karthika Deepam serial premi vishwanath setires on nirupam went in social media
karthika Deepam : కార్తీకదీపం సీరియల్ గురించి, అందులో నటించే నటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో అంత పాపులర్ ఆ సీరియల్. అందం, స్టేటస్ అనే కాన్సెప్ట్ తో మొదలైన ఈ సీరియల్ ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. సాయంత్రం అయితే తెలుగు మహిళామణులు అంతా టీవీలకు అతుక్కు పోతుంటారు. బుల్లితెర ఆడియన్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ కార్తీక దీపం కారెక్టర్లకు ఉండే క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్.. డాక్టర్ బాబు గా నిరుపమ్ పరిటాలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
వీరివురిపై మీమ్స్ కూడా ఓ రేంజ్ లో వస్తాయని కొత్తగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ షూటింగ్ లతో కాలి సమయం అనేదే లేకుండా గడిపే ఈ ఇద్దరు సోషల్ మీడియాలో సూపర్ ఆక్టివ్ గా ఉంటారు. అయితే డాక్టర్ బాబు పోస్ట్ చేసిన ఓ ఫోటోతో పాటు ఆ ఫోటో కింద వంటలక్క ప్రేమి విశ్వనాథ్ పెట్టిన కామెంట్ ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బుల్లి తెరపై ఎప్పుడు తిట్టుకుంటూ ఉండే కార్తిక్ బాబు, వంటలక్క- దీప ఆన్ సెట్ లో మాత్రం తెగ అల్లరి చేస్తూ ఉంటారట. అలా షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా ఫొటోస్ దిగి ఇన్ స్టా గ్రామ్ లో పెడుతుంటారు.
karthika Deepam serial premi vishwanath setires on nirupam went in social media
అయితే తాజాగా కార్తిక్ బాబు గా పిలవబడే నిరుపమ్ ప్రేమీ విశ్వనాథ్ మీద సెటైర్లు వేస్తూ ఓ పోస్ట్ వేశాడు. ఫోటో దిగుతుంటే మధ్యలో వస్తారు.. మళ్లీ ఇదేంటి ఇలా ఉందని అంటారు.. ఏంటో అసలు.. దీనికి మీరు క్యాప్షన్ చెప్పండి అంటూ తన అభిమానులతో తన బాధను పంచుకున్నాడు ఈ డాక్టర్ బాబు. ఇక తెర మీద భర్త అయిన నిరుపమ్ చేసిన ఈ పోస్ట్‌కు ప్రేమీ విశ్వనాథ్ కూడా అదే రేంజ్ లో రిప్లై ఇచ్చింది. పుష్పలో రష్మిక వలె… అయ్యా సామీ అని సరదాగా కామెంట్ చేసింది. ఇలా ఈ ఇద్దరిని ఇలా చూసి జనాలు మురిసిపోతోన్నారు. బయటి లాగే సీరియల్ లోనూ డాక్టర్ బాబు – దీప కలిసే ఉండేటట్లుగా చూపించ వచ్చుగా అని కోరుతున్నారు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.