Karthika Deepam Hima – Shourya : కార్తీక దీపం పిల్లల జోరు తగ్గట్లేదు.. జబర్దస్త్ స్టేజ్ మీద హిమ, శౌర్యల సందడి

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 9 July 2022, 8:00 pm

Karthika Deepam Hima – Shourya : కార్తీకదీపం సీరియల్ ఇప్పుడంటే అంతగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు కార్తీకదీపం సీరియల్‌కు ఉండే క్రేజ్ వేరు. డాక్టర్ బాబు, వంటలక్క, దీప, కార్తీక్, శౌర్య, హిమ, మోనిత, సౌందర్యల పాత్రలకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. అలా ఒకప్పుడు టీఆర్పీలకు కింగ్‌లా ఉన్న సీరియల్ ఇప్పుడు దారుణంగా చతికిలపడింది. కార్తీక దీపం సీరియల్ జనరేషన్ మారింది. డాక్టర్ బాబు, వంటలక్కలను చంపేశారు. హిమ, శౌర్యలు పెద్దవాళ్లు అయ్యారు. అలా మొత్తానికి సీరియల్ అంతా కూడా కొత్త ట్రాక్ ఎక్కించారు. అయితే ఈ సీరియల్ చేసినంత కాలం హిమగా సహృద, శౌర్యగా కృతిక ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నారు.

సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కృతిక ఆల్రెడీ సినిమాలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. సహృద అయితే రీల్ వీడియోలు, డ్యాన్స్‌లతో ఆకట్టుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇది వరకు ఎన్నో ఈవెంట్లలో ఈ పిల్లలిద్దరూ సందడి చేశారు. ఓ సారి స్టార్ మా ఈవెంట్‌లో సహృద తన రియల్ స్టోరీ చెప్పి ఏడిపించింది. తన తండ్రి ఎలాంటి వాడో చెప్పి అందరినీ కంటతడి పెట్టించేసింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కార్తీక దీపం సీరియల్‌లో కనిపించడం లేదు. అయినా కూడా ఈ ఇద్దరి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అడపాదడపా ఈవెంట్లకు పిల్లలను పిలుస్తున్నారు.తాజాగా ఈ ఇద్దరూ జబర్దస్త్ షోలో కనిపించారు.

Karthika Deepam Hima Shourya In Jabardasth SHow

Karthika Deepam Hima Shourya In Jabardasth SHow

ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ నూకరాజు టీంలోకి ఎంట్రీ ఇచ్చారు. మమతల తల్లి అంటూ శౌర్య, హిమలు ఎంట్రీ ఇచ్చారు. పిల్లలమైనా సరే మనకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు కదా? అని హిమ అంటుంది. మనం పిల్లలం కాదు.. మనల్ని ముందు పెట్టి వాళ్లు వెనకాల దాక్కున్నారు కదా? వాళ్లే పిల్లలు అని కౌంటర్ వేస్తుంది శౌర్య. మొత్తానికి ఇలా ఈ ఇద్దరూ బుల్లితెరపై మళ్లి కనిపించడంతో వారి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మళ్లీ ఈ ఇద్దరూ ఏదైనా సీరియల్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి. ఇక శౌర్య అయితే సినిమాలతోనే ఫుల్ బిజీగా ఉంటోంది. సహృద డ్యాన్స్‌ ప్రాక్టీస్‌లో బాగా మునిగినట్టుంది. మొత్తానికి ఈ పిల్లలు లేకపోవడంతో సీరియల్ కాస్త బోరింగ్‌గా అయిపోయింది.

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp