
Will that serial compete with Karthika Deepam TRP rating
Karthika Deepam 8 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 జూన్ 2022, బుధవారం ఎపిసోడ్ 1373 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్వాల.. సత్యం కోసం లంచ్ బాక్స్ తేవడంతో ఇక నుంచి లంచ్ బాక్స్ తేవొద్దని స్వప్న అంటుంది. అవును అమ్మ. మేమంతా కలిసి పోయాం కదా.. ఇక నుంచి లంచ్ బాక్స్ లు తేవడం ఆపేయ్ అంటాడు సత్యం. దీంతో సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల. ఇంతలో అక్కడికి హిమ కారులో వస్తుంది. ఏయ్ జ్వాల నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. దీంతో సత్యం సార్ వాళ్లకు లంచ్ బాక్స్ తెచ్చాను ఆఖరి సారి అంటుంది జ్వాల. దీంతో ఆఖరిసారి ఏంటి అని అడుగుతుంది. దీంతో లోపల జరిగిన విషయం చెబుతుంది. దీంతో హిమ షాక్ అవుతుంది. ఇంతలో వాళ్ల దగ్గరికి శోభ వస్తుంది.
karthika deepam 8 june 2022 full episode
గుడ్ న్యూస్ తెలిసింది అనుకుంట.. మీ వల్ల కానిది ఈ శోభ చేసి చూపించింది.. అంటుంది శోభ. ఇంకా ముందు ముందు చాలా చేయబోతున్నాను అంటుంది శోభ. వాళ్ల కుటుంబాన్ని కలిపాను. ఆ కుటుంబానికే కోడలుగా వెళ్తాను అంటుంది శోభ. ఏంటి.. మాట్లాడటం లేదు. చెంపదెబ్బ కొడితే దానికి ప్రతీకారం చెంపదెబ్బ కొట్టడం కాదు.. అంటుంది శోభ. ఇలా దెబ్బకొట్టడం ఈ శోభాదేవి స్టయిల్ అంటుంది శోభ. ఒకవైపు నీ లంచ్ బాక్స్ కట్. మరోవైపు నీ కనెక్షన్ కూడా కట్ అవుతుంది అంటుంది శోభ. ఏంటిది ఈ శోభ ఏదేదో మాట్లాడుతోంది అని అనుకుంటుంది జ్వాల. హలో ఆటో వాలా.. ఏమైంది మాటలు లేవు.. మాటలు రావా అంటుంది శోభ. దీంతో జ్వాల వద్దు అంటుంది హిమ. మీ ఇద్దరి మధ్య మంచి సహకారమే ఉందే అని అంటుంది. ఇంతలో స్వప్న వస్తుంది. శోభాదేవి నా మనసుకు నచ్చింది. మా కుటుంబాన్ని ఒకటి చేసింది. రేపు మా కుటుంబంలోకి రాబోతోంది అని అంటుంది స్వప్న.
చెప్పు.. మీ నానమ్మకు. స్వప్న ఆంటి చాలెంజ్ ను నిలబెట్టుకుంటుంది అని. ఇప్పుడు చెప్పండి అమ్మాయిలు.. వాట్ టు డూ.. వాట్ నాట్ టు డు అంటుంది స్వప్న. అన్నీ మరిచిపోయి నువ్వు హాస్పిటల్ చూసుకో. నువ్వు ఆటో తోలుకో. అన్నట్టు మరిచిపోయాను. లోపల ఉన్న నీ లంచ్ బాక్స్ లు మరిచిపోకుండా తీసుకెళ్లు.
ఇల్లు షిష్ట్ చేసినప్పుడు అవసరం అయితే నీ ఆటోనే పిలుస్తాను. అవసరం అయితే అద్దెకు వద్దువు కానీ… అంటుంది స్వప్న. కట్ చేస్తే.. హాస్పిటల్ లో దిగులుగా కూర్చొని ఉంటుంది హిమ. మరోవైపు జ్వాల మాత్రం ఫోన్ లో ఏదో చూస్తూ కూర్చుంటుంది.
