Karthika Deepam Hima Fame Sahruda Dance Video
కార్తీకదీపం సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బుల్లితెరపై టీఆర్పీల్లో కింగ్. గత రెండు మూడేళ్ల నుంచి టాప్ టీఆర్పీ రేంటింగ్లను సొంతం చేసుకుంటోంది. ఇక టీఆర్పీ అంటే కార్తీకదీపం.. కార్తీకదీపం అంటే టీఆర్పీ అనే స్థాయికి ఎదిగింది. కార్తీకదీపం సీరియల్‌లోని ప్రతీ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. వంటలక్క, దీపగా ప్రేమీ విశ్వనాథ్.. డాక్టర్ బాబు, కార్తీక్‌గా నిరుపమ్ పరిటాలకు ఎక్కువగా గుర్తింపు రాగా.. మిగిలిన పాత్రలన్నీ కూడా జనాల్లో ముద్ర వేశాయి.
Karthika Deepam Hima Fame Sahruda Dance Video
సౌందర్య పాత్రలో అర్చన, మోనిత క్యారెక్టర్‌లో శోభా శెట్టి ఇలా అన్ని పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఇక చిన్న పిల్లలుగా నటించిన శౌర్య, హిమలు కొన్నేళ్లు సీరియల్‌ను తమ భుజాల మీద నడిపించేశారు. శౌర్య పాత్రలో కృతిక, హిమ క్యారెక్టర్‌లో సహృద అదరగొట్టేస్తున్నారు. ఈ ఇద్దరూ తెరపైనే కాకుండా.. తెర వెనుకా దుమ్ములేపుతుంటారు. ఇక సహృద అయితే తన డ్యాన్సులతో అదరగొట్టేస్తుంటుంది. ఆమె డ్యాన్స్ ప్రోగ్రాంలోనూ కనిపించింది.
Karthika Deepam Hima Fame Sahruda Dance Video
చిన్నప్పుడు సహృద డ్యాన్స్ ప్రోగ్రాంలో మెరిసింది. డ్రామా జూనియర్స్, చిన్న పిల్లల డ్యాన్స్ ప్రోగ్రాంలలో సహృద కనిపించింది. అక్కడే రోషన్ అనే డ్యాన్సర్ కూడా పరిచయమైనట్టుంది. ఈ ఇద్దరూ కలిసి ఎన్నో పర్ఫామెన్స్‌లు చేశారు. ఆ స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ ఇద్దరూ వేసిన స్టెప్పులు, వాటికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా రోషన్‌తో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోను సహృద షేర్ చేయగా అది వైరల్ అవుతోంది. వంటలక్క కూతురు రచ్చ చేస్తోందిగా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
This website uses cookies.