Karthika Deepam : వంటలక్కను ఇలా చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. కొత్త లుక్కులో వంటలక్క !
Karthika Deepam కార్తీకదీపం సీరియల్ Karthika Deepam లో వంటలక్క, దీప Premi Vishwanath పాత్రలో నటిస్తూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది ప్రేమీ విశ్వనాథ్. మళయాలి అయినా కూడా తెలుగు ప్రేక్షకుల్లో గుండెల్లో చిరస్థానం సంపాదించుకుంది. అలా వంటలక్క రూపంలో ప్రేమీ విశ్వనాథ్‌ను అందరూ ఇష్టపడుతుంటారు. ఆ మేకప్, ఆలకంరణ, వస్త్రాధారణ ఇలా అన్నీ కూడా బుల్లితెర ప్రేక్షకులను తెగ కట్టిపడేస్తుంటాయి. అయితే తెర మీద మాత్రమే ప్రేమీ విశ్వనాథ్ అలా ఉంటుంది. తెర వెనుక మాత్రం మోడ్రన్ దుస్తుల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది.

Karthika Deepam Fame Premi Vishwanath For Ad Shoot
కొత్త లుక్కులో ప్రేమీ విశ్వనాథ్ Karthika Deepam
మామూలుగా అయితే ప్రేమీ విశ్వనాథ్ ఒకప్పుడు ఎక్కడా కనిపించేది కాదు. కేవలం కార్తీకదీపం Karthika Deepam సీరియల్‌లో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు బుల్లితెర మీద ప్రకటనలు, సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూతెగ హల్చల్ చేస్తున్నారు. అయితే తెనాలి డబుల్ హార్స్ అనే ప్రొడక్ట్ కోసం వంటలక్క కదిలి వచ్చిన సంగతి తెలిసిందే. వంటలక్క, సుమక్క కలిసి ఈ ప్రొడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఓ కొత్త యాడ్ కోసం ప్రేమీ విశ్వనాథ్ రెడీ అయినట్టు తెలుస్తోంది.

Karthika Deepam Fame Premi Vishwanath For Ad Shoot
ఆ యాడ్ కోసం ప్రేమీ విశ్వనాథ్ పంజాబీ డ్రెస్సులో దర్శనమిచ్చింది. రెడ్ కలర్ పంజాబీ డ్రెస్సులో ఉన్న ప్రేమీ విశ్వనాథ్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మా వంటలక్కేనా? ఆ దీప Premi Vishwanath ఈమేనా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతోన్నారు. యాడ్ షూటింగ్ కోసం ఇలా మారిపోయానని ప్రేమీ విశ్వనాథ్ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ప్రేమీ షేర్ చేసే ఫోటోలు, ఆమె చేసే ఫోటో షూట్లు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఆ మధ్య కోడిని పట్టుకుని దిగిన ఫోటోలు, సిగరెట్ తాగుతున్నట్టుగా దిగిన ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి