Home » Entertainment » Karthika Deepam Nirupam Paritala On Premi Viswanath
Entertainment

Karthika Deepam Nirupam : సెట్‌లో చేసే పనులివే?.. వంటలక్కపై డాక్టర్ బాబు ఫన్నీ కామెంట్స్

Authored By
aruna
The Telugu News | Published on: September 21, 2022, 7:00 pm
Advertisement

Karthika Deepam Nirupam : కార్తీకదీపం సీరియల్‌తో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు ఎంతలా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. డాక్టర్ బాబుగా నిరుపమ్, వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ చేసిన పాత్రలు అందరినీ మెప్పించాయి. ఇప్పటికీ ఈ పాత్రలే టాప్‌లో ట్రెండ్ అవుతుంటాయి. వాళ్లిద్దరూ లేకపోవడంతో సీరియల్ రేటింగ్స్ పాతాళంలోకి వెళ్లాయి. దీంతో దర్శక నిర్మాతలు కళ్లు తెరిచారు. అసలు విషయం గ్రహించారు. మళ్లీ డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలను బతికించారు. కానీ కథలో పట్టులేకపోవడంతో తేడా కొట్టేస్తోంది..

Advertisement

అయినా వంటలక్క, డాక్టర్ బాబు స్క్రీన్వంటలక్క, డాక్టర్ బాబు ప్రజెన్స్‌తో జనాలను మెప్పిస్తున్నారు. ఈ ఇద్దరూ ఆన్ స్క్రీన్‌లో ఎంత కెమిస్ట్రీని పండిస్తుంటారో.. బయట కూడా అంతే ఫన్నీగా ఉంటారు. ఇక ఆన్ సెట్, ఆఫ్ సెట్‌లో వీరు చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఎక్కువగా ఖాళీ టైం దొరికినప్పుడు డాక్టర్ బాబు ఫోటోలకు పోజులిస్తుంటాడు. మన వంటలక్క ఆ ఫోటోలను తీస్తుంటుంది. వంటలక్క కూడా అప్పుడప్పుడు ఫోటోలకు ఫోజులు ఇస్తుంటుంది. వాటిని మనడాక్టర్ బాబు తీస్తుంటాడు. మధ్యలో ఓ సారి వంటలక్క కౌంటర్ వేసింది.

Karthika Deepam Nirupam Paritala on Premi Viswanath

Advertisement

ఓ సారి డాక్టర్ బాబు నెట్టింట్లో ఫోటోలను షేర్ చేశాడు. తీసిన వాళ్లకు క్రెడిట్స్ ఇవ్వవా? అని వంటలక్క నెట్టింట్లో కామెంట్లు చేసింది. అలా ఈ ఇద్దరూ నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. మామూలుగానే నిరుపమ్ ఓ రచయిత. ప్రాసలు, పంచులు, కౌంటర్లు వేయడంలో ముందుంటాడు. తాజాగా నిరుపమ్ ఓ పోస్ట్ వేశాడు.అందులో తన ప్రాసకు ఉన్న ప్రతిభను చూపించాడు. అంతే కాకుండా వంటలక్కకు భయపడది తనకు క్రెడిట్ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఫ్లవర్స్ జడలో ఉంటే అందం.. గోడకు ఉంటే అలంకారం.. గాడ్ దగ్గర ఉంటే నమస్కారం.. మరి మన షర్ట్ మీద ఉంటే ఉత్సాహం.. ఫోటో తీసింది వంటలక్క అండోయ్.. చెప్పకపోతే నెక్ట్స్ ఫోటో తీయదు మళ్లీ.. అంటూ నిరుపమ్ వేసిన ఈ పోస్ట్, షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి