Home » Entertainment » Karthika Deepam Nirupam And Manjula About Their Carrier Palnnings In Earler Stage
Entertainment

Karthika Deepam Nirupam : నటులం కాకపోయి ఉంటే ఆ పని చేసుకుంటూ బతికేవాళ్లం.. మంజుల-నిరుపమ్ కామెంట్స్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 11, 2022, 5:00 pm
Advertisement

Karthika Deepam Nirupam : బుల్లితెరపై నిరుపమ్ పరిటాలకు ఉన్న డిమాండ్, క్రేజ్, ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక మంజులకు ఆ రేంజ్ ఫాలోయింగ్ లేకపోయినా ఓ మోస్తరుగా డిమాండ్ ఉంది. అయితే మంజులకు ఎక్కువగా సోషల్ మీడియాలో క్రేజ్ ఉంటుంది. డాక్టర్ బాబు భార్యగా మంజులను అందరూ ఆట పట్టిస్తుంటారు. నెట్టింట్లో ఆమెను అలానే పిలుస్తుంటారు. బయట ఎక్కడ కనిపించినా అలానే అంటుంటారు. ఆమె మాత్రం నవ్వుతూ.. నేను డాక్టర్ బాబు భార్యని కాదు.. నిరుపమ్ భార్యని అంటుంటుంది. అలా మొత్తానికి మంజుల నిరుపమ్ ఇద్దరూ కూడా నెట్టింట్లో నానా హంగామా చేస్తుంటారు.

Advertisement

ఈ మధ్య యూట్యూబ్ చానెల్‌తో అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. క్రియేట్ ఐడియాలతో వెరైటీ వీడియోలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ఆ ఇద్దరూ కలిసి ఓ కొత్త వీడియోను వదిలారు. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పారు. ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు, రిపిటేడ్‌గా వచ్చిన ప్రశ్నలకు ముందు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ నెటిజన్ వింత క్వశ్చన్ అడిగింది. మీరు నటులు కాకపోయి ఉంటే.. ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే ఏమై ఉండేవాళ్లు అని అడిగాడు. దీంతో నిరుపమ్ ఇలా సమాధానం చెప్పాడు. ఒక వేళ యాక్టర్‌ని కాకపోయి ఉంటే.. చదివాను కదా? బీటెక్.. ఇంకేం చేస్తాం..

Karthika Deepam Nirupam  And Manjula About Their Carrier Palnnings In Earler Stage

Advertisement

ఎవరో ఒకరిని బ్యాక్ డోర్‌లో పట్టుకుని జాబ్ చేసుకునేవాడిని.. లేదంటే.. మైత్రివనం, అమీర్ పేట్‌లో ఏదో ఒక కోర్సు నేర్చుకుని జాబ్ చేసేవాడిని 9 టు 5 జాబ్ చేసి ఇంటికొచ్చేవాడిని అంటూ నిరుపమ్ చెప్పుకొచ్చాడు. కానీ తనకు ఎప్పుడూ కూడా ఉద్యోగం అనే ఆలోచనే రాలేదట. అందుకే సెకండ్ థాట్ లేకుండాపోయిందట. ఇక మంజుల అయితే తాను చార్టెడ్ అకౌంటెట్ అవ్వాలని అనుకుందట. కానీ ఇటు వైపు రావడంతో నటన మీద ప్యాషన్ పెరిగిందట. అప్పటి నుంచి వేరే ఆలోచన ఏదీ కూడా రాలేదట. అలా మొత్తానికి ఈ ఇద్దరూ నటీనటులయ్యారు. ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. హ్యాపీగా ఉంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి