Karthika Deepam : అమ్మను రంగంలోకి దింపేసింది.. కార్తీక దీపం మోనిత మామూల్ది కాదు

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 31 October 2021, 3:00 pm

Karthika Deepam  కార్తీకదీపం మోనిత అంటే తెలియని వారెవ్వరూ ఉండరు. కార్తీకదీపం సీరియల్ ఇంతగా హిట్ అవ్వడానికి ఆమె కూడా ఓ కారణం. విలన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే సీరియల్ అంత బలంగా ప్రజల్లోకి దూసుకెళ్తుంది. అలా మోనిత చేసే కుట్రలు, మోసాలకు జనాల్లో కోపాన్ని రగిలిస్తుంటుంది. మోనిత అంటే అందరికీ కోపం కలిగించేలా ఆ పాత్రలో శోభా శెట్టి జీవించేస్తోంది. అలా మోనిత కారెక్టర్‌తో శోభా శెట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మొత్తానికి కార్తీకదీపం సీరియల్‌లో మోనితే ఇప్పుడు చక్రం తిప్పుతోంది.

karthika deepam monitha about her mother

karthika deepam monitha about her mother

మొత్తానికి ఓ బిడ్డను కనేసింది. దానికి కార్తీక్ చేతే సంతకం పెట్టించుకుంది. అలా ఆ బిడ్డకు కార్తీక్ తండ్రి అని ఒప్పుకున్నట్టుగా మారింది. ఇక తరువాయి భాగం ఏంటన్నది కూడా మోనిత ప్లాన్ చేసుకుంది. ఆ బిడ్డను ఎత్తుకుని ఏకంగా కార్తీక్ ఇంటికి వెళ్తుందట. ఆ సీరియల్ సంగతులు కాసేపు పక్కన పెట్టేద్దాం. శోభా శెట్టి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా, యూట్యూబ్ వంటి వాటి ద్వారా తన అభిమానులతో ఎప్పుడూ టచ్లో ఉంటుంది.

Karthika Deepam  : అమ్మకు ఇన్ స్టా ఖాతా అంటోన్న మోనిత

karthika deepam monitha about her mother

karthika deepam monitha about her mother

ఇక తాజాగా తన అమ్మను కూడా సోషల్ మీడియా ప్రపంచానికి పరిచయం చేసింది శోభా శెట్టి. అమ్మ చేతి వంట అంటూ మొన్నా మధ్య ఓ వీడియోను షేర్ చేసింది. అది బాగానే క్లిక్ అయింది. ఇక తన అమ్మతో నేరుగా ఇన్ స్టా అకౌంట్‌ను తెరిపించింది. అందరూ ఫాలో అవ్వండని కోరింది. మొత్తానికి మోనిత తన అమ్మను కూడా రంగంలోకి దింపింది. ఇక శోభా శెట్టి ఫాలోవర్లు ఆమె అమ్మ రత్నమ్మకు కూడా ఫాలో అవుతున్నారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp