైర్యంగా ఒంటరి పోరాటం చేసింది దీప.
ఇప్పుడు కార్తీక్ పక్కన తను ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనా.. చివరకు ఆ ధైర్యంతో అయినా కార్తీక్ కోసం దీప పోరాడుతుంది అంటాడు ఆనంద రావు. మరోవైపు మోనిత.. పిల్లాడిని తీసుకొని సౌందర్య ఇంటికి వస్తుంది. కార్తీక్ ను మీరే ఎక్కడో దాచి అబద్ధం చెబుతున్నారా అని నిలదీస్తుంది.
కట్ చేస్తే.. కార్తీక్, దీప, పిల్లలు ఓ ఊరికి వెళ్తారు. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని పని కోసం వెతుకుతుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
This website uses cookies.