ఏంటి తింగరి నువ్వు ఆ మధ్య చాలా ధైర్యంగా కనిపించావు. మళ్లీ ఏమైంది నీకు అని అడుగుతుంది జ్వాల. దీంతో ఏం లేదు అంటుంది తింగరి. నీకో విషయం తెలుసా. డాక్టర్ సాబ్ అంటే నాకు ఎంత ఇష్టమో.. అంతకంటే ఎక్కువ నేనంటే డాక్టర్ సాబ్ కు ఇష్టం.
నన్ను ఎలా పొడుగుతారో తెలుసా. ఏ జ్వాల నువ్వు మా ఫ్యామిలీ కోసమే పుట్టావు అన్నారు ఒకసారి అంటుంది జ్వాల. నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.. అని మనసులో అనుకుంటుంది తింగరి. నీకో విషయం చెబితే ఫీల్ అవుతావో.. షాక్ అవుతావో తెలియదు కానీ.. చెప్పనా అంటుంది జ్వాల.
ఇప్పుడు నువ్వు వెళ్లి డాక్టర్ సాబ్ కు ఐలవ్యూ చెప్పినా డాక్టర్ సాబ్ నో అంటారు తెలుసా అంటుంది జ్వాల. షాక్ తిన్నావు కదా.. నాకు తెలుసు అంటుంది జ్వాల. సారీ తింగరి.. నేను ఇలా అన్నానని వేరేగా అనుకోకు. డాక్టర్ సాబ్ మనసులో నేను ఎంత గొప్పగా ఉన్నానో నీకు చెప్పాను అంతే అంటుంది జ్వాల.
ఇంతలో జ్వాలకు డాక్టర్ సాబ్ ఫోన్ చేస్తాడు. డాక్టర్ సాబ్ రమ్మనడంతో ఎగిరి గంతేస్తుంది. ఏదో విషయం మాట్లాడాలి అన్నారు. ఇంకేం అయి ఉంటుంది. మా ఇద్దరి ప్రేమ గురించి మాట్లాడటానికే రమ్మని ఉంటారు అని అంటుంది జ్వాల. డాక్టర్ సాబ్ నాతో మాట్లాడేటప్పుడు నువ్వు ఉంటే బాగుండదు కదా.. నువ్వు వద్దులే అంటుంది జ్వాల.
వద్దు నేను కూడా వస్తాను అంటుంది హిమ. దీంతో ఈరోజు చాన్స్ దొరికింది నాకు. వెళ్లి ఐలవ్యూ అని చెప్పేస్తా తింగరి అంటుంది జ్వాల. దీంతో ఈ ఒక్కసారికి నేను వస్తాను అంటుంది హిమ. మీరిద్దరు తర్వాత కాసేపు పర్సనల్ గా మాట్లాడుకోండి అంటుంది హిమ.
ఇద్దరు లవర్స్ కలుసుకుంటామంటుంటే నువ్వు వస్తా అంటున్నావేంటి. నువ్వు నిజంగా తింగరివే అంటుంది జ్వాల. కాసేపు అలా బయటికి వద్దామని అన్నా అంటుంది. దీంతో సరే రా అంటుంది జ్వాల. మరోవైపు శోభ, స్వప్న.. ఇద్దరూ కారులో వెళ్తూ.. నిరుపమ్ గురించే మాట్లాడుకుంటారు.
మరోవైపు జ్వాల, హిమ ఇద్దరూ రోడ్డు మీద మాట్లాడుకుంటూ ఉండటం కారులో నుంచి చూస్తుంది శోభ. వెంటనే కారు ఆపుతుంది. తర్వాత కారులో హిమ, జ్వాల ఇద్దరూ వెళ్లిపోతారు. మరోవైపు అనాథ ఆశ్రమంలో జ్వాల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నిరుపమ్.
హిమను చూసి తనెందుకు వస్తోంది అని అనుకుంటాడు నిరుపమ్. చెప్పండి డాక్టర్ సాబ్ ఏంటి సంగతులు అని అడుగుతుంది జ్వాల. దీంతో నేను అమెరికా వెళ్దామనుకుంటున్నాను అంటాడు నిరుపమ్. ఆ తర్వాత తనకు క్యాన్సర్ అనే నిజాన్ని హిమ.. నిరుపమ్ కు చెబుతుంది. దీంతో నిరుపమ్ ఏం చేస్తాడు? ఏం నిర్ణయం తీసుకుంటాడో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.