Karthika Deepam 9 Feb Today Episode : రుద్రాణి అప్పు తీర్చేసిన సౌందర్య.. హిమను అప్పగించిన రుద్రాణి.. ఇంతలో సౌందర్యకు భారీ షాక్ ఇచ్చిన కార్తీక్, దీప

Advertisement
Advertisement

Karthika Deepam 9 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 ఫిబ్రవరి 2022, బుధవారం ఎపిసోడ్ 1271 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా కొడుకు వందల మందికి గుండె ఆపరేషన్లు చేశాడు తెలుసా నీకు అని రుద్రాణికి సౌందర్య చెబుతుంది. వందల మంది చేతులెత్తి మొక్కుతారు నా కొడుకును చూసి. తన అపాయింట్ మెంట్ కోసం రోజుల తరబడి ఎదురు చూస్తారు. నువ్వెంత.. నీ బతుకెంత అని సౌందర్య.. రుద్రాణికి క్లాస్ పీకుతుంది. ఏంటి దీపా ఇది.. ఏంటిది.. దీని కాళ్లు పట్టుకుంటావా? మన కార్లన్నీ తెచ్చి పెడితే దీని ఇల్లు సరిపోదు. దీని కాళ్లు పట్టుకుంటావా అంటుంది అంటుంది సౌందర్య. నాకు అప్పు ఉన్నారు అంటుంది రుద్రాణి. నాకొడుకు ఆగర్భ శ్రీమంతుడు అంటుంది సౌందర్య.

Advertisement

karthika deepam 9 february 2022 full episode

కోట్ల రూపాయలు దానం ఇచ్చి ఇక్కడికి వచ్చాడు అంటుంది సౌందర్య. అప్పు అంట అప్పు. వాడి ఒక్క రోజు సంపాదన.. నువ్వు సంవత్సరం అంతా కూడా సంపాదించలేవు అంటుంది సౌందర్య. ఎవరనుకుంటున్నావే నువ్వు. ఎంతే నీ బాకీ అని అడుగుతుంది. ఎన్ని లక్షలు అంటుంది. 3.20 లక్షలు అంటుంది. వెంటనే చెక్ రాసి ఇస్తుంది సౌందర్య. 10 లక్షల చెక్ రాసి ఇస్తుంది. 10 లక్షలలో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా అంటుంది. 10 లక్షలా అంటుంది. సరిపోలేదా ఇంకా అంటుంది. నా పెద్ద కొడుకు.. నా పెద్ద కోడలు. ఈ సారి నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇల్లు చూసి వెళ్లు. నువ్వేంటో నీ బతుకు ఏంటో తెలుస్తుంది అంటుంది సౌందర్య.

Advertisement

ఇంతలో హిమను పిల్లిగడ్డం తీసుకొస్తాడు. నానమ్మ అంటూ సౌందర్య దగ్గరికి వెళ్తుంది. అస్సలు ఏడుపు ఆపడం లేదని తీసుకొచ్చేశాను అక్క అంటాడు పిల్లిగడ్డం. నానమ్మ ఇక్కడ మనం ఉండొద్దు. ఇక్కడేం బాగోలేదు. మనం వెంటనే హైదరాబాద్ వెళ్లిపోదాం అంటుంది హిమ. దీంతే సరేనమ్మా.. వెళ్లిపోదాం అని చెప్పి అందరినీ కారులో తీసుకెళ్తుంది సౌందర్య.

భారతి, మోనిత.. ఇద్దరూ కారులో వెళ్తుంటారు. తాడికొండ గ్రామం పొలిమేర వద్దకు రాగానే కారు ఆపు అంటుంది మోనిత. నా కార్తీక్ ఇక్కడే ఉన్నాడు. ఈ ఊళ్లోనే ఉన్నాడు అని తెలిశాక ఈ ఊరు మీద నాకు ఇష్టం పెరిగింది అంటుంది మోనిత.

మరోవైపు శౌర్య ఏడుస్తూ ఉంటుంది. పాలు తాగు అని విజయలక్ష్మి అంటుంది. దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కు. ఆ దేవుడే మీకు దారి చూపిస్తాడు. ముందు అయితే ఈ పాలు తాగు అంటుంది. ఇంతలోనే వాళ్ల కారు వస్తుంది. లోపలికి హిమ వస్తుంది.

శౌర్య..  ఎలా వచ్చావు. నిన్ను ఎలా పంపించారు అంటుంది. ఇంతలోనే సౌందర్య వస్తుంది. నానమ్మ అంటుంది. శౌర్య.. ఎలా ఉన్నావే అంటుంది సౌందర్య. ఈ నానమ్మను మరిచిపోయారా అంటుంది సౌందర్య. నానమ్మ.. హిమను నువ్వు తీసుకొచ్చావా అంటుంది శౌర్య. అవును.. నానమ్మే నన్ను తీసుకొచ్చింది అంటుంది హిమ.

శౌర్యకు ఏమైంది అని అడుగుతుంది. దీంతో తనకు ఏం కాలేదు అని చెబుతాడు. ఆ వివరాలన్నీ తర్వాత చెబుతాను అంటాడు. శౌర్యకు పాలు తాగిస్తుంది సౌందర్య. ఆ తర్వాత ఆనంద్ గురించి చెబుతాడు కార్తీక్. అన్ని విషయాలు చెబుతాడు కార్తీక్.

Karthika Deepam 9 Feb Today Episode : కార్తీక్ కోసం తాడికొండ మొత్తం వెతికిన మోనిత

దీప.. ఇలారా అని పిలుస్తుంది సౌందర్య. ఇలాంటి ఇంట్లో ఉంటున్నారా అని అడుగుతుంది. ఎంటిరా పెద్దోడా ఇది. ఏంటి మీకు ఈ కర్మ. అన్నీ వదులుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి. ఇన్ని కష్టాలు పడటం అవసరమా అంటుంది సౌందర్య.

మేమంతా ఉన్నాం కదా అంటుంది సౌందర్య. అత్తయ్య ఆయన్ను ఏం అనకండి అంటుంది దీప. ఏంటి దీప ఇది.. బంగారు నగలన్నీ ఏమయ్యాయి. చెవులకు ఏం లేవు. మెడ బోసిగా ఉంది. ఏంటిరా ఇది పెద్దోడా అంటుంది సౌందర్య. దీంతో కార్తీక్, దీప ఏం మాట్లాడరు.

మరో వైపు తాడికొండ గ్రామం మొత్తం కార్తీక్ కోసం మోనిత, భారతి.. ఇద్దరూ వెతుకుతారు. కానీ.. దొరకరు. దీంతో ఏం చేయాలో మోనితకు అర్థం కాదు. పెద్దోడా.. మనింటికి వెళ్లిపోదాంరా అంటుంది సౌందర్య. మాట్లాడవేంట్రా అంటుంది సౌందర్య.

నేను రాలేను మమ్మీ అంటాడు కార్తీక్. రాలేవా ఏం సాధించావురా ఇక్కడికి వచ్చి అంటుంది సౌందర్య. నువ్వు బాధపడుతున్నావు. దీపను బాధపెడుతున్నవు అంటుంది సౌందర్య. అభంశుభం తెలియని పిల్లలను ఇబ్బంది పెడుతున్నావు. ఇక్కడ మీరు అక్కడ మేము బాధపడుతున్నాం. ఏంటి దీప.. నువ్వు మాట్లాడవేంటి అంటుంది సౌందర్య.

అక్కడ మేము ఇంట్లో ఉండలేక.. భోజనం చేస్తుంటే చేతిలో అన్నం ముద్ద చూస్తూ అయ్యో వాళ్లు ఎలా ఉన్నారో తిన్నారో లేదో అని కన్నీళ్లు పెట్టుకున్నాం. ఇవన్నీ మీకు తెలుసా అంటుంది సౌందర్య. రేయ్ పెద్దోడా.. మీ నాన్న నీ మీద బెంగతో ఆరోగ్యం పాడుచేసుకుంటే ఆయన్ను ఓదార్చలేక నీ జాడ తెలియక మేమంతా ఎంత కుమిలిపోయామో తెలుసా అంటుంది సౌందర్య.

మమ్మీడాడీ ఏమైపోతారో.. ఒక్క ఫోన్ లేదు.. ఉత్తరం లేదు.. కబురు లేదు అని ఒక్కసారైనా ఆలోచించావా అంటుంది సౌందర్య. పెద్దోడా.. నువ్వు ఏం తప్పు చేశావనిరా. ఎందుకు ఇలా తలదించుకుంటున్నవు అని అడుగుతుంది సౌందర్య. నువ్వు ఒక గొప్ప డాక్టర్ వి. కార్డియాలజిస్ట్ స్పెషలిస్టు.. కార్తీక్ నా పెద్ద కొడుకు అని గర్వంగా చెప్పుకుంటానురా అంటుంది సౌందర్య.

మాట్లాడురా.. ఇటు చూడు అంటుంది సౌందర్య. నేను రాలేను మమ్మీ అంటాడు కార్తీక్. ఎందుకు రాలేవు అని అడుగుతుంది సౌందర్య. ఎందుకు రాలేవురా. నువ్వు ఏ పాపం చేయలేదురా. ఏ ఘోరం చేయలేదు. ఏదో ఒక చిన్న పొరపాటు జరిగింది అంటుంది. దీంతో అది పొరపాటు కాదు మమ్మీ. దాని విలువ ఒక ప్రాణం. ఒక కుటుంబం అంటాడు కార్తీక్.

నేను ఒకప్పుడు డాక్టర్ ను మమ్మీ. ఇప్పుడు కాదు అంటాడు కార్తీక్. నువ్వు డాక్టర్ వి కాకముందు కూడా నాకొడుకువే కదా నాన్నా. నిన్న గాక మొన్న మిమ్మల్ని కలిసిన బాబు మీద అంత ప్రేమ పెంచుకున్నారు. ఎవరో ఏంటో తెలియకే మీకు అంత అభిమానం ఉంటే.. కన్నకొడుకువు.. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉంటుందో ఊహించలేవా నాన్న అంటుంది సౌందర్య.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Karthika Deepam 2 Today Episode : కార్తీకదీపం 2 జనవరి 30 ఎపిసోడ్: జ్యోత్స్నకు షాకిచ్చిన పారిజాతం.. జ్యోత్స్న పాపం పండిందా? పారిజాతం తీసుకున్న నిర్ణయం ఏంటి? శ్రీధర్ ఎమోషనల్..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. కార్తీక్, దీపల…

16 minutes ago

Samsung Galaxy S26 : గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న శాంసంగ్ Galaxy S26 Ultra ధర? లీకైన వివరాలు ఇవే!

Samsung Galaxy S26  : శాంసంగ్ ( Samsung ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గెలాక్సీ ఎస్26 సిరీస్'…

47 minutes ago

Guava : వీరు ఎట్టి పరిస్థితుల్లో జామపండు తినకూడదు..! ఏమికాదులే అని తిన్నారో అంతే సంగతి !!

Guava : జామపండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. నారింజ పండు కంటే ఎక్కువ…

2 hours ago

Zodiac Signs : 30 జనవరి 2026 శుక్రవారం నేటి రాశిఫలాలు.. ఈ రాశి వాళ్ల‌ జీవితంలో అనుకోని మలుపు..!

Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…

3 hours ago

Prabhas : ప్రభాస్ తో నేను పెట్టుకోను .. భయపడుతున్న స్టార్ హీరో

Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…

12 hours ago

Realme P4 Power 5G : రియల్‌మీ నుంచి పవర్ మాన్‌స్టర్.. 10,001mAh బ్యాటరీతో రియల్‌మీ పీ4 పవర్ 5జీ వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే..!

Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…

13 hours ago

UPI : గూగుల్ పే, ఫోన్‌పే, యూజర్లకు శుభ‌వార్త‌.. యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయిందా..? ఇలా చేస్తే ఎక్స్‌ట్రా డ‌బ్బులు వ‌స్తాయి..!

Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…

14 hours ago

Sunitha : అందరి కంట్లో నీళ్ళు తెప్పించిన సింగర్ సునీత

Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…

15 hours ago