Karthika Deepam 2 : బుల్లితెర చ‌రిత్ర‌లో తొలిసారి.. కార్తీక దీపం సీరియ‌ల్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Karthika Deepam 2 : బుల్లితెర చ‌రిత్ర‌లో తొలిసారి.. కార్తీక దీపం సీరియ‌ల్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌..!

Karthika Deepam 2 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించిన సీరియ‌ల్ కార్తీక దీపం Karthika Deepam 2  Serial .ఈ సీరియ‌ల్ గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ సీరియ‌ల్ లోని వంట‌లక్క‌, డాక్ట‌ర్ బాబు Doctor Babu పాత్ర‌లు ప్ర‌తీ ఇంటిలోనూ మార్మోగిపోయాయి. కార్తీక దీపం Karthika Deepam ముగియ‌డంతో దీనికి పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందా అని ప్ర‌తి ఒక్క‌రు క‌ళ్లల్లో ఒత్తులు వేసుకొని మ‌రి ఎదురు […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 March 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  karthika deepam 2 : బుల్లితెర చ‌రిత్ర‌లో తొలిసారి.. కార్తీక దీపం సీరియ‌ల్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌..!

Karthika Deepam 2 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించిన సీరియ‌ల్ కార్తీక దీపం Karthika Deepam 2  Serial .ఈ సీరియ‌ల్ గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ సీరియ‌ల్ లోని వంట‌లక్క‌, డాక్ట‌ర్ బాబు Doctor Babu పాత్ర‌లు ప్ర‌తీ ఇంటిలోనూ మార్మోగిపోయాయి. కార్తీక దీపం Karthika Deepam ముగియ‌డంతో దీనికి పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందా అని ప్ర‌తి ఒక్క‌రు క‌ళ్లల్లో ఒత్తులు వేసుకొని మ‌రి ఎదురు చూశారు. ఈ క్ర‌మంలో నే ఇప్పుడు పార్ట్ 2 కూడా వ‌స్తోంది. ఈనెల 25 నుంచి ‘కార్తీక దీపం 2’ ప్ర‌సారం కాబోతోంది. అయితే దీనికి సినిమా స్థాయిలో ప్ర‌చారం క‌ల్పించే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. Karthika Deepam 2 pre release event

సినిమా స్టైల్‌లో ప్రివ్యూలు, ప్రీమియ‌ర్లు ప్లాన్ చేస్తోంది. గురువారం ‘కార్తీక దీపం 2’ ప్రీమియ‌ర్ హైద‌రాబాద్ Hyderabad లో ఏర్పాటు చేశారు. ఈ సీరియ‌ల్ లోని మొద‌టి భాగాన్ని ముందుగానే కొంత‌మంది ‘కార్తీక దీపం’ అభిమానుల‌కు చూపించ‌బోతున్నారు. ఇన్నాళ్లూ సినిమాల‌కు ప్రీమియ‌ర్లు చూశాం కాని ఈ సీరియ‌ల్ కు ప్రీమియ‌ర్ ఏర్పాటు చేయ‌డం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పాలి. అంతేకాదు సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసిన‌ట్టే ఇప్పుడు ఆ ట్రెండ్ ని సీరియల్స్ కి కూడా తీసుకు వస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఒక సీరియల్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కండక్ట్ చేస్తుండ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హైద‌రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మార్చి 21న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌బోతున్నారు.

karthika deepam 2 బుల్లితెర చ‌రిత్ర‌లో తొలిసారి కార్తీక దీపం సీరియ‌ల్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌

karthika deepam 2 : బుల్లితెర చ‌రిత్ర‌లో తొలిసారి.. కార్తీక దీపం సీరియ‌ల్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌..!

ఈ ఈవెంట్ లో నిరుపమ్ పరిటాల nirupam paritala , ప్రేమ విశ్వనాథ్ premi viswanath పాల్గొనున్నారు. ఈ ఈవెంట్ లోనే మొదటి షో ప్రీమియ‌ర్ వేసి దీనిపై మ‌రింత ప్ర‌చారం క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొత్తానికి సినిమా స్టైల్‌లోనే కార్తీక దీపంకి సీక్వెల్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రీమియర్ చేస్తున్న ప్ర‌చారం దీనిపై మ‌రింత హైప్ పెంచుతుంది. మ‌రి తొలి పార్ట్ మాదిరిగానే రెండో పార్ట్ కూడా ప్రేక్ష‌కుల‌ని అల‌రించి స‌రికొత్త రికార్డ్‌లు క్రియేట్ చేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఐపీఎల్‌ సీజన్ స‌మ‌యం‌లోనూ కార్తీక దీపం సీరియల్‌ టాప్‌ టీఆర్పి రేటింగ్ కొన‌సాగించిందంటే ఈ సీరియల్‌ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో మ‌నం అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక ఇప్పుడు ఈ సీరియల్ త‌ర్వాతి పార్ట్ కూడా ఐపీఎల్ స‌మ‌యంలో ‌ వస్తుండటంతో బుల్లితెర ఆడియన్స్ ఏం జ‌రుగుతుందా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది