karthika deepam 8 november 2021 full episode
Karthika Deepam 8 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 8 నవంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 1191 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సౌందర్యపై ఆనందరావు ఫైర్ అవుతాడు. నువ్వు ఏం చేస్తున్నావు సౌందర్య. మోనిత ఇంటికి వెళ్లడం ఏంటి. దీపను ఏం చేద్దాం అని అనుకుంటున్నావు. ఇంత రాత్రి వేళ మోనిత ఇంటికి వెళ్లి వస్తే దీప ఏమనుకుంటుంది చెప్పు. వాడు చేసిన నిర్వాకం వాడు చేశాడు. దాన్ని కప్పిపుచ్చడానికి నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావా? అంటూ సౌందర్యపై ఆనందరావు సీరియస్ అవుతాడు. నువ్వు వెళ్లగానే తను వస్తుందని అనుకుంటున్నావా? అంటూ సౌందర్యతో ఆనందరావు అంటాడు. ఇవన్నీ దీప వేరే రూమ్ లో నుంచి వింటూ ఉంటుంది. ఏం చేయాలో తనకు అర్థం కాదు.
karthika deepam 8 november 2021 full episode
ఉదయం అవగానే పిల్లలు నిద్రలేస్తారు. ఇంతలో దీప వస్తుంది. నాన్న ఎక్కడమ్మా. నాన్న మాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఏం అడిగినా చెప్పడం లేదు అంటూ దీపతో చెబుతారు. సరే.. ముందు లేచి రెడీ అవ్వండి. స్కూల్ కు వెళ్లాలి అంటుంది. అమ్మా.. నువ్వు ఎందుకు రాత్రి ఇక్కడ పడుకోలేదు చెప్పు అని ప్రశ్నిస్తుంది హిమ. అదంతా రాత్రే అయిపోయింది కదా ముందు లేవండి.. పిచ్చిపిచ్చి ప్రశ్నలు ఆపండి అంటుంది.
ఏమైందండి.. మీరైనా చెప్పండి. దోష నివారణ పూజకు రమ్మని అంటే రానంటున్నాడండి అంటుంది సౌందర్య. దోషం చేయడం ఎందుకు. దాని నివారణ పూజ ఎందుకు అంటూ హేళనగా మాట్లాడుతాడు ఆనందరావు. అన్నీ సిద్ధం చేశాను.. ఇప్పుడు వాడు రానంటున్నాడు. మీకూ బాధ్యత ఉంది కదండి అంటుంది సౌందర్య. అవును.. బాధ్యత ఉంటుంది. వాడి తప్పులకు కూడా మన మీద బాధ్యత ఉంటుంది. దీప బాధ్యత కూడా మనదే కదా సౌందర్య.. అంటాడు ఆనందరావు.
సౌందర్య.. ఈ గొడవలోకి నన్ను లాగకు.. అంటాడు ఆనందరావు. వాడేదో ఘనకార్యం చేశాడని గుడికి వెళ్లరా పెద్దోడా అనాలా.. నావల్ల కాదు సౌందర్య అంటాడు. ఇంతలో కార్తీక్ వచ్చి.. మమ్మీ మోనిత చెప్పిందే నిజం అని నమ్ముతున్నావా? అంటాడు కార్తీక్. ఆ మోనిత చెప్పిందే నిజం అని నువ్వు ఎలా నమ్ముతున్నావు. అది అబద్ధం అయి ఉండొచ్చు కదా.. అంటాడు. కరెక్టే కానీ.. ఒకవేళ నిజం అయితే ప్రాణగండం కూడా నిజమే అవుతుంది కదా. నా కోసం ఈ పూజకు రారా.. ప్లీజ్ అంటుంది సౌందర్య. దానివైపు చూడకు.. దాన్ని పట్టించుకోకురా. దీప, పిల్లలు ఏమైపోతారో ఆలోచించరా అంటుంది సౌందర్య.
కట్ చేస్తే మోనిత.. దోష నివారణ పూజకు రెడీ అవుతుంది. ప్రియమణిని పిలిచి ఎలా ఉన్నాను అని అడుగుతుంది. మీకేంటమ్మా.. మీరెప్పుడూ బాగానే ఉంటారు అంటుంది. సరే.. పదా ఆనందరావు గాడిని తీసుకురా అంటుంది. అవును.. బాబును చూస్తే కార్తీక్ కు ఏమనిపిస్తుంది అంటావు అంటుంది. ప్రాణం కొట్టుకుంటుంది కదా అమ్మా.. పేగు బంధం కదా అమ్మ అంటుంది మోనిత. ఆ పేగుబంధమే ఇదంతా నడిపిస్తుంది అంటుంది మోనిత. ఆ తర్వాత తాళిని తీసుకొని మెడలో వేసుకుంటుంది మోనిత. తాళిని మెడలో వేసుకోవడం చూసి ప్రియమణి షాక్ అవుతుంది. అదేంటమ్మా.. అలా చేస్తున్నారు.. అంటుంది. పూజకు వెళ్తున్నాం కదా.. పూజ సమయంలో తాళి లేకుండా ఉంటే ఎలా అని అంటుంది మోనిత.
karthika deepam 8 november 2021 full episode
మరోవైపు పిల్లలను స్కూల్ కు రెడీ చేస్తుంటుంది దీప. తనను చూసి బాధపడతాడు ఆనందరావు. దీప జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని బాధపడతాడు. వాళ్లను రెడీ చేసి స్కూల్ కు తీసుకెళ్తుంది దీప. మరోవైపు పూజ కోసం కార్తీక్, సౌందర్య.. ఇద్దరూ కారులో బయలుదేరుతారు.
మోనితతో కలిసి దోషనివారణ పూజలో కూర్చుంటాడు కార్తీక్. అదే దారిలో వెళ్తున్న దీప.. సౌందర్య కారును చూసి షాక్ అవుతుంది. గుడి దగ్గర కారు ఆపి.. లోపలికి వెళ్తుంది. కార్తీక్, మోనిత ఇద్దరూ పూజ చేయడం చూసి షాక్ అవుతుంది. బయటికి వచ్చిన పంతులును అడుగుతుంది. దీంతో దోషనివారణ పూజ చేయిస్తున్నారని చెప్పడంతో షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
This website uses cookies.