Karthika Deepam : బోల్తా కొట్టించిన డాక్టర్ బాబు భార్య.. లాస్ట్ వీడియో అంటూ మంజుల షాక్

 Authored By prabhas | The Telugu News | Updated on :8 January 2022,1:00 pm

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్‌తో నిరుపమ్ డాక్టర్ బాబుగా బాగానే ఫేమస్ అయ్యాడు. డాక్టర్ బాబు భార్యగా రియల్ లైఫ్‌లో మంజుల బాగానే క్రేజ్ తెచ్చుకుంది. నిరుపమ్ భార్యగా కంటే.. డాక్టర్ బాబు భార్యగానే మంజుల అందరూ ఆటపట్టిస్తుంటారు. అయితే ఈ మధ్య మంజుల తన భర్త నిరుపమ్‌తో కలిసి యూట్యూబ్‌లో దున్నేస్తోన్న సంగతి తెలిసిందే. మంజుల నిరుపమ్ పేరుతో ప్రారంభించిన యూట్యూబ్ చానెల్ మంచి ఫాంలో ఉంది.

రకరకాల వీడియోలను షేర్ చేస్తూ మంజుల అందరినీ ఆకట్టుకుంటోంది. మంజుల నిరుపమ్ కలిసి చేసే వీడియో, వారి పర్సనల్ విషయాలను అందరికీ చెప్పడం, ఇంటి విశేషాలను చూపించడం ఇలా వెరైటీ వీడియోలతో అందరినీ మెప్పిస్తున్నారు. తాజాగా మంజుల అందరినీ బోల్తా కొట్టేసింది. యూట్యూబ్ థంబ్ నెయిల్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.

Karthika Deepam Manjula Pritala Latest Youtube Video

Karthika Deepam Manjula Pritala Latest Youtube Video

Karthika Deepam : యూట్యూబ్‌లో మంజుల హల్చల్

అలాంటి అందరినీ బోల్తా కొట్టించేలా ఓ వీడియోను వదిలింది. ఇదే నా లాస్ట్ వీడియో అని చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. తీరా దాని కథ ఏంటని చూస్తే అందరికీ షాక్ కొట్టినట్టు అయింది. 2021లో ఇదే లాస్ట్ వీడియో అంటూ కౌంటర్ వేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. మొత్తానికి డాక్టర్ బాబుతో రకరకాల విన్యాసాలను చేయించింది మంజుల.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి