Home » Entertainment » Puri Jagannadh Comments About Mahesh Babu Movies
Entertainment

Mahesh Babu : పూరి జగన్నాథ్ వ్యాఖ్యలు మహేష్ బాబును అవమానించినట్లే.. ఫ్యాన్స్ ఫైర్‌

Authored By
aruna
The Telugu News | Published on: August 24, 2022, 7:40 pm
Advertisement

Mahesh Babu : సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో పోకిరి మరియు బిజినెస్ మేన్ సినిమాలకు సీక్వెల్స్ చేయాలని ఉంది అంటూ దర్శకుడు పూరి జగన్నాథ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కానీ ప్రస్తుతం మహేష్ బాబు తన తో సినిమాలు చేసే మూడ్ లో ఉన్నట్లుగా అనిపించడం లేదు అంటూ కామెంట్స్‌ చేశాడు. ఆయన సినిమాల ఎంపిక విషయంలో కూడా పూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాహసం చేయాలని మహేష్ బాబు ఇప్పుడు కోరుకోవడం లేదు. రిస్క్ లేకుండా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు సినిమాల ఎంపిక ఉంటుంది అన్నట్లుగా పూరి జగన్నాథ్‌ వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ సోషల్‌ మీడియాలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

పూరి చేసిన ఆ వ్యాఖ్యలు కచ్చితంగా మహేష్ బాబును అవమానించినట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు రిస్క్ చేయకుండానే ఇన్నాళ్ల కెరీర్ లో సూపర్‌ స్టార్ గా నిలిచాడా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్‌ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అందులో చాలా వరకు ప్రయోగాత్మక సినిమాలే.. అందులో రిస్క్ తీసుకోవడం వల్లే ఎన్నో బ్లాక్ బస్టర్ లు పడ్డాయి. అలాంటి మహేష్‌ బాబును పట్టుకుని ఇప్పుడు రిస్క్ తీసుకునేందుకు మహేష్ బాబు ఆసక్తిగా లేడు అంటూ వ్యాఖ్యలు చేయడం అనేది అవివేకం అవుతుంది అంటూ మహేష్ బాబు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

puri jagannadh comments about mahesh babu movies

Advertisement

మహేష్‌ బాబు రిస్క్ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు అనేది పూరి మాటల ద్వారా రావడంతో కొందరు విమర్శిస్తున్నారు. లైగర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ పలు విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో మహేష్ బాబుతో తాను చేసిన సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. అలా మహేష్ బాబుతో మళ్లీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మహేష్ బాబుతో జనగనమణ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించి.. అది క్యాన్సిల్‌ చేసి అదే టైటిల్‌ తో విజయ్‌ దేవరకొండ తో సినిమాను చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించి ప్రారంభించిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరోసారి మహేష్ బాబును ఉద్దేశించి విమర్శించాడు అంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి