Karthika Deepam : కార్తీక దీపం డాక్టర్ బాబు ఓ రైటర్.. నిరుపమ్‌లోని టాలెంట్‌కు అంతా ఫిదా!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam : కార్తీక దీపం డాక్టర్ బాబు ఓ రైటర్.. నిరుపమ్‌లోని టాలెంట్‌కు అంతా ఫిదా!!

Karthika Deepam కార్తీకదీపం Karthika Deepam డాక్టర్ బాబుగా ఫేమస్ అయ్యారు నిరుపమ్ పరిటాల. అయితే నిరుపమ్ పరిటాల సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాడని కొంత మందికే తెలుసు. నిరుపమ్ తండ్రి సినిమా పరిశ్రమకు చెందిన వారే. మరీ ముఖ్యంగా బుల్లితెరకు ఆయన సుపరిచితులు. సినిమా, సీరియల్ కథలు రాసేవారు. సంభాషణలు అందించేవారు. అలా చిన్నప్పటి నుంచే నిరుపమ్‌కు సైతం కథలు రాయడం, మాటలు రాయడం అలవాటే. కార్తీక దీపం డాక్టర్ బాబు ఓ రైటర్.. […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :14 August 2021,5:10 pm

Karthika Deepam కార్తీకదీపం Karthika Deepam డాక్టర్ బాబుగా ఫేమస్ అయ్యారు నిరుపమ్ పరిటాల. అయితే నిరుపమ్ పరిటాల సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాడని కొంత మందికే తెలుసు. నిరుపమ్ తండ్రి సినిమా పరిశ్రమకు చెందిన వారే. మరీ ముఖ్యంగా బుల్లితెరకు ఆయన సుపరిచితులు. సినిమా, సీరియల్ కథలు రాసేవారు. సంభాషణలు అందించేవారు. అలా చిన్నప్పటి నుంచే నిరుపమ్‌కు సైతం కథలు రాయడం, మాటలు రాయడం అలవాటే.

Karthika Deepam Nirupam Paritala Comedy Post

Karthika Deepam Nirupam Paritala Comedy Post

కార్తీక దీపం డాక్టర్ బాబు ఓ రైటర్.. నిరుపమ్‌లోని టాలెంట్‌కు అంతా ఫిదా!! Karthika Deepam

హీరోగా ప్రయత్నాలు చేసిన నిరుపమ్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. అలా చివరకు బుల్లితెరపై సెటిల్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా బుల్లితెర శోభన్ బాబు అయిపోయాడు. అయితే నిరుపమ్‌లో ఆ రాసే టాలెంట్ మాత్రం ఇంకా ఉంది. అప్పుడప్పుడు కథలు, స్క్రిప్ట్, మాటలు కూడా రాస్తుంటాడట. నిరుపమ్‌లో కామెడీ టైమింగ్, హాస్య రచనా శైలి తెలియాలంటే సోషల్ మీడియాతో అతడిని ఫాలో అవ్వాల్సిందే.

Karthika Deepam Nirupam Paritala Comedy Post

Karthika Deepam Nirupam Paritala Comedy Post

తాను పెట్టే పోస్ట్‌లకు నిరుపమ్ వేసే కౌంటర్లు ఎలా ఉంటాయి.. ఎంతటి ప్రాసతో ఉంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా తాను కార్తీకదీపం సీరియల్ షూటింగ్‌లో భాగంగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తనను చూడటానికి వచ్చిన అమ్మ సౌందర్యతో దిగిన వర్కింగ్ స్టిల్‌ను షేర్ చేస్తూ.. అడగకుండానే డాక్టర్‌ని చేశావ్.. పిలవకుండానే స్టేషన్‌కి వచ్చావ్.. ఇంకా ఎందుకమ్మా నన్ను లోపలే ఉంచావ్.. అయినా నువ్వు నాకు నచ్చావ్ అంటూ ప్రకాశ్ రాజ్ స్టైల్లో చెప్పేశారు. ఇక ఈ పోస్ట్ చూసి డాక్టర్ బాబు ప్రాసకు,రాతలకు ఫిదా అవుతున్నారు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది