Karthika Deepam : డాక్టర్ బాబు, మోనిత రొమాన్స్.. అదరగొట్టేసిన జంట.. కార్తీక్, దీప కన్నా.. కార్తీక్, మోనిత జంట అదుర్స్
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ గురించి మాట్లాడితే ఆ సీరియల్ లో మాట్లాడాల్సింది ముగ్గురు గురించే. అవును.. ఒకరు డాక్టర్ బాబు కార్తీక్ అయితే.. రెండో వ్యక్తి వంటలక్క దీప. ఇక మూడో వ్యక్తి ఈ సీరియల్ లో మెయిన్ విలన్ డాక్టర్ మోనిత. నిజానికి.. డాక్టర్ మోనిత లేకపోతే ఈ సీరియల్ ఎప్పుడో అయిపోయేది. కానీ.. మోనిత విలనిజాన్ని ఈ సీరియల్ లో డైరెక్టర్ బాగా చూపించాడు.కార్తీక్ కోసం ఏదైనా చేసే ఒక అపర ప్రేమికురాలి పాత్రలో మోనిత మెరిసింది. అదరగొట్టేసింది. తన అసలు పేరు శోభా శెట్టి అయినప్పటికీ.. బయట కూడా తనను చాలామంది మోనిత అనే పిలుస్తున్నారు అంటే.. తనకు ఎంత క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. తను మోనితగా అందరి గుండెల్లో ఎలా నిలిచిపోయిందో చెప్పుకోవచ్చు.
Karthika Deepam : కార్తీక్ తో మోనిత చేసిన చేసిన రొమాన్స్ వీడియో హల్ చల్
తాజాగా కార్తీక్ తో మోనిత చేసిన రొమాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. అదేమీ రియల్ కాదు లెండి. హోలీ స్పెషల్ గా.. స్టార్ మా చానెల్ లో కలర్స్ ఆఫ్ రొమాన్స్ – తగ్గేదేలే అనే స్పెషల్ షోను ప్రసారం చేయనున్నారు.ఆ షోలో బుల్లి తెర సెలబ్రిటీలతో రొమాన్స్ చేయించారు. అందులోనే డాక్టర్ బాబు, మోనిత ఇద్దరూ రొమాన్స్ చేశారు. మోనితను డాక్టర్ బాబు ఎత్తుకొని కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ అలాగే ఉండిపోతాడు. ఆ ప్రోమోను చూసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.

karthika deepam doctor babu and monitha love track video viral
సీరియల్ లో ఎలాగూ మోనితకు కార్తీక్ తో రొమాన్స్ చేసే అదృష్టం దక్కలేదు. కనీసం.. ఇలాగైనా తనకు రొమాన్స్ చేసే అవకాశం దొరికింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
