Nirupam Paritala : మళ్లీ పెళ్లి చేసుకున్న కార్తీక దీపం సీరియల్ హీరో నిరుప‌మ్‌.. ఎవ‌రినో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nirupam Paritala : మళ్లీ పెళ్లి చేసుకున్న కార్తీక దీపం సీరియల్ హీరో నిరుప‌మ్‌.. ఎవ‌రినో తెలుసా?

Nirupam Paritala : కార్తీక దీపం సీరియల్ తో బుల్లితెర స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నిరూపమ్ పరిటాల. అందులో డాక్టర్ బాబు పాత్రలో అద్భుతంగా నటించి అభిమానులను కూడగట్టుకున్నారు. ప్రస్తుతం కార్తీక దీపం-2 సీరియల్‌కు కూడా బుల్లితెరపై మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఇక నిరూపమ్ భార్య మంజుల కూడా బుల్లితెర నటినే. చంద్రముఖితో పాటు పలు సీరియల్స్ లోనూ నటించి మెప్పిచింది. పరిటాల, మంజులది ప్రేమ వివాహం. వీరిద్దరూ కలిసి చంద్రముఖి సీరియల్ లో నటించారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 October 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Nirupam Paritala : మళ్లీ పెళ్లి చేసుకున్న కార్తీక దీపం సీరియల్ హీరో నిరుప‌మ్‌.. ఎవ‌రినో తెలుసా?

Nirupam Paritala : కార్తీక దీపం సీరియల్ తో బుల్లితెర స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నిరూపమ్ పరిటాల. అందులో డాక్టర్ బాబు పాత్రలో అద్భుతంగా నటించి అభిమానులను కూడగట్టుకున్నారు. ప్రస్తుతం కార్తీక దీపం-2 సీరియల్‌కు కూడా బుల్లితెరపై మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఇక నిరూపమ్ భార్య మంజుల కూడా బుల్లితెర నటినే. చంద్రముఖితో పాటు పలు సీరియల్స్ లోనూ నటించి మెప్పిచింది.

పరిటాల, మంజులది ప్రేమ వివాహం. వీరిద్దరూ కలిసి చంద్రముఖి సీరియల్ లో నటించారు. అలా ఇద్దరి మధ్య పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇరు పెద్దలు కూడా వీరి ప్రేమను అశీర్వదించడంతో పెళ్లిపీటలెక్కారు నిరూపమ్, మంజుల. వీరి వైవాహిక బంధానికి ప్రతీకగా నిరూపమ్ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. నిరూపమ్ మళ్లీ చేసుకుంది ఎవర్నో కాదు.. ఆమె భార్య మంజులనే నిరూపమ్ మరోసారి పెళ్లి చేసుకున్నాడు. కాగా ఆదివారం (అక్టోబర్‌ 13) నిరూపమ్, మంజుల పెళ్లి రోజు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే తారీఖున మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారీ లవ్లీ కపుల్.

Nirupam Paritala మళ్లీ పెళ్లి చేసుకున్న కార్తీక దీపం సీరియల్ హీరో నిరుప‌మ్‌ ఎవ‌రినో తెలుసా

Nirupam Paritala : మళ్లీ పెళ్లి చేసుకున్న కార్తీక దీపం సీరియల్ హీరో నిరుప‌మ్‌.. ఎవ‌రినో తెలుసా?

తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిరూపమ్, మంజుల మరోసారి పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయబద్ధంగా నిరూపమ్ మరోసారి మంజుల మెడలో మూడుముళ్లు వేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు నిరూపమ్ దంపతులు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది