Karthika Deepam 9 Dec Today Episode : ఒక ఊరికి వెళ్లి పని కోసం తిరుగుతున్న కార్తీక్, దీప.. రుద్రాణి రూపంలో దీపకు అనుకోని ఆపద | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam 9 Dec Today Episode : ఒక ఊరికి వెళ్లి పని కోసం తిరుగుతున్న కార్తీక్, దీప.. రుద్రాణి రూపంలో దీపకు అనుకోని ఆపద

Karthika Deepam 9 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 డిసెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 1218 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ తన భార్య, పిల్లలతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. లెటర్ చదివి ఏడుస్తారు. కానీ.. వాడి పక్కన దీప ఉంది. వాడికేం కాదు అంటూ ఆనంద రావు.. […]

 Authored By gatla | The Telugu News | Updated on :9 December 2021,9:00 am

Karthika Deepam 9 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 డిసెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 1218 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ తన భార్య, పిల్లలతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. లెటర్ చదివి ఏడుస్తారు. కానీ.. వాడి పక్కన దీప ఉంది. వాడికేం కాదు అంటూ ఆనంద రావు.. సౌందర్యకు ధైర్యం చెబుతాడు. మరోవైపు కార్తీక్ తాడికొండ ఊరికి చేరుకుంటాడు. నడుచుకుంటూ వెళ్తుంటే.. మనం ఎందుకు నడుస్తున్నాం అని ప్రశ్నిస్తుంది శౌర్య. కానీ.. నీకు నేను ముందే చెప్పాను కదా.. ఎటువంటి ప్రశ్నలు అడగొద్దని చెబుతుంది దీప. మనం హాలీడే ట్రిప్ కు వెళ్తున్నాం. మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండటం కోసమే ఎవ్వరికీ చెప్పలేదు అంటుంది దీప.

karthika deepam 9 december 2021 full episode

karthika deepam 9 december 2021 full episode

కానీ.. పిల్లలకు నడిచి నడిచి కాళ్లకు నొప్పులు పుడుతున్నాయని అంటారు. అయ్యో అంటాడు కార్తీక్. ఎత్తుకోమ్మంటావా అని అడుగుతాడు హిమను. కానీ.. దీప మాత్రం వద్దు అంటుంది. నడక మంచిదే కదా.. నడవనీయండి డాక్టర్ బాబు అంటాడు కార్తీక్. అలాగే నడుచుకుంటూ ఊళ్లోకి వెళ్తారు. మరోవైపు కార్తీక్ ఇంట్లో ఎవ్వరూ సంతోషంగా ఉండరు. కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తాగరు. దీంతో శ్రావ్య వెళ్లి అత్తయ్య, మామయ్య.. ఏదో ఒకటి తినండి. మీ ఆరోగ్యం బాగాలేదు.. అని అంటుంది. మమ్మీ నేను అన్నయ్య వదినల కోసం ట్రై చేస్తున్నాను. నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను.. అంటాడు ఆదిత్య. అన్నయ్య వాళ్లు ఎక్కడున్నారో నేను కనుక్కుంటాను. మీరు ఇలా దిగులుగా కూర్చుంటే బాగుండదు అని ఆదిత్య అంటున్న లోపే.. హలో నమస్తే.. అంటూ అక్కడికి వస్తుంది మోనిత.

అయ్యయ్యో మరిచేపోయాను.. అత్తారింట్లోకి కుడికాలు పెట్టి రావాలి కదా అని చెప్పి ఇంట్లోకి కుడికాలు పెట్టి వస్తుంది మోనిత. మీ డాడీకి ఐ లవ్యూ చెప్పి సరిగ్గా 18 సంవత్సరాలు అయిపోయింది ఆనంద రావు గారు. కాలం కరిగిపోయింది. మీ నాన్న మీద ప్రేమ పెరిగిపోయింది. నా ప్రేమకు అలుపు లేదు. కొందరు గిట్టని వాళ్లు దీన్ని బలుపు అనుకుంటారు.. అంటుంది మోనిత.

నువ్వు, నేను, మీ నాన్న అందరం కలిసి ఉండాలంటే.. మీ నాన్న మీ నాన్నే అనిపించాలంటే తప్పదు కదా అంటుంది. కార్తీక్ అంటూ పిలుస్తుంది. వాళ్లు మాత్రం ఏం మాట్లాడరు. నమస్తే మామయ్య గారు.. నమస్తే ఆంటి గారు.. హలో ఆదిత్య, హలో శ్రావ్య.. చూశావా.. తాతయ్య, నానమ్మ ఉన్నారు. బాబాయి పిన్ని ఉన్నారు. పెద్దమ్మ లోపల ఉండి ఉంటుంది.. అంటుంది.

కార్తీక్ అని పిలుస్తుంటే.. శ్రావ్య బావ గారు ఇంట్లో లేరు అంటుంది. నీ పుణ్యమాని అన్నయ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు అంటుంది. ఆహా… ఈ ఐడియా ఏదో బాగుందే.. ఎక్కడికి పంపించారు కార్తీక్ ను అంటుంది. దీంతో ఆదిత్యకు కోపం వస్తుంది. నీకు దండం పెడతాను మోనిత. ఇప్పటికే మేము బాధలో ఉన్నాం. ఇంకా మమ్మల్ని బాధపెట్టకు.. అంటుంది సౌందర్య.

కార్తీక్ నిజంగా వెళ్లిపోయాడా.. అని అనుకుంటుంది మోనిత. ఆంటి గారు నీ కొడుకు నీ పెళ్లాం పిల్లలతో వెళ్తే.. నా సంగతి ఏంటి మరి అంటుంది మోనిత. 18 ఏళ్ల నుంచి నేను కూడా ఏడుస్తూనే ఉన్నాను. నా బాధ ఎవరు చూశారు. నా కన్నీళ్లు ఎవరు చూశారు. ఇప్పుడు ఈ బిడ్డకు ఎవరు న్యాయం చేస్తారు. వీడు నాన్న ఏడి అంటే నేను ఏం చెప్పాలి. దీపక్క లాగా.. వంటలక్క లాగా మారి.. 10 ఏళ్లు కష్టపడే ఓపిక నాకు లేదు మామయ్య గారు అంటుంది మోనిత.

ఇంతలో ఆదిత్య రెచ్చిపోతాడు. అసలు నీకు బుద్ధి ఉందా. ఒకవైపు మేము అన్నయ్య లేక టెన్షన్ పడుతుంటే.. నువ్వొచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావు.. గెట్ అవుట్ అంటాడు ఆదిత్య. తెలిసి వచ్చావో.. తెలియక వచ్చావో మాకు తెలియదు కానీ.. నీకు, ఈ ఇంటికి సంబంధం లేదు.. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది సౌందర్య.

నాకు, ఈ ఇంటికి సంబంధం లేదా? పేగు మెడలో వేసుకొని పుట్టినప్పుడు.. మనవడా.. దోష నివారణ పూజ చేసినప్పుడు మనవడా.. ఇప్పుడు మనవడు కాదా.. అంటూ ప్రశ్నిస్తుంది మోనిత. మీ కన్నీళ్లు చూస్తుంటే కార్తీక్ నిజంగానే వెళ్లిపోయాడని నమ్మాలనిపిస్తుంది. ఎక్కడికెళ్లారో.. మీరే పంపారో నిజమేంటో తెలుసుకుంటాను.. అని చెప్పి మోనిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Karthika Deepam 9 Dec Today Episode : ఖాళీగా ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి లేనిపోని సమస్యలు తెచ్చుకున్న కార్తీక్, దీప

కట్ చేస్తే.. కార్తీక్ ఓ ఇంటికి వెళ్తాడు. అదంతా దుమ్ము దూళితో ఉంటుంది. ఇదేంటి డాడీ ఇక్కడికి వచ్చాం మనం అంటుంది హిమ. దీంతో కాసేపు మాట్లాడకుండా ఉంటారా అని అంటుంది దీప. మీ నాన్నను డిస్టర్బ్ చేయొద్దు అంటుంది. ఇంతలో పక్కింటావిడ చూసి ఎవరండి మీరు అని అడుగుతుంది.

ఎవరు మీరు. ఈ ఊళ్లో ఎప్పుడూ చూడలేదే అంటుంది. నా పేరు దీప. పని వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాం అంటుంది. నా పేరు శ్యామల అయినా ఈ ఊళ్లో ఏం పని దొరుకుతుంది. పని పక్కన పెట్టండి. ఆ ఇల్లు ఎవరి ఆధీనంలో ఉందో తెలుసా? మీరు తెలియక వచ్చారు.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటుంది. ఆమె రుద్రాణి. ఊళ్లో ఆమె అంటే అందరికీ హడల్.

తను చేసే పనులు కూడా అలాగే ఉంటాయి.. అంటే… ఇల్లు ఖాళీగానే ఉంది కదా.. ఎవరూ లేరు కదా అంటుంది దీప. వద్దు అమ్మ. తను మంచిది కాదు.. అంటుంది. దీంతో దీప అక్కడికి వస్తుంది. ఎవరావిడ.. ఏమైంది అంటే.. ఏం లేదు డాక్టర్ బాబు అంటుంది.

పదండి.. ఇంటిని శుభ్రం చేద్దాం అంటుంది దీప. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఆ రుద్రాణి దగ్గరికి వెళ్తుంది దీప. నమస్తే అండి.. నా పేరు దీప. మేము ఇక్కడికి కొత్తగా వచ్చాం. అక్కడ ఖాళీగా ఉన్న ఇంట్లోకి దిగాం అని చెబుతుంది. దీంతో నా గురించి తెలిసే వచ్చావా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. నా గురించి ఎవ్వరూ చెప్పలేదా అంటుంది రుద్రాణి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది