Karthika Deepam : వందల కోట్లు పెట్టి సినిమాలు తీసినా కూడా జనాలు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు కానీ లక్షల బడ్జెట్ తో రూపొందించిన సీరియల్స్ ను మాత్రం ప్రతి రోజు.. క్రమం తప్పకుండా రోజు వచ్చే సాగతీత ఎపిసోడ్స్ ను చూస్తూ ఉంటారు. ఈ దిక్కు మాలిన సీరియల్ అనుకుంటూనే ప్రతి రోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఎవరైనా సీరియల్ మిస్ అయితే ఏం జరిగిందో ఏమో అనుకుంటూ ఆ రోజున వచ్చిన ఎపిసోడ్ ను ఈ మధ్య ఓటీటీ లో కూడా చూడటం మొదలు పెడుతున్నారు. అంతగా సీరియల్స్ కు బానిసగా మారిన కొందరి వల్లే కార్తీక దీపం సీరియల్ అంతటి భారీ విజయాన్ని నమోదు చేసింది.
సీరియల్ అంటే కథ ఉండదు.. ఒక సంఘటన ను తీసుకుని సాగతీస్తూ పోవడమే. ఎన్నో సీరియల్స్ కూడా తెలుగు లో ఇలాగే సాగుతున్నాయి అనేది చాలా మంది అభిప్రాయం. ఒక కథతో సీరియల్ మొదలు అయితే అది ఎక్కడికో వెళ్తుంది. సీరియల్ సూపర్ హిట్ అయ్యింది అంటే దాన్ని ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకు వెళ్తూ ఉంటారు. వందల నుండి వేల ఎపిసోడ్స్ కు తెలుగు సీరియల్స్ సాగుతూనే ఉన్నాయి. అయినా కూడా తెలుగు సీరియల్ ప్రేక్షకులు పిచ్చొల్లా మాదిరిగా చూస్తూనే ఉన్నారు. కార్తీక దీపం సీరియల్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అనడం లో సందేహం లేదు.
కార్తీక దీపం సీరియల్ మొదలు అయ్యింది మొదలుకుని సాగతీత దోరణిలో నడుస్తుంది. డాక్టర్ బాబు మరియు వంటలక్క చనిపోయారు అంటూ ఆ మధ్య సీరియల్ లో చూపించారు. దాంతో సీరియల్ కొత్త జనరేషన్ కు మారింది. వారిద్దరి పిల్లలు పెరిగి పెద్ద వారు అయ్యారు. అయితే దర్శకుడు ఏమనుకున్నాడో ఏమో కానీ మళ్లీ చనిపోయిన వారిని తీసుకు వచ్చేశాడు. వంటలక్క ఈజ్ బ్యాక్. సీరియల్ కు ఇప్పటి నుండి ఎలాంటి టర్న్ లు ఉంటాయో అంటూ జనాలు పిచ్చొల్ల మాదిరిగా చూస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. జనాలు ఎలా చూపించినా చూస్తున్నారు కదా అని కార్తీక దీపం సీరియల్ దర్శకుడు మరీ పిచ్చి వాళ్ల మాదిరిగా జనాలను మార్చేస్తున్నాడు అనిపిస్తుంది.
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
Gangavva : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం పదో వారం కూడా పూర్తి కావొస్తుంది. ప్రతి…
Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
This website uses cookies